బాయిలర్ పేలుడు: యువకుడి మృతి
Published Mon, Sep 11 2017 2:11 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
- ఆరుగురికి గాయాలు
నెల్లూరు: కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement