chemical factory
-
కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరిలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 దీంతో సమాచారం అదుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 -
సంగారెడ్డి ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఏడుగురు కార్మికుల మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం.. చందాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేసే మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి.దీంతో ఇంకో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే హరీష్ రావు సానుభూతి సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు. ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు -
నల్లగొండ జిల్లాలో భారీ ప్రమాదం.. రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
-
నల్గొండలో భారీ అగ్నిప్రమాదం.. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో..
సాక్షి నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్ధం రావడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొస్తుంది. చదవండి: Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. -
పోరస్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహారం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాలపాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిహారం చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్‌కు చెందిన మనోజ్ మోచి, అవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్‌లకు సంబంధించి పరిహారం చెక్కులను వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్ఫి దేవి, రుమాదేవి, శాంతిదేవిలకు రూ.50 లక్షల చొప్పున రూ.2 కోట్లను అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియాస్ సుధీర్ రవిదాస్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను వారి భార్యలైన రేణుదేవి, కంచన దేవి, రింకు దేవిలకు రూ.15 లక్షలను డీఆర్వో సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, ముసునూరు తహశీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు
అక్కిరెడ్డిగూడెం (ముసునూరు)/నూజివీడు: ప్రమాదాలు, విపత్తుల వేళ తమ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ.. పరిహారం ప్రకటించిన 24 గంటలలోపే బాధిత కుటుంబాలకు అండగా నిలబడి ఆదుకుంటోందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన బొప్పూడి కిరణ్ కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుని భార్య బొప్పూడి సుధారాణికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా.. వారిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన ఉదరుపాటి కృష్ణయ్య. మృతుడి భార్యకు, కుటుంబ సభ్యులకు వివాదం ఉండటంతో ఎక్స్‌గ్రేషియాను భార్యకు ఇవ్వాలా, మృతుడి తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. బీహార్‌కు చెందిన నలుగురు మృతులకు సంబంధించిన లీగల్ హెయిర్ కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ బీహార్‌లోని నలంద జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపారు. అక్కడి నుంచి లీగల్ హెయిర్ వచ్చిన తరువాత వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి తెలిపారు. ఇదిలాఉండగా.. ఆరుగురి మృతికి కారణమైన పోరస్ కెమికల్స్ కంపెనీపై ముసునూరు పోలీస్ స్టేషన్లో ఐపీసీ 337, 338, 304 (జీజీ) సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదైంది. తాత్కాలికంగా మూసివేసిన పోరస్ కంపెనీ వద్ద పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీని డ్రగ్ కంట్రోల్ ఏడీ పాండురంగ వరప్రసాద్ సందర్శించి లైసెన్స్ ఉందా, లేదా అని తనిఖీ చేశారు. క్షతగాత్రులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను శుక్రవారం నూజివీడులో అందజేశారు. ప్రమాదంలో రమణక్కపేటకు చెందిన సాయిల నాగేశ్వరరావు, సూరేపల్లికి చెందిన షేక్ సుభాని, చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన కంచర్ల జోసెఫ్, నూజివీడు పట్టణానికి చెందిన చందోలు రాజీవ్ గాయపడగా.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, తహసీల్దార్ కేఎస్ జోజి పాల్గొన్నారు. -
పోరస్ ఫ్యాక్టరీ మూసివేత
సాక్షి, అమరావతి/నూజివీడు/ముసునూరు/లబ్బీపేట/భవానీపురం: బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురి మృతికి కారణమైన ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ)చట్టం 1974లోని 33ఏ, గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981ను అనుసరించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారు. విద్యుత్ కనెక్షన్‌ను కూడా తొలగించారు. బుధవారం రాత్రి 10.55 గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించడంతో గురువారం సాయంత్రం వరకు ఆరుగురు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు పర్యావరణానికి సైతం నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సీఎఫ్‌వో నిబంధనలు పాటించకపోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమైనట్టు గుర్తించారు. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను క్రమపద్ధతిలో తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎ.కె.పరీడా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. గ్యాస్ లీక్ వల్లే మంటలు ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు తయారయ్యే ఈ ఫ్యాక్టరీలోని డీబ్లాక్‌లో ఉన్న 3కేఎల్ సామర్థ్యం గల స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి గ్యాస్ ఒక్కసారిగా లీకైంది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తిని విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుల్లో నలుగురు బిహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందినవారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిది అక్కిరెడ్డిగూడెం కాగా మరొకరిది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప. ఈ ప్రమాదంలో ఉదురుపాటి కృష్ణయ్య (34), అవదేష్ రవిదాస్ (30), కారు రవిదాస్ (25), మనోజ్‌కుమార్ (25), సువాస్ రవిదాస్ (32), బొప్పూడి కిరణ్ (32) మృతి చెందారు. వీరిలో కృష్ణయ్య కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. తీవ్రంగా గాయపడ్డ 12 మందిని తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. గురువారం కంపెనీ యాజమాన్యం అక్కడికి చేరుకుని వారిని మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించింది. క్షతగాత్రులను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇక్కడ రోష¯Œ (30), సుధీర్ రవిదాస్ (30), రవి (36), వరుణ్‌దాస్ (30), మునారక్ (30), సుధీర్‌కుమార్ (35), జోసెఫ్ (30), వికారి రవిదాస్ (30)తో పాటు స్థానిక గ్రామాలకు చెందిన నాగేశ్వరరావు(30), ముల్లపూడి నాగరాజు (35), ఎస్కే సుభానీ(30) ఉన్నారు. వీరిలో ఏడుగురు బిహార్‌కు చెందిన వారు. సీహెచ్ రాజీవ్ (38)కు 5% గాయాలే కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాక ఇంటికెళ్లాడు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ గురువారం స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు, డీఐజీ పాల్రాజు, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తదితరులు ఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందించనున్నట్టు తెలిపారు. వాల్వ్ సరిగా లేనందునే ప్రమాదం! ఫ్యాక్టరీ దుర్ఘటనకు గ్యాస్ లీకే కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఫ్యాక్టరీ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ ‘సాక్షి’కి వెల్లడించారు. రియాక్టర్ వద్ద వాల్వ్ సరిగా కట్టకపోవడం వల్ల గ్యాస్ లీక్ కావడంతో ఉష్ణోగ్రతలు పెరిగి రియాక్టర్ పేలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సేకరించిన వస్తువులను తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపామని, నివేదిక వచ్చాక వాస్తవ కారణాలు తెలుస్తాయన్నారు. పాలిమర్స్ గ్రాన్యూల్స్ తయారీలో వినియోగించే 4ఎంపీఐ పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తున్నారు. 4వ రియాక్టర్లో 1,500 కేజీలకుపైగా పాథలిక్ ఎన్‌హైడ్రేడ్ అనే కెమికల్ కాంపౌండ్ తయారీలో భాగంగా మిథేల్మెన్ అనే రసాయనాన్ని పంపుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరిగి రియాక్టర్ పేలినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన బిహార్ వాసుల బంధువులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రధాని మోదీ సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని రాజ్‌భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆరా తీశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
పోరస్ లేబొరేటరీస్ మూసివేత
సాక్షి, అమరావతి: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అధికారులు జరిపిన దర్యాప్తులో ఫ్యాక్టరీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. దీంతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ ఏకే ఫరీడ పోరస్ లేబొరేటరీస్‌ను మూసేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కాగా.. పోరస్ లేబొరేటరీస్‌లో అర్థరాత్రి రియాక్టర్ పేలడంతో యూనిట్-4లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా వాతావరణ కాలుష్యం కూడా జరిగింది. -
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ సంతాపం..
-
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
పోరస్ బాధితులకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం..
-
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
-
పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం: హోంమంత్రి తానేటి వనిత
-
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా ఆస్పత్రిలో హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరికీ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున రూ.25 లక్షల పరిహారం అందజేస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని స్థానికులు అంటున్నారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం' అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) -
ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి జయరామ్
సాక్షి, అమరావతి: పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, ప్రమాద పరిస్థితిపై సమీక్షించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆరుగురు కార్మికుల మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మనూరు ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 25లక్షలు అందిస్తుంది. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వారికి రూ.5లక్షలు, చిన్న గాయాలు అయిన వారికి రూ. 2లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు, వారు కోలుకునే వరకు వారికి ఫ్యాక్టరీ తరుపున జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదానికి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) తాత్కాలికంగా మూసేస్తున్నాం: జిల్లా కలెక్టర్ హై ప్రెషర్ కెమికల్ రియాక్షన్ వల్లే పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స జరుగుతున్నంతకాలం కంపెనీ వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా? అనే అంశంపై విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చదవండి: (అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం) -
అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
ఏలూరు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ సంతాపం న్యూఢిల్లీ: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి -
ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి
-
ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్-4లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. మార్గమాధ్యలో ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతంపైగా గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని భాగ్యలక్ష్మి అన్నారు. ఘటనపై సూపర్వైజర్ రాజు స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా భారీ శబ్ధం వచ్చింది. చూసేసరికి ఫ్యాక్టరీ మొత్తం మంటలు అలుముకున్నాయి. కింది విభాగంలో పనిచేస్తున్న అందరం బయటకు పరుగులు తీశాం. పైవిభాగంలో పనిచేస్తున్న కొంతమంది మంటల్లో సజీవదహనమయ్యారు. ప్యాక్టరీలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. -
ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
గుజరాత్లో భరూచ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన అర్ధరాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ దగ్గర పని చేస్తుండగా పేలుడు సంభవించి వాళ్లంతా మృత్యువాత పడ్డట్లు భరూచ్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. ప్రమాదంలో ఇంకెవరూ గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపింది. PM @narendramodi has expressed grief on the loss of lives due to a mishap at a factory in Bharuch. He extends condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000. — PMO India (@PMOIndia) April 11, 2022 -
రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్కరంజి నగర శివార్లలోని వస్త్ర పారిశ్రామిక ఎస్టేట్‌లో ఉన్న యూనిట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో ఉదయం 7.30 గంటలకు నాలుగు అగ్నిమాపక ట్యాంకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 11 గంటలకు మంటలు ఆర్పివేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మేడ్చల్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కాగా, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో.. పోలీసులు, ఫైర్సెఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను నాలుగు ఫైరింజన్ల సహయంతో అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఆకాశంలో నల్లని పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనకు బాయిలర్ పేలుడే కారణమని స్థానికులు తెలిపారు. కాగా, ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.