యశవంతపుర: బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హొసూరు వద్ద వ్యక్తి హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేలింది. భార్యతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి రామదుర్గ తాలూకా హొసూరుకు చెందిన రైతు పాండప్ప (35) హత్యకు గురయ్యాడు. పాండప్ప, భార్య లక్ష్మీలు దంపతులు. లక్ష్మీకి రమేశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది.
దీంతో పాండప్ప ఊరి నుంచి దూరంగా ఉన్న పొలంలోని షెడ్‌కు నివాసాన్ని మార్చాడు. దీంతో లక్ష్మి రమేశ్‌ను కలవడం కష్టంగా మారింది. పాండప్ప ఉంటే తాము జల్సాగా ఉండలేమని ఇద్దరూ భావించారు. రాత్రి నిద్రపోతున్న పాండప్పపై ఇద్దరూ బండరాయితో బాది హత్య చేశారు. శవాన్ని బైకుపై తీసుకెళ్లి సమీపంలోని కాలువలో పడేశారు. కోడలు, ఆమె ప్రియుడే ఈ హత్య చేశారని హతుని తండ్రి దుండప్ప ఫిర్యాదు చేశారు.
(చదవండి: స్టేషన్‌లో గొడవతో హత్యకు సుపారీ)
Comments
Please login to add a commentAdd a comment