సెల్‌ఫోన్‌ ఆర్డరిస్తే.. నడుం బెల్ట్‌ వచ్చింది! | fraud in online cell phone order | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ ఆర్డరిస్తే.. నడుం బెల్ట్‌ వచ్చింది!

Published Wed, Sep 6 2017 10:47 AM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM

fraud in online cell phone order

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సామ్‌సంగ్‌ సెల్‌ఫోన్‌ అసలు ధర రూ. 16 వేలు. మీకొచ్చిన గిఫ్ట్‌కూపన్‌తో రూ. 4 వేలకే వస్తుందని వచ్చిన ఫోన్‌కాల్‌ను నమ్మిన ఓ యువకుడు మోసపోయాడు. పెద్దపల్లి జిల్లా యైటిం క్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్‌తండాకు చెందిన గొడిసెల సతీష్‌కు గతనెల 26న తన మోబైల్‌కు 9848439934 నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. సామ్‌సంగ్‌ ఫోన్‌ అసలు ధర రూ. 16 వేలు, ఆఫర్‌ ద్వారా రూ.4 వేలకే వస్తుందని ఎదుటి వ్యక్తి చెప్పడంతో సతీష్‌ ఆర్డర్‌ చేశాడు. మంగళవారం స్థానిక పోస్టాఫీస్‌కు పార్శిల్‌ చేరింది.

పోస్టాఫీస్‌కు వెళ్లి సతీష్‌ రూ.4 వేలు చెల్లించి అట్టడబ్బాను తీసుకున్నారు. బాక్స్‌ తెరిచి చూసే సరికి నడుం బెల్ట్‌ కనిపించింది. ఇదేమిటని ఆయన పోస్టాఫీస్‌ సిబ్బందిని అడుగగా మాకేమీ సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. ఆందోళన చెందిన బాధితుడు మొదట్లో కాల్‌వచ్చిన ఫోన్‌నంబర్‌కు కాల్‌చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న సతీష్‌ గోదావరిఖని టూటౌన్‌పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement