
సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్‌కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి.. రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విలపించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది.
చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment