peddapally
-
ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు. భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
Peddapalli: శ్మశానంలో ఎముకల దొంగలు!
సుల్తానాబాద్(పెద్దపల్లి): శ్మశానంలో దొంగలు పడ్డారు.. శవాన్ని దహనం చేయగా మిగిలిన పుర్రెలు, ఎముకల్ని చోరీ చేస్తున్నారు.. వీటిని ఏం చేస్తారో తెలియదు కానీ.. కొందరు యువకుల ముఠా ఈ దురాగతానికి పాల్పడుతోంది.. మంత్రతంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాల్ని ఇప్పటిదాకా చూశాం.. విన్నాం.. కానీ, ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల్లో నలుగురి పట్టివేత.. సుల్తానాబాద్‌లోని హిందూ శ్మశానవాటికలో రెండురోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీచేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగుచేసుకుని, ఒక సంచీలో వేసుకుని తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలివేయగా, ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగుచేస్తూ అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా.. కొన్నిరోజులుగా వైకుంఠధామాల్లోని ఎముకలు మాయమువుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి 5, 9, 11వ రోజుల తర్వాత గోదావరి నదిలో కలుపడం సంప్రదాయం. అయితే, కొన్నిరోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమవారి ఎముకలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్ సిబ్బంది రాజకుమార్, వినోద్ పట్టుకున్నారు. మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బందికి సహకరించారు. విచారణ జరుపుతున్న పోలీసులు.. రెండురోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలు పట్టుపడడంతో సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా, పదేళ్లక్రితం మృతదేహాలను కాల్చిన కట్టెల బొగ్గులు తీసుకుని వచ్చి కంకులు కాల్చేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా చేసేవారు. -
అధైర్య పడొద్దు..ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధికారం కోల్పోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, మన సత్తా ఏంటో చూపిద్దామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, మున్ముందు మంచిరోజులు వస్తాయని శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకు రానున్నారని తెలిపారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తరువాత కోలుకుంటున్న కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు జరుపుతారని చెప్పారు. వచ్చే నెలలో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతిరోజూ కార్యకర్తలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫొటో తొలగించినా ప్రజల గుండెల నుంచి తొలగించలేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే పనిలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందనీ కిట్ నుంచి కేసీఆర్ ఫొటో, పేరును తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయి దాలు అన్నట్టుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు.కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు ఇప్పటికీ వేయలేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు., ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కీలక పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు అధికారిక మీటింగ్‌లలో పాల్గొనడం కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. రెవెన్యూ తదితర కీలకమైన శాఖల్లో పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారని, రేవంత్ మనుషులు విచ్చల విడిగా సిటీ చుట్టుపక్కల లే అవుట్లు వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. రేవంత్ కనీస హోం వర్క్‌చేయడం లేదు: కడియం సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలి యదని, సీఎం దేనిపైనా కనీస హోం వర్క్ కూడా చేయడం లేదనిపిస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఫార్మా సిటీ, మెట్రో రైలుపై సీఎం వైఖరి కొన్ని రోజుల్లోనే మారిందన్నారు. అదానీని నాగపూర్‌లో విమర్శించిన సీఎం హైదరా బాద్‌లో అదే అదానీకి రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకా లను ప్రారంభించకపోగా, కేసీఆర్ పథకాలను రద్దు చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గృహలక్ష్మి పథకాన్ని అలాగే కొనసాగించాలన్నారు. దళితబంధు పథకంలో సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాన్నే ఎత్తివేస్తూ దళితులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. -
ఒకేరోజు.. ఒకే చోట.. 6,166 యూనిట్ల రక్తదానం
పెద్దపల్లిరూరల్: తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు అత్యవసరమైన రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ఆదర్శణీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌గోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6006 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6,166 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరంలో సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోకూడా ఒకేరోజు 6,166 యూనిట్ల రక్తం సేకరించిన సందర్భాలు లేవన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తయూనిట్లను రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు అందించేలా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందని సీపీ రెమారాజేశ్వరి అన్నారు. కాగా, ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ దంపతులు రక్తదానం చేశారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి తదితరులు సన్మానించారు. -
పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్!
సాక్షి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. గోరెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, భూషనవేని శ్రీనివాస్, శ్రీరాములు గోపాల్‌కు వార్నింగ్ ఇస్తూ లేఖలు విడుదల చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లేఖలో హెచ్చరించారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని మావోయిస్టు నేత వెంకటేష్ పేరిట లేఖ విడుదల అయ్యాయి. ‘30 మందికి పైగా ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మించి నిరుద్యోగులుగా ఉన్న యువత నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి దగ్గర 4 నుంచి 6 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించలేదు. ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించి మోసం చేయడంతో బాధితులు డబ్బులు వాపస్ ఇవ్వాలని అడిగితే నాయకులంతా ప్రభుత్వ అండదండలతో మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. పోలీసులతో, రాజకీయ నాయకులతో బెదిరిస్తున్నారు. చదవండి: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు డబ్బులు వాపస్ ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకున్న వాళ్లు దిక్కులేని వాళ్లు అయ్యారు. ఆర్ఎఫ్ఎల్ బాధ్యులు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలి. ఈ ముగ్గురు భూ కబ్జాలు చేస్తూ ప్రజల మధ్య తగాదాలు సృష్టించి డబ్బులు తీసుకొని పంచాయితీలు చేయడం, వినని వారిపై కేసులు పెట్టించడం, ఇద్దరి మధ్య ఒప్పందం చేయించి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గ్రామంలో దళితులపై సమస్యలు సృష్టించి వారిని కొట్టించారు. తిరిగి పోలీసులకు చెప్పి గ్రామాన్ని దిగ్భందించి దళితులను తీసుకెళ్లి 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు పెట్టి ఉల్టా కేసులు పెట్టించారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు. గుండాయిజం, భూతగాదాలు, పంచాయితీలు చేయడం మానుకోవాలి, దళితులపై కేసులు ఉపసంహరించుకోని, వారికి క్షమాపనలు చెప్పాలి, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని లేఖలో పేర్కొన్నారు. -
గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టి..
సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్‌కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి.. రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విలపించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని మావోయిస్టు పార్టీ ధృవీకరించకలేదు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిచెందారు. కాగా, రాజిరెడ్డి స్వస్థలం.. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఇక, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే, రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి కూడా ప్రభుత్వం నజరానా కూడా ప్రకటించడం విశేషం. మరోవైపు.. రాజిరెడ్డి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. ఇది కూడా చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
భారీ నష్టాల్లో ఉత్తర డిస్కం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. 2023 జనవరి 1– మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి సంస్థ తాజాగా ప్రకటించిన ‘త్రైమాసిక విద్యుత్ ఆడిట్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ పరిధిలోని 17 జిల్లాల/విద్యుత్ సర్కిళ్లలో మొత్తం 38 విద్యుత్ డివిజన్లుండగా.. డివిజన్ల వారీగా విద్యుత్ సాంకేతిక, ఆర్థిక నష్టాల మొత్తాలను (ఏటీఅండ్‌సీ లాసెస్)ను సంస్థ ఈ నివేదికలో పొందుపరిచింది. మూడు డివిజన్లలో పరిధిలో ఈ నష్టాలు ఏకంగా 70–80 శాతానికి ఎగబాకినట్లు నివేదిక పేర్కొంది. అంటే ఈ డివిజన్లకు సరఫరా చేసిన మొత్తం విద్యుత్‌కు గాను కేవలం 20–30 శాతం బిల్లులు మాత్రమే వసూలయ్యాయన్నమాట. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెద్దయెత్తున బకాయిలు పేరుకుపోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థూలంగా 36 శాతం నష్టాలు గత త్రైమాసికంలో టీఎస్ఎన్పీడీసీఎల్ మొత్తం రూ.4,726.60 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, రూ.3,203.89 కోట్లను (67.78శాతం) మాత్రమే వసూలు చేసుకోగలిగింది. అంటే 36.33 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు నమోదయ్యాయి. డిస్కంల సుస్థిర మనుగడ కోసం ఏటీ అండ్ సీ నష్టాలను 2019–20 నాటికి 6 శాతానికి తగ్గించుకోవాలని ఉదయ్ పథకం కింద కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. అయినా రాష్ట్ర డిస్కంలు అంతకంతకు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. వసూలు కాని ‘ఇతర’ కేటగిరీ బిల్లులు గృహాలు, వాణిజ్యం, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారులు 90 నుంచి 100 శాతం విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్టు త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదిక తెలిపింది. ఇతర కేటగిరీలో మాత్రం చాలా డివిజన్లలో ఒక శాతం బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ డివిజన్ల పరిధిలోని కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్‌హౌస్‌ల విద్యుత్ కనెక్షన్లు ఇతర కేటగిరీలోనే ఉన్నాయి. ఏటీ అండ్ సీ నష్టాలు అంటే..? సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో డిస్కంలకు జరిగే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో.. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలంటారు. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో పాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి..అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ (ఏటీ అండ్ సీ లాసెస్) అంటారు. పెద్దపల్లిలో 80%..కరీంనగర్ రూరల్‌లో 78.99% నష్టాలు పెద్దపల్లి డివిజన్లో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం ఏకంగా 80.18 శాతానికి ఎగబాకి రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ డివిజన్లో గత త్రైమాసికంలో రూ.435.08 కోట్ల విద్యుత్ బిల్లులను జారీ చేయగా, కేవలం రూ.89.63 కోట్లు (20.6%) మాత్రమే వసూలయ్యాయి. డివిజన్ పరిధిలో 1,71,002 విద్యుత్ కనెక్షన్లుండగా, 421.55 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ సరఫరా చేశారు. 15.95 ఎంయూల (3.78 శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు (టీ అండ్ డీ లాసెస్) పోగా, మిగిలిన 405.6 ఎంయూల విద్యుత్‌ను వినియోగించినందుకు గాను వినియోగదారులకు రూ.435.08 కోట్ల బిల్లులు జారీ చేశారు. ♦ కరీంనగర్ రూరల్ డివిజన్లో 78.99 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.445.67 కోట్ల బిల్లులకు గాను రూ.96.28 కోట్లు (21.6%) మాత్రమే వసూలయ్యాయి. ♦ భూపాలపల్లిలో 71.2 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.205.7 కోట్ల బిల్లులకు గాను రూ.80.19 కోట్లే (38.98 శాతం) వసూలయ్యాయి. ఇక అక్కడ టీ అండ్ డీ నష్టాలు సైతం 26.13 శాతంగా ఉన్నాయి. చౌర్యం/సాంకేతిక లోపాలతో ఏకంగా 99.35 ఎంయూల విద్యుత్ నష్టం జరిగింది. ♦ ములుగు డివిజన్లో 61.58 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.122.36 కోట్ల బిల్లులకు గాను రూ.48.97 కోట్లు (40.02 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ♦కరీంనగర్ డివిజన్లో 48.86 శాతంఏటీఅండ్సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.444.12 కోట్ల బిల్లులకు గాను రూ.218.46 కోట్లు (49.10%) మాత్రమే వసూలయ్యాయి. ♦మంథని డివిజన్లో 44.12 శాతం ఏటీఅండ్ సీ నష్టాలున్నాయి. అక్కడ రూ.328.8 కోట్ల బిల్లులకు గాను రూ.144.48 కోట్లు (43.94%) మాత్రమే వసూలయ్యాయి. హన్మకొండ రూరల్‌లో 34.54 శాతం ఏటీఅండ్ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.177.25 కోట్ల బిల్లులకు గాను రూ.124.79 కోట్లు (70.4శాతం) మాత్రమే వసూలయ్యాయి. మరో 7.04 శాతం టీ అండ్ డీ నష్టాలున్నాయి. పైన పేర్కొన్న ఈ డివిజన్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లతో పాటు దేవాదుల, సమ్మక్క సాగర్ వంటి భారీ లిఫ్టులు కూడా ఉన్నాయి. -
తీవ్ర విషాదం: ‘అమ్మా ఇంటికి వస్తున్నా’, వంట చేయమన్నావు కదరా!
పెద్దపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.. అమ్మా ఇంటికి వస్తున్నా.. వంట చేయమన్నావు కదరా.. అంటూ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన కొట్టె పురుషోత్తం–భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కుమారస్వామి, రమేశ్, ప్రభాకర్(42)లు ఉన్నారు. కుమారస్వామి 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పురుషోత్తం తాను చేస్తున్న సింగరేణి ఉద్యోగాన్ని చిన్న కుమారుడు ప్రభాకర్‌కు పెట్టించాడు. దీంతో అతను సీసీ శ్రీరాంపూర్ పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తున్నాడు. రామగుండం ఎన్టీసీపీ క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య కవిత ఉంది. సంఘటన స్థలాన్ని ఎస్సై జీవన్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిననట్లు పేర్కొన్నారు. ప్రభాకర్ మృతదేహాన్ని రాత్రి కూనారం తీసుకురాగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్ యాదవ్, సర్పంచ్ డొంకెన విజయ, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లూరి రమాదేవి, ఏఎంసీ చైర్పర్సన్ కొట్టె సుజాత, సింగిల్‌విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, నాయకులు కొట్టె సమ్మయ్య, గ్రామస్తులు నివాళులరి్పంచారు. -
Vidya Laxmi Loan: ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు కేంద్రం సాయం..
సాక్షి, యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం): ప్రస్తుతం ఉన్నత చదువులంటే రూ.లక్షల్లో వ్యయం. ఈ పరిస్థితుల్లో ప్రతిభ ఉన్నా ఆర్థిక స్తోమత లేక చదువుకు దూరమయ్యేవారు ఎందరో. విద్యార్థుల ప్రతిభే దేశ భవిష్యత్‌కు పెట్టుబడి. అందుకే దానికి పేదరికం అడ్డు కాకూడదని కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకం కింద బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. మన దేశంలో, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు రుణ రూపంలో ఇచ్చే నగదు మొత్తాన్ని చదువు పూర్తయిన ఏడాది తర్వాత చెల్లించే వెసులుబాటు ఉండటం మరో ప్రయోజనం. ఈ నేపథ్యంలో రుణ పరిమితి, దరఖాస్తు విధానం, తిరిగి చెల్లించడం ఎలా అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ కోర్సులకు ఇస్తారు.. విద్యార్థులు ప్రతిభావంతులై ఉండాలి. మంచి ర్యాంకుల రికార్డు ఉండాలి. విద్యార్థి ఎంత చురుగ్గా ఉన్నాడనే దానిపై రుణం ఇచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ తదితర కోర్సులకు ఆయా విశ్వవిద్యాలయాల స్థాయిని బట్టి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. విదేశాల్లో విద్యనభ్యసించాలంటే అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొంది ఉండాలి. రుణాలిచ్చే బ్యాంకులు.. విద్యాలక్ష్మి పథకం కింద ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకు, యూబీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ, విజయా బ్యాంకు తదితర 13 వాణిజ్య బ్యాంకులు విద్యార్థులకు రుణాలు ఇస్తున్నాయి. రూ 4.5 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు.. దేశీయ విద్యకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు, విదేశీ విద్యకు రూ.15 లక్షల నుంచి రూ.60 లక్ష ల వరకు రుణం మంజూరు చేస్తారు. ఎస్బీఐతో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి పేరుగాంచిన సంస్థల్లో చదవాలనుకునేవారికి గరిష్టంగా రూ.1.5 కోట్ల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రు ల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలలోపు ఉన్న వి ద్యార్థులు రుణం తీసుకుంటే వడ్డీ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దేశీయ విద్యకు రూ.7.5 లక్షల రుణం తీసుకుంటే 10 శాతం, ఆపైన తీసుకుంటే 10.75 శాతం వడ్డీ వసూలు చేస్తాయి (వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటాయి). రూ.4 లక్షల రుణం వరకు ఎవరూ హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ మొత్తం దాటి రూ. 7.5 లక్షల వరకు మూడో వ్యక్తి హామీ ఇవ్వాలి. ఇంకా ఎక్కువైతే ఆస్తులను హామీగా పెట్టాలి. రుణం తిరిగి చెల్లించే విధానం.. విద్యార్థి కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత నుంచి అసలు, వడ్డీ కలిపి ఆయా బ్యాంకుల నిబంధనల ప్రకారం చెల్లించాలి. గరిష్టంగా పదేళ్లలో వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. చదువు కొనసాగుతుండగానే తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి చెల్లింపులు చేస్తే రుణభారం తగ్గుతుంది. ఇది విద్యార్థి తల్లిదండ్రుల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల నుంచి ఒత్తిడి ఉండదు. పథకంపై పర్యవేక్షణ ఇలా.. విద్యాలక్ష్మి రుణాలు అందించే ఈ–పోర్టల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేంద్ర ఉన్నత విద్యా, మానవ వనరుల విభాగం, భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) సంయుక్త భాగస్వామ్యంలో పథకాన్ని పర్యవేక్షిస్తారు. అంతిమంగా విద్యార్థులకు రుణాలిచ్చేవి బ్యాంకులే. కొన్ని దరఖాస్తులను తిరస్కరించే హక్కు కూడా వాటికి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. విద్యాలక్ష్మి పథకం కింద రుణం పొందాలనుకునే వారు హెచ్‌టీటీపీఎస్: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విద్యాలక్ష్మి.కో.ఇన్‌లో లాగిన్ అవ్వాలి. మొదటి పేజీలోని రిజిస్టర్ బాక్స్‌ను క్లిక్ చేయాలి. అందులో అడిగిన పేరు ఇతర వివరాలు నమోదు చేయాలి. తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. వాటి ఆధారంగా రెండో బాక్స్ తెరవాలి. ఇందులో సింగిల్ ఫారం అని కనిపిస్తుంది. అందులోనూ అవసరమైన వివరాలు నమోదు చేయాలి. మూడో బాక్స్ తెరిచి, ఆఫ్‌లైన్ మల్టిపుల్ బాక్స్‌పై క్లిక్ చేయాలి. మనం ఏ బ్యాంకు ద్వారా రుణం పొందాలనుకుంటున్నామో వివరాలు నమోదు చేయాలి. అనంతరం అర్హతను బట్టి మనకు ఎంత రుణం వస్తుంది? ఎంత వడ్డీ.. ఎన్ని వాయిదాల్లో తిరిగి చెల్లించాలి అనే వివరాలను ఎప్పటికప్పుడు మన పాస్వర్డ్ ద్వారా వెబ్సైట్లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. జత చేయాల్సిన ధ్రువపత్రాలు.. విద్యా రుణం పొందాలనుకునే విద్యార్ధులు తాము చవరగా చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ సర్టిఫికెట్, మార్కుల జాబితా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం పొందినట్లయితే ఆ వివరాలు, ఉన్నత విద్యా ర్యాంకు కార్డు, ప్రభుత్వ అనుమతి పత్రాలు, చేయాల్సిన కోర్సు మొత్తం ఫీజు వివరాలు, తల్లి, తండ్రి, సంరక్షకుడి పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్థి పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్థి తల్లి, తండ్రి ప్రభుత్వ ఉద్యోగులైతే వారి ఆదాయ ధ్రువపత్రాలు, నివాసాన్ని ధ్రువీకరించే ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ జిరాక్స్ జత చేయాలి. -
కుమారుడ్ని బావిలోకి నెట్టి చంపిన తల్లి
-
పెళ్లి కావడంలేదనే బాధతో..
సాక్షి, పెద్దపల్లి: మూడుపదులు నిండినా పెళ్లి కావడంలేదనే ఆవేదనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో శనివారం జరిగింది. ఎస్సై ఉపేందర్‌రావు వివరాల ప్రకారం..భూంనగర్‌కు చెందిన అతీక్ అహ్మద్ (30) కొద్దిరోజులక్రితం దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. పెళ్లి చేసుకుని తిరిగి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మాయి లభించకపోవడంతో నిరాశకు గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అప్పుడు వాళ్లే..ఇప్పుడు వాళ్లే
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు లోక్‌సభ బరిలోకి దిగి మరోసారి తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరుపు నుంచి పోటీ పడుతున్న రాథోడ్ రమేష్ ఖానాపూర్ అసెంబ్లీకి, బీజేపీ నుంచి ఎంపీ బరిలో దిగిన సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీకి పోటీ చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి లోక్‌సభ బరిలోనూ టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వెంకటేష్ నేతకాని గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నుంచి పోటీ పడి ఓటమి చెందిన వారే. వీరితోపాటు మరో ఐదుగురు ఇతర అభ్యర్థులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన వారుండటం గమనార్హం! మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు వీరిని వెక్కిరించిన అదృష్టం.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా వరిస్తుందో లేదో వేచిచూడాలి. ఖానాపూర్ నుంచి రాథోడ్ రమేష్.. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,49,380 ఓట్లు పోలవగా, రాథోడ్ రమేష్‌కు 46,428 వచ్చాయి. రేఖానాయక్‌కు 67,138 ఓట్లు వచ్చాయి. 20,710 ఓట్ల తేడాతో రమేష్ రాథోడ్ ఓటమి చెందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభకు టీడీపీ నుంచి పోటీ చేయగా, 1.84 లక్షల ఓట్లు రావడంతో రమేష్ రాథోడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈయనకు 3.72 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో అప్పుడు ఎంపీ అయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బోథ్ నుంచి సోయం బాపూరావు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీకి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 1.54 లక్షల ఓట్లు పోలవగా, సోయం బాపూరావుకు 54,639 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రాథోడ్ బాపూరావుకు 61,125 ఓట్లు రావడంతో ఆ ఎన్నికల్లో సోయం బాపూరావు 6,486 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోయం బాపూరావు 35,218 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నూర్ నుంచి వెంకటేష్ నేతకాని.. చెన్నూర్ అసెంబ్లీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడిన వెంకటేష్ నేతకాని టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వెంకటేష్ నేతకానికి 43,848 ఓట్లు వచ్చాయి. చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్‌కు 71,980 ఓట్లు రావడంతో 28,132 ఓట్ల తేడాతో వెంకటేష్ నేతకాని ఓటమి పాలయ్యారు. తద్వారా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీగా పని చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానంలోకి వచ్చి లోక్‌సభకు పోటీపడుతుండటం విశేషం. ఇతరులు కూడా.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ఐదుగురు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. సిర్పూర్ నుంచి పోటీ చేసిన గంట పెంటన్నకు అప్పుడు 595 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్‌సభ బరిలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీ చేసిన సబ్బని క్రిష్ణకు ఆ ఎన్నికల్లో 1812 ఓట్లు వచ్చాయి. అదే నియోజకవర్గానికి అసెంబ్లీ బరిలో నిలిచిన అంబాల మహేందర్‌కు 706 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో రామగుండం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఇరికిల్ల రాజేష్‌కు ఆ ఎన్నికల్లో 299 ఓట్లు వచ్చాయి. ధర్మపురి అసెంబ్లీకి పోటీ చేసిన కుంటాల నర్సయ్యకు 13,114 ఓట్లు వచ్చాయి. వీరు నలుగురు ప్రస్తుతం పెద్దపల్లి లోక్‌సభ బరిలో ఉన్నారు. -
అనితరసాధ్యుడు.. కోదాటి రాజమల్లు
చెన్నూర్: మహాత్ముడి భావజాలానికి ఆకర్షితుడైన ఓ బాలుడు.. ఇంటిని వదిలి పోరుబాట పట్టాడు. స్వశక్తితో చదివి తిరిగి స్వస్థలానికి చేరుకొని స్థానికంగా కొనసాగుతున్న ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనోద్యమంలో కీలకంగా వ్యవహరించిన అతడు.. ఒకసారి ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి అనితరసాధ్యుడిగా గుర్తింపు పొందాడు. చరిత్రే తన పేరును సగౌరవంగా ఉచ్ఛరించేలా చేసుకున్న ఉత్తమ ప్రజాప్రతినిధి ‘కోదాటి రాజమల్లు’ గురించి సంక్షిప్తంగా.. బాల్యం.. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలుకా అలిపురం చెందిన కోదాటి రాజయ్య, రాజవ్వ దంపతులకు 1924లో కోదాటి రాజమల్లు జన్మించారు. అప్పట్లో గ్రామంలో ప్లేగు వ్యాధి విజృంభించడంతో రాజమల్లు కుటుంబం ఖమ్మం జిల్లాలోని పునరావాస కేంద్రానికి వెళ్లిపోయి, కొంతకాలం అక్కడే ఉండిపోయింది. రాజమల్లు ఏడాది వయసున్నప్పుడు తండ్రి రాజయ్య ఉపాధి నిమిత్తం కొత్తగూడెంలోని ఇల్లంతకుంటకు వలసవచ్చారు. అక్కడ కూడా ఉపాధి దొరక్కపోవడంతో బెల్లంపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. బెల్లంపల్లి బొగ్గు గనుల్లో రాజమల్లు తండ్రి రాజయ్య, తల్లి రాజమ్మ కలిసి పని చేశారు. కొంతకాలానికి రాజయ్యకు సింగరేణి గనిలో ఫోర్‌మన్‌గా ప్రమోషన్ రావడంతో రాజమ్మను పని మాన్పించి, కొడుకు రాజమల్లు బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. పోరాట ప్రస్థానం.. చిన్ననాటి నుంచే రాజమల్లు పరాయి పాలనను వ్యతిరేకించేవాడు. నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాడు. ఈ క్రమంలో మహాత్మగాంధీ వార్ధా ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు బెల్లంపల్లి స్టేషనులో రైలు ఆగినప్పుడు కాసేపు అక్కడ ప్రసంగించారు. ఆ ప్రసంగంతో ఉత్తేజితుడైన రాజమల్లు తర్వాతి కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలను చైతన్యపర్చడంలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయా సంఘాల నాయకులతో కలిసి రహస్యంగా సమీప అడవుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించేవాడు. ఇదంతా రాజమల్లు తండ్రి రాజయ్యకు తెలియడంతో, ఆయన కొడుకు మందలించాడు. దీంతో తన ఉద్యమానికి కుటుంబం అడ్డురాకూడదని భావించిన రాజమల్లు ఎవరికీ చెప్పకుండా ఇంటిని వదిలి నేటి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీనాలీ చేస్తూ బతకడమే కాకుండా బీఏ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత తిరిగి బెల్లంపల్లిలోని సొంతింటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి మిత్రుల ద్వారా సింగరేణి కార్మికుల కష్టాల గురించి తెలుసుకున్నాడు. అప్పుడే కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ఓ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సింగరేణి కార్మికులు యాజమాన్యాన్ని వ్యతిరేకించేలా వారిని చైతన్యపర్చాడు. రాజమల్లు చేస్తున్న తిరుగుబాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, అతన్ని నిర్భంధించేందుకు పూనుకోవడంతో నిరంతరం నిలకడలేని ప్రయాణాలు చేస్తూ వివిధ వేషాల్లో తలదాచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమల్లును మహారాష్ట్ర ప్రాంతంలో గుర్తించి అక్కడి ఔరంగబాద్ జైలులో నిర్బంధించారు. అనంతరం అండమాన్ జైలుకు తరలిస్తుండగా రాజమల్లు తప్పించుకొని కొంతకాలం రహస్య జీవనం సాగించాడు. 1948లో నిజాం పాలన అంతమవడంతో రాజమల్లు తిరిగి తన తోటి ఉద్యమకారులైన కేశవరావు, అర్జునరావు, వెంకటరావు, పాపయ్య, ఎ.రామిరెడ్డి, కేవీ మీన, పి.మాధవరెడ్డి, విశ్వనా«థ్, సోది రామయ్యతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి బెల్లంపల్లి చేరుకొని సింగరేణిలో టైమ్ కీపర్‌గా పని చేశాడు. రాజకీయ పథంలో.. 1952లో రాజకీయ ప్రవేశం చేసిన రాజమల్లు అదే ఏడాది కాగజ్‌నగర్, చెన్నూర్ ఉమ్మడి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసి ఎస్సీ రిజర్వేషన్‌తో రాజమల్లు, జనరల్ కోటాలో విశ్వనాథసూరి గెలుపొందారు. అనంతరం 1962, 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుస ఘన విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. తర్వాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజమల్లు చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పని చేసి.. చెన్నూర్, బెల్లంపల్లిలో ప్రాంతాల్లో పలు ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. కార్మికులకు కొండంత అండగా.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం కూడా రాజమల్లు కృషి చేశారు. బొగ్గు గని కార్మిక చరిత్రలో నిలిచిపోయేలా 1956లో ఆయన నేతృత్వంలో ఓ సుదీర్ఘ పోరాటం కూడా జరిగింది. రాజమల్లు ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం 57 రోజులపాటు సమ్మె చేశారు. కార్మికులకు వేతనం పెంపు, మృతి చెందితే నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు 47 డిమాండ్లు నెరవేర్చాలని రాజమల్లు నిరహార దీక్షకు దిగారు. సమ్మె కొనసాగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు రెచ్చిపోయి సింగరేణి సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్‌లు చేసినా రాజమల్లు సైన్యం దీక్షను విరమించకపోవడంతో సింగరేణి యాజమాన్యమే 21 రోజుల తర్వాత దిగివచ్చి 37 డిమాండ్లను అంగీకరించింది. ఇలా తన జీవితమంతా పోరాట పథంలో గడిపిన కోదాటి రాజమల్లు ఎంపీగా కొనసాగుతుండగానే 1983లో ఫిబ్రవరి 20న గుండెపోటుతో ఆకస్మికంగా తనువు చాలించారు. ఆయనకు భార్యతోపాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. -
పెద్దపల్లి టాప్.. వరంగల్, చార్మినార్‌లకు కూడా అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ కేంద్రంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఇందులో భాగంగా కేంద్ర పారిశుద్ధ్య శాఖా మంత్రి ఉమాభారతి స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డులను ప్రదానం చేశారు. పారిశుద్ద్యం పాటించడంలో అత్యంత శ్రద్ధ కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాల వారీగా వివిధ విభాగాల్లో అవార్డులు అందజేశారు. సాఫ్, స్వచ్ఛతా పక్వాడ, స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేసెస్ వంటి విభాగాల్లో తెలంగాణ నాలుగు అవార్డులు దక్కించుకుంది. పెద్దపల్లి టాప్.. వరంగల్, చార్మినార్‌లకు దక్కిన అవార్డులు దక్షిణాది స్వచ్ఛతా ర్యాంకింగ్స్‌లో 81.48 పాయింట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు గాను పంచాయతీ ఉమా భారతి చేతుల మీదుగా పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ (SSBMG ప్రాజెక్ట్ డైరెక్టర్) నీతూ కుమారీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. అదే విధంగా స్వచ్చతాలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దపల్లికి మొదటి స్థానం దక్కగా.. కలెక్టర్ శ్రీదేవసేన ఈ అవార్డును అందుకున్నారు. అలాగే దక్షిణాది జిల్లాల స్వచ్ఛతాలో 95.59 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన వరంగల్ అవార్డును ఆమ్రపాలి అందుకున్నారు. ఇక స్వచ్ఛతా ఐకాన్ విభాగంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిన చార్మినార్ అవార్డును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్, జీహెచ్ఎంసీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ స్వీకరించారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. భయాందోళనలో వాహనదారులు
పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. కరీంనగర్-రాయపట్నం రహదారిలో విశాఖ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్ ట్యాంకర్(కేఏ 01 ఏజీ 3552) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్లకు గాయాలు కాగా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
సెల్‌ఫోన్ ఆర్డరిస్తే.. నడుం బెల్ట్ వచ్చింది!
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సామ్సంగ్ సెల్‌ఫోన్ అసలు ధర రూ. 16 వేలు. మీకొచ్చిన గిఫ్ట్కూపన్తో రూ. 4 వేలకే వస్తుందని వచ్చిన ఫోన్‌కాల్‌ను నమ్మిన ఓ యువకుడు మోసపోయాడు. పెద్దపల్లి జిల్లా యైటిం క్లయిన్కాలనీ రాజీవ్‌నగర్‌తండాకు చెందిన గొడిసెల సతీష్‌కు గతనెల 26న తన మోబైల్‌కు 9848439934 నంబర్ నుంచి కాల్ వచ్చింది. సామ్సంగ్ ఫోన్ అసలు ధర రూ. 16 వేలు, ఆఫర్ ద్వారా రూ.4 వేలకే వస్తుందని ఎదుటి వ్యక్తి చెప్పడంతో సతీష్ ఆర్డర్ చేశాడు. మంగళవారం స్థానిక పోస్టాఫీస్‌కు పార్శిల్ చేరింది. పోస్టాఫీస్‌కు వెళ్లి సతీష్ రూ.4 వేలు చెల్లించి అట్టడబ్బాను తీసుకున్నారు. బాక్స్ తెరిచి చూసే సరికి నడుం బెల్ట్ కనిపించింది. ఇదేమిటని ఆయన పోస్టాఫీస్ సిబ్బందిని అడుగగా మాకేమీ సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. ఆందోళన చెందిన బాధితుడు మొదట్లో కాల్వచ్చిన ఫోన్‌నంబర్‌కు కాల్చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న సతీష్ గోదావరిఖని టూటౌన్పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. -
కన్న కొడుకుల కర్కశత్వం
► తల్లిని చేరదీయని తనయులు ► ఆరెకరాల భూమున్నా అనాథలా ‘అవ్వ’ ► ఆర్నెల్లుగా నరకయాతన పెద్దపల్లిరూరల్: పున్నాగనరకం నుంచి తప్పించేవాడు కొడుకు.. కానీ.. ఈ అవ్వకు మాత్రం బతికుండగానే నరకం చూపిస్తున్నారు ఆమె కొడుకులు. నవమాసాలు మోసి.. కని.. అల్లారుముద్దుగా పెంచినా.. మలిదశలో ఆమెపై కనికరం చూపడం లేదు. కన్నతల్లి భారమైందో..? ఏమో..? గానీ.. ఆ తల్లిని అనాథను చేసి బస్టాండ్‌లో వదిలేశారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన ఈదునూరి హన్మమ్మ, రాజపోచయ్యకు ఐదుగురూ కుమారులే. వీరిలో అంజయ్య, బాలయ్య, మల్లేశ్ చనిపోయారు. మిగిలినవారిలో పెద్దకుమారుడు రవి చొప్పదండిలో ఉంటూ.. కూలీ చేసుకుంటున్నాడు. మరో కుమారుడు కిష్టయ్య హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. హన్మమ్మ పేరిట తుర్కలమద్దికుంటలో సొంత ఇంటితోపాటు ఆరెకరాల భూమి ఉంది. ఆమె మనవలు రమేశ్, అంకూస్, రంజిత్, సాగర్ కొత్తగా ఇంటిని నిర్మిస్తామంటూ ఉన్నదాన్ని కూల్చివేశారు. అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. పెద్దపల్లిలో ఉండే మనవలు, బంధువుల వద్దకు వచ్చినా.. ఆదరించలేదు. పైగా ఆమెకు వస్తున్న పింఛన్‌ను మాత్రం నెలనెలా తీసుకునేవారు. కొన్నిరోజులు పట్టణంలోనే యాచిస్తూ పొట్టపోసుకున్న ఈ అవ్వ.. అనారోగ్యంబారిన పడడంతో మనవడు సాగర్ రెండునెలలు పోషించి.. రెండురోజుల క్రితమే హైదరాబాద్‌లోని కిష్టయ్య ఇంటివద్ద వదిలివచ్చాడు. ఆ మరుసటిరోజు ఉదయమే.. హన్మమ్మను తుర్కలమద్దికుంటలోని పోచమ్మ గుడివద్ద దించి వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు. ఇదే విషయాన్ని పెద్దపల్లిలో ఉంటున్న మనవలు, బంధువులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. గ్రామ పోలీస్ «అధికారికి చెప్పి ఆశ్రయం కల్పించాలని కోరినా నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చలితో గజగజ వణుకుతున్న అవ్వ.. చేసేదేమీ లేక ఆమెను స్థానికులు శనివారం రాత్రి పెద్దపల్లి బస్టాండ్‌కు తీసుకొచ్చారు. ‘సాక్షి’కి సమాచారం అందించగా.. స్థానికులతో కలిసి ఓ దుప్పటి అందించి.. ఆమెకు భోజనాన్ని సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కన్నతల్లిని కాదనుకుని.. ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినా.. ఆ కొడుకులపై మాత్రం ఎలాంటి ద్వేషం చూపకుండా ఆ అవ్వ మాట్లాడడం అక్కడున్న వారిని కలచివేసింది. -
భార్యాభర్తలమని చెప్పినా వినకుండా..
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రొంపల్లెలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న భార్యభర్తలపై అకారణంగా చేయి చేసుకున్న ఎస్సై తీరుకు నిరసనగా రొపంలెల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వివరాలు.. శనివారం రాత్రి గ్రామ శివారు నుంచి నడుచుకుంటూ వస్తున్న దళిత జంటపై పెద్పపల్లి ఎస్సై శ్రీనివాస్ అకారణంగా దాడి చేశాడు.. తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ చితకబాదాడు. తాము భార్యభర్తలమని ఎంత చెప్పినా వినకుండా తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనకు నిరసనగా ఆదివారం ఉదయం గ్రామంలో దళిత మహిళలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పడానికి యత్నిస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారినుంచి తుపాకీ, 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల్లో ఒకరు విజయవాడ వాసి భరణకుమార్ కాగా.. మరొకరిని ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. -
మినహాయిస్తే మేలు..
విద్యాసంస్థల భవనాల్లో కార్యాలయాలు వద్దన ప్రభుత్వం పెద్దపల్లి ఐటీఐ భవనంలో సాగుతున్న కలెక్టరేట్ పనులు భవిత పాఠశాల భవనం ఎస్ఎస్ఏకు కేటాయింపు వసతిగృహాలను తరలించే యోచనలోనే అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సంఘాలు పెద్దపల్లిరూరల్/జగిత్యాల అర్బన్ : ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన భవనాల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. విద్యాసంస్థల భవనాలను తీసుకోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం విద్యాసంస్థలను నిర్వహిస్తున్న భవనాలను మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అలాంటి భవనాలను ఎంపిక చేస్తే.. వాటి స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలని సూచించింది. అయితే జగిత్యాల, పెద్దపల్లిలో పలు విద్యాసంస్థల భవనాల్లో మాత్రం పనులు యథాతథంగా కొనసాగుతుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపల్లి ఐటీఐలో కలెక్టరేట్.. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ భవనాల్లోనే కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించడంతో పనులు చకాచకా సాగుతున్నాయి. ఐటీఐలో ప్రభుత్వ కార్యాలయాలు వద్దని, వసతిగహాలకు మినహాయింపు ఇవ్వాలని పెద్దపల్లిలో విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయం విదితమే. అయినా పెద్దపల్లిలో జిల్లా కార్యాలయాలకు కేటాయించిన విద్యాసంస్థలు, వసతిగహ భవనాల్లోనే కొత్త కార్యాలయాల పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. పెద్దపల్లిలో 52 ఏళ్ల క్రితం ఏర్పాౖటెన ఐటీఐ ఇప్పుడు క్యూఐసీ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు ఎంపికైంది. ఇందులో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు విద్యార్థుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఐటీఐ భవనాల్లో కలెక్టరేట్‌కు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ఐటీఐ విద్యార్థులను ఆవరణలోని షెడ్లలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఐటీఐ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం రావడంతోపాటు విద్యార్థుల అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు చేసుకునేందుకు వీలుండేదంటున్నారు. ప్రభుత్వాదేశాలను ఇక్కడి అధికారులు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలను మినహాయించాలని ఇచ్చిన ఆదేశాల మేరకైనా ఐటీఐలో నిర్మాణాలు ఆపితే బాగుండేదని ప్రిన్సిపాల్ సురేందర్ అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో... పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఆర్ఐవో, ఆర్వీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. భవిత కేంద్రంలో... పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో బుద్ధిమాంద్యం, ప్రత్యేకావసరాలు గల పిల్లలకోసం నిర్మించిన భవిత కేంద్రాన్ని ఖాళీ చేయించి సర్వశిక్షాభియాన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిత కేంద్రాన్ని ఏదైనా పాఠశాల ఆవరణలోకి మార్చాలని సూచించారు. అయితే బుద్ధిమాంద్యం, వైకల్యం గల పిల్లలకోసం ర్యాంపును నిర్మించి పైపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవేవీ పట్టని అధికారులు ఖాళీ చేయాలంటూ ఆదేశాలివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 16మంది విద్యార్థులున్నారు. తప్పనిసరైతే ప్రత్యామ్నాయ భవనంలో పిల్లల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టిన తర్వాతే అందులోకి పంపాలని కోరుతున్నారు. ప్రగతినగర్ హాస్టల్‌పై కన్ను.. పెద్దపల్లి ప్రగతినగర్ చౌరస్తావద్ద కొత్తగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతిగహాన్ని అన్ని ఇంజనీరింగ్ శాఖల ఎస్ఈలకు కేటాయించారు. ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులను సమీపంలోని ఎస్సీ హాస్టల్–2కు పంపించే యోచనలో ఉన్నారు. రాజీవ్ రహదారి పక్కనే ఉండటంతో ఈ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త హాస్టల్లో నీటివసతి ఉందని, అవసరమైతే ఎస్సీ హాస్టల్–2నే ఇందులోకి మార్చి, అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసి తమ చదువులను పాడు చేయవద్దని వేడుకుంటున్నారు. ఆదేశాలు అందలేదు.. –అశోక్‌కుమార్, ఆర్డీఓ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు విద్యాసంస్థలను మినహాయింపు ఇవ్వాలనే ఆదేశాలేమీ అందలేదు. ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టరేట్ కార్యాలయ పనులు సాగుతున్నాయి. ప్రగతినగర్ వసతిగహంతోపాటు రంగంపల్లిలోని ఆనంద నిలయంలోనూ కార్యాలయాల ఏర్పాటు చేస్తాం. విద్యార్థుల పరిస్థితి ఎలా? జగిత్యాల అర్బన్ : జగిత్యాలలోని ఎస్టీ హాస్టల్‌ను జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి కేటాయించారు. హాస్టల్లో 96 మంది విద్యార్థులు ఉంటున్నారు. పక్కన ఎస్సీ–1, ఎస్సీ–2 వసతిగహాలు ఉన్నాయి. ఎస్సీ–1 హాస్టల్లో ఉన్న 70 మంది విద్యార్థులను ఎస్సీ–2 హాస్టల్‌కు తరలించారు. ఎస్సీ–1 భవనంలోకి ఎస్టీ విద్యార్థులను తరలించారు. ఎస్సీ–2 హాస్టల్లో ఉన్న 70 మంది, ఎస్సీ–1లోని 70 మంది మొత్తం 140 మంది విద్యార్థులు ఒకే వసతిగహంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన బిల్డింగ్‌లో కొనసాగుతున్న ఎస్సీ హాస్టల్ వసతిగహాన్ని పాత ఎస్సీ హాస్టల్–1లోకి కేటాయించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులో మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతభవనం కావడంతో బాత్రూమ్లు సక్రమంగా లేవు. రూములు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వంటగదులు అనుకూలంగా లేవు. నీటివసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎస్టీ హాస్టల్ భవనంలో ఎస్పీ, ఏఎస్పీ ఆఫీసులతోపాటు ఇతర చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.6లక్షల వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నారు. గదులను కూల్చి చాంబర్లకు అనుకూలమైన రీతిలో కడుతున్నారు. ఇప్పటికే సగం మేర మరమ్మతులు పూర్తిచేశారు. విద్యాసంస్థల భవనాలను మినహాయించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. -
కలెక్టర్‌కు లక్కపురుగుల బెడద!
పెద్దపల్లిలో గోదాం పక్కనే కలెక్టరేట్? ఐటీఐపై అధికారుల తర్జన భర్జన పెద్దపల్లి : కొత్త కలెక్టర్‌కు లక్కపురుగులు స్వాగతం పలకనున్నాయి. క్షేత్రస్థాయి అధికారుల అనాలోచిత నిర్ణయం.. ముందుచూపు లేమి కారణంగా ఉన్నతాధికారులు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను పట్టణ శివారులోని ఐటీఐలో కొనసాగించాలని నిర్ణయించారు. కళాశాల ప్రహరీ పక్కనే సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ బియ్యం గోదాములున్నాయి. ఇక్కడ నిత్యం లక్కపురుల బెడద తీవ్రంగా ఉంటోంది. చుట్టుపక్కల వారు ఏళ్లకు ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కలెక్టరేట్ నిర్వహణ ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొందరు పురుగుల బెడద నివారించడానికి క్రిమిసంహారక మందు వాడకం మోతాదు పెంచాలని నిర్ణయించారు. క్రిమిసంహారక మందు వినియోగం పెంచితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. మందు ప్రభావం ఎక్కువైతే నిల్వచేసిన బియ్యం మొత్తానికి పనికిరాకుండా పోతాయని నిపుణులు అంటున్నారు. గోస ఇప్పుడు తెలిసిందా..? రాఘవాపూర్‌లోని గోదాముల ద్వారా పుట్లకొద్డీ లక్కపురుగులు దాడిచేసి నిద్రలేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారుల ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు ఆ అధికారులే కలెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. లక్కపురుగులంటూ హైరానపడుతున్నారు. ‘మేం పడుతున్న గోస ఇప్పుడు అర్థమైతంది’ అని రాఘవాపూర్ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని సంబరపడుతున్నారు. ఆందోళనకు సై.. పెద్దపల్లి కలెక్టరేట్‌ను ఐటీఐలో నిర్వహించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐటీఐని క్రమంగా కలెక్టరేట్ ఆక్రమిస్తే తాము ఎక్కడికి వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన పెద్దపల్లి ఐటీఐని అధికారులు ఉనికి లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొత్తకోర్సులతో వందలాది మందికి శిక్షణఇచ్చి ఉపాధి చూపాల్సిన ప్రభుత్వం.. ఉన్న ఐటీఐని లాక్కొని బయటికి పంపే ప్రయత్నం చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక అవసరాల కోసం ఐటీఐని వాడుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారని, శాశ్వతంగా ఐటీఐని కలెక్టరేట్ స్వాధీనం చేసుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టంచేస్తున్నారు. -
కలెక్టరేట్ భవనాల కోసం అన్వేషణ
పెద్దపల్లిలో బిల్డింగ్‌లను పరిశీలించిన కలెక్టర్ నీతూ ప్రసాద్ పెద్దపల్లి : పెద్దపల్లిలో కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు అనువైన భవనం కోసం కలెక్టర్ నీతూప్రసాద్ అన్వేషిస్తున్నారు. భవనం కోసం బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు బిల్డింగ్‌లను పరిశీలించారు. పట్టణంలోని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఐటిఐ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చాలారోజులుగా పలువురు అధికారులతోపాటు సామాన్యులూ అభిప్రాయపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ కూతవేటు దూరంలో.. రాజీవ్ రహదారి పక్కనే ఉండడం ద్వారా కలెక్టరేట్‌కు రావడం.. వెళ్లడం అనుకూలంగా ఉంటుందని స్థానిక అధికారులు నివేదిక సమర్పించారు. దీనిపై కలెక్టర్ ఇక్కడికి చేరుకుని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంపీడీవో బిల్డింగ్‌లను పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో అశోక్ కుమార్‌తో ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఐ మహేష్, తహసీల్దార్ అనుపమారావు, ఎంపీడీవో మల్లేశం తదితరులున్నారు.