కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం | Massive Fire At Chemical Factory In Gujarat | Sakshi
Sakshi News home page

కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Published Sat, Aug 8 2020 3:26 PM | Last Updated on Sat, Aug 8 2020 3:39 PM

Massive Fire At Chemical Factory In Gujarat - Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని వల్సద్ జిల్లా వాపీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకున్నాయి. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 8 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ప్రమాద కారణాలు,  ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement