'మాకొద్దీ కెమికల్ ఫ్యాక్టరీ..' | Villagers protest Chemical Factory construction | Sakshi
Sakshi News home page

'మాకొద్దీ కెమికల్ ఫ్యాక్టరీ..'

Published Thu, Aug 13 2015 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

Villagers protest Chemical Factory construction

పాణ్యం (కర్నూలు) : ప్రజల ప్రాణాలను హరించే ఫ్యాక్టరీలు మాకొద్దంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటురు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామ సమీపంలో నూతనంగా రూ. 900ల కోట్లతో నిర్మించ తలపెట్టిన కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించకూడదని గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి తమ నిరసన తెలిపారు.

శాంతీరాం నానో కెమికల్ ఇండస్ట్రీ కోసం భూ సేకరణ పూర్తైన క్రమంలో ఈ రోజు  గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆర్‌డీవో సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ఇందులో గ్రామస్తులంతా ఫ్యాక్టరీ నిర్మించకూడదని తీర్మానించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement