సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ కేంద్రంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఇందులో భాగంగా కేంద్ర పారిశుద్ధ్య శాఖా మంత్రి ఉమాభారతి స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డులను ప్రదానం చేశారు. పారిశుద్ద్యం పాటించడంలో అత్యంత శ్రద్ధ కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాల వారీగా వివిధ విభాగాల్లో అవార్డులు అందజేశారు. సాఫ్, స్వచ్ఛతా పక్వాడ, స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేసెస్ వంటి విభాగాల్లో తెలంగాణ నాలుగు అవార్డులు దక్కించుకుంది.
పెద్దపల్లి టాప్.. వరంగల్, చార్మినార్‌లకు దక్కిన అవార్డులు
దక్షిణాది స్వచ్ఛతా ర్యాంకింగ్స్‌లో 81.48 పాయింట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు గాను పంచాయతీ ఉమా భారతి చేతుల మీదుగా పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ (SSBMG ప్రాజెక్ట్ డైరెక్టర్) నీతూ కుమారీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. అదే విధంగా స్వచ్చతాలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దపల్లికి మొదటి స్థానం దక్కగా.. కలెక్టర్ శ్రీదేవసేన ఈ అవార్డును అందుకున్నారు. అలాగే దక్షిణాది జిల్లాల స్వచ్ఛతాలో 95.59 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన వరంగల్ అవార్డును ఆమ్రపాలి అందుకున్నారు. ఇక స్వచ్ఛతా ఐకాన్ విభాగంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిన చార్మినార్ అవార్డును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్, జీహెచ్ఎంసీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment