ఇబ్రహీంపట్నం: తన భర్త కొడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ యువతిని ట్రాప్ చేశాడు ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్య. అంతటితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటో తీయించుకున్నాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఇదే మండలం వర్షకొండకు చెందిన ఓ యువకుడితో గతంలోనే పెళ్లయ్యింది. వారికి కొడుకు, కూతురు సంతానం. ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరిగాయి.
దీంతో భార్యాభర్తలు వేరుకాపురం పెట్టారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థాలు వచ్చాయి. భర్త తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని సదరు యువతి కొద్దిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఏఎస్‌ఐ రామయ్య ఆమెనుంచి ఫిర్యాదు స్వీకరించాడు. విచారణ పేరుతో ఆమెతో సన్నిహితం పెంచుకున్నాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడి మరింత దగ్గరయ్యాడు.
ఇటీవలే ఆ యువతితో ఓ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని యువతితో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. న్యాయం కోసం వెళ్లిన యువతిని కాపాడాల్సిన పోలీసే ట్రాప్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయ.ుమై ఎస్సై అనిల్‌ను వివరణ కోరగా.. ఏఎస్‌ఐ రామయ్య విషయాన్ని చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్
జగిత్యాలక్రైం: ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్యను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment