Massive Fire Accident In Hyderabad Jeedimetla Chemical Factory - Sakshi
Sakshi News home page

మేడ్చల్‌ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..

Published Wed, Jul 28 2021 10:47 AM | Last Updated on Wed, Jul 28 2021 4:53 PM

Fire Accident At Chemical Factory  In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లాలోని పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జీడిమెట్లలోని నాసెన్స్‌ రసాయన పరిశ్రమలో నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కాగా,  స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో.. పోలీసులు, ఫైర్‌సెఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను నాలుగు ఫైరింజన్‌ల సహయంతో అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి.

దీంతో ఆ ప్రాంతంలో ఆకాశంలో నల్లని పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనకు బాయిలర్‌ పేలుడే కారణమని స్థానికులు తెలిపారు. కాగా, ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement