ప్రియురాలితో ఏకాంతంగా.. ఆ వీడియో భార్యకు పంపిన భర్త | Tirupur Woman’s Suicide After Discovering Husband’s Affair: Police Investigate | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో ఏకాంతంగా.. ఆ వీడియో భార్యకు పంపిన భర్త

Sep 16 2025 12:39 PM | Updated on Sep 16 2025 1:44 PM

Husband Sent Lover Videos to wife Cell Phone

ఆవేదనతో భార్య మృతి 

 అన్నానగర్‌: ఈరోడ్‌ జిల్లాలోని గోపిచెట్టిపాళయం ప్రాంతానికి చెందిన సెంథిల్‌. అతని కుమార్తె కీర్తి మీనా(21). ఆమె తిరుప్పూర్‌కు చెందిన శివకుమార్‌ ను ప్రేమించి 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. తదనంతరం, శివకుమార్‌–కీర్తి మీనా దంపతులు తిరుప్పూర్‌ లోని ఇడువంపాళయంలోని శివశక్తి నగర్‌ 2వ రోడ్డు లో నివసించారు. వీరికి 2 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ స్థితిలో, శివకుమార్‌ మరొక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు.

 కీర్తి మీనా ఈ విషయంపై శివకుమార్‌ను ప్రశ్నించింది. తర్వాత ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ స్థితిలో కీర్తి శివకుమార్‌ వివాహేతర ప్రియురాలితో సరదాగా గడుపుతున్న వీడియోను మీనా సెల్‌ఫోన్‌ కు పంపాడు. ఆ వీడియో చూసి షాక్‌ అయిన కీర్తి మీనా తన బిడ్డను ఇంట్లో వదిలి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో వీరపాండి పోలీసులు శివకుమార్‌ను విచారిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement