కర్నూలు(పాణ్యం): గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని కొండజూడూరు గ్రామంలో రూ. 900 కోట్లతో 150 ఎకరాల్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఇటీవల అధికారులు భూ సర్వే నిర్వహించారు. దీనిని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.