సాక్షి, విజయవాడ: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా ఆస్పత్రిలో హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరికీ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున రూ.25 లక్షల పరిహారం అందజేస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని స్థానికులు అంటున్నారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం' అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.
చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment