రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి | reactor eruption in incident at nalgonda | Sakshi
Sakshi News home page

రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి

Published Sat, May 17 2014 12:46 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

reactor eruption in incident at nalgonda

బొమ్మలరామారం, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం  మల్యాల గ్రామంలోని   నైట్రోజన్ కెమికల్ కంపెనీలో ఈ నెల 12న జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ప్రొడక్షన్ మేనేజర్ భీమిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు కార్మికులకు గాయాలైన సంఘటన విదితమే. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ప్రొడక్షన్ మేనేజర్ భీమిరెడ్డి వెంకట్‌రెడ్డి(35), మల్యాల గ్రామానికి చెందిన ఊట్ల రాములు(36)లు శుక్రవారం మృత్యువాత పడ్డారు. వెంకట్‌రెడ్డిది గుంటూరు జిల్లా. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నర్సింగ్‌రావు తెలిపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement