వరంగల్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ములుగును జిల్లా కేంద్రంగా చేయాలంటూ గ్రామస్తులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ములుగు జాతీయరహదారిపై ఆందోళనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో ములుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ములుగు జాతీయరహదారిపై ఉద్రిక్తత
Published Thu, Oct 6 2016 5:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement