
పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికుల మృతి
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గగన్‌పహాడ్ లోని సంజీమ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.