భార్యాభర్తలమని చెప్పినా వినకుండా..
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రొంపల్లెలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న భార్యభర్తలపై అకారణంగా చేయి చేసుకున్న ఎస్సై తీరుకు నిరసనగా రొపంలెల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
వివరాలు.. శనివారం రాత్రి గ్రామ శివారు నుంచి నడుచుకుంటూ వస్తున్న దళిత జంటపై పెద్పపల్లి ఎస్సై శ్రీనివాస్ అకారణంగా దాడి చేశాడు.. తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ చితకబాదాడు. తాము భార్యభర్తలమని ఎంత చెప్పినా వినకుండా తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనకు నిరసనగా ఆదివారం ఉదయం గ్రామంలో దళిత మహిళలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పడానికి యత్నిస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.