సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్-4లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. మార్గమాధ్యలో ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతంపైగా గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని భాగ్యలక్ష్మి అన్నారు.
ఘటనపై సూపర్‌వైజర్ రాజు స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా భారీ శబ్ధం వచ్చింది. చూసేసరికి ఫ్యాక్టరీ మొత్తం మంటలు అలుముకున్నాయి. కింది విభాగంలో పనిచేస్తున్న అందరం బయటకు పరుగులు తీశాం. పైవిభాగంలో పనిచేస్తున్న కొంతమంది మంటల్లో సజీవదహనమయ్యారు. ప్యాక్టరీలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment