
తమ్ముడికి మిఠాయి తినిపిస్తున్న అనసూయ
సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు.
సుభాష్‌నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది.
గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది.