
సాక్షి, పెద్దపల్లి: మూడుపదులు నిండినా పెళ్లి కావడంలేదనే ఆవేదనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో శనివారం జరిగింది. ఎస్సై ఉపేందర్‌రావు వివరాల ప్రకారం..భూంనగర్‌కు చెందిన అతీక్ అహ్మద్ (30) కొద్దిరోజులక్రితం దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. పెళ్లి చేసుకుని తిరిగి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మాయి లభించకపోవడంతో నిరాశకు గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.