
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పుడూర్ మండలం రాకంచర్ల సమీపంలో గల కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు కెమికల్ కాంపౌండింగ్ చేస్తున్న సమయంలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రసాయన వాయువు పీల్చడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో రసాయన వాయువు తీవ్రంగా వెలువడుతోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం ఎటువంటి సేఫ్టీ పరికరాలు లేకుండా కార్మికులతో పనిచేయిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment