Rakshabandan
-
అక్కకు 95, తమ్ముడికి 85
సుభాష్‌నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది. -
గుండెల్ని పిండేసే ‘అమెజాన్’ వీడియో
సృష్టిలో మరో అందమైన బంధం అక్కా-తమ్ముడు, అన్నాచెల్లి అనుబంధం. వారి అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రాఖీ పండుగ. రాఖీ పండుగ సందర్భంగా వివిధ ఆఫర్లు ఇచ్చినా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఓ సరికొత్త వాణిజ్య ప్రకటన (అడ్వరైటజ్మెంట్)ను కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన చూసిన వారందరికీ కళ్ల వెంట నీరొస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియో అక్కాతమ్ముడు బంధాన్ని బలోపేతం చేసేలా ఉంది. ఈ వీడియో ప్రజల హృదయాల్ని పిండేస్తోంది. ఆ వాణిజ్య ప్రకటన రాఖీ పండుగ నాడు సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని కళ్లకు కట్టేలా ఉంది. (చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) యాడ్‌లో ఏముందంటే..? తమ్ముడికి రాఖీ కట్టగానే అక్క ‘కాళ్లు మొక్కు’ అని చెప్పగా తమ్ముడు కాళ్లకు నమస్కరిస్తుండగా అక్క వీపుపై సరదాగా మూడుసార్లు కొడుతుంది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఇంకో దెబ్బ వేయి అని చెప్పగా ‘ఏందీ ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ’ అంటూ తమ్ముడు పైకి లేస్తాడు. ‘ఇదిగో నేను తయారు చేసిన షీర్ ఖుర్మా తిను’ అని గిన్నె ఇస్తుండగా ‘నిజమా!’ అని సందేహం వ్యక్తం చేస్తూ సోదరుడు తింటాడు. ‘చాలా బాగుంది’ అంటూ తింటూ తన అక్క ‘ఒక్క చెంచా ఇవ్వు’ అని అడిగినా ఇవ్వలేదు. ‘నీకోసం పొద్దటి నుంచి ఉపవాసం ఉన్నా’ అని చెప్పినా ఇవ్వకపోవడంతో ‘నువ్వు ఇవ్వకున్నా పర్లేదు నేను తీసుకుంటా’ అని అక్క పెద్ద గిన్నె తీసుకోబోతుండగా అడ్డుకుంటాడు. ‘ఈ మొత్తం నేనే తింటా.. నేనెవరికి ఇవ్వను’ అంటూ తమ్ముడు పెద్ద గిన్నె మొత్తం తీసుకోగా ‘నాక్కొంచెం’ అంటూ వెంటపడుతుంది. సరదాగా గొడవ పడుతుండగా తల్లి వంట గది నుంచి పిలుస్తుంది. వచ్చేంత వరకు మొత్తం తిన్నావో నిన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తూ వంటగదిలోకి వెళ్లింది. తల్లి ఉప్పు ఎక్కడ అని అడగ్గా ఆ పక్కనే ఉందని డబ్బా చూపించగా ‘ఎక్కడ లేదు. అయిపోయింది’ అని తల్లి చెబుతుంది. లేదమ్మా అక్కడే ఉండాలి’ అని డబ్బా తీసుకుని చూడగా చక్కెర, ఉప్పు డబ్బా ఒకటే తీరున ఉన్నాయి. చక్కెర అనుకుని పొరపాటున ఉప్పు వేసినట్లు గ్రహించి వెంటనే బయటకు రాగా తమ్ముడు ఇంట్లో పాయసం ఎవరికీ ఇవ్వకుండా ఆటపటిస్తుంటాడు. వెంటనే చేతిలోని గిన్నెలాగి రుచి చూడగా ఉప్పుతో కూడిన పాయసం ఉండడంతో తినలేకపోయింది. తాను తప్పు చేసినా సోదరుడు కప్పిపెట్టేసి ‘బాగుంది’ అని చెప్పడంతోపాటు అది తమను తినకుండా చేసిన సోదరుడి మనసును గుర్తించింది. వెంటనే ఆమె హత్తుకుంటుంది. చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు అతడి భుజంపై కన్నీళ్లు రాలుస్తుండగా ‘అక్క ఏడవద్దు. ఇగో నీకో గిఫ్ట్ తెచ్చా. చూడు’ అని చెప్పగా ‘నువ్వు ఆల్రెడీ ఇచ్చేశావ్’ అంటూ ప్రకటన ముగుస్తుంది. అక్క తప్పు చేసినా తమ్ముడు కప్పిపుచ్చి ఉంచడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నిజ జీవితానికి దగ్గరగా ఈ ప్రకటన ఉండడంతో రాఖీ పండుగ రోజు ఈ వీడియో కొంత భావోద్వేగాన్ని రగిల్చింది. సోదరసోదరీమణుల మధ్య అనుబంధం ఎలాంటిదో రెండు నిమిషాల్లో అద్భుతంగా చెప్పారు. చివరగా ‘కొన్నిసార్లు బహుమతులు డబ్బాల్లో రావు’ అని చెబుతూనే ‘ఈ రాఖీ పండుగ ప్రేమను పంచండి’ అంటూ అమెజాన్ పేర్కొంది. -
సైబర్ క్రైమ్‌పై అవగాహనకు ఈ-రక్షాబంధన్
సాక్షి, అమరావతి : మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి తీసుకొచ్చిన ఈ-రక్షాబంధన్ బాగా పాపులర్ అయ్యిందని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మీమ్స్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా 6 కోట్లమంది వీక్షించారని అయితే పలాస్ సినిమాకు వచ్చిన పాపులారిటీ ఈ-రక్షాబంధన్‌కు సైతం రావాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగినపుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలిపాం. police4u.com ద్వారా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆన్ లైన్ క్లాసులు, బ్యాంకింగ్ కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే బ్యాంకు వివరాలు ఏ ఆన్ లైన్ గేమ్‌లోనూ ఇవ్వద్దు. 80% మంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బు పోగొట్టుకున్నారు. ఇప్పటికే 2,28,982 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువకులే అధికం. సైబర్ క్రైమ్ విషయంలో పోలీసు స్టేషన్‌కు వెళ్ళాలని చాలామందిలో అవగాహన ఉందని సునీల్ కుమార్ వెల్లడించారు. (ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం) భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మహిళలకు, పిల్లలకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడమే ఈ-రక్షాబంధన్ ఉద్దేశమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సైబర్ స్పేస్ లో ఎక్కువగా ఉంటున్నందున ముఖ్యంగా మహిళలు ఈ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. దిశ ఒక చట్టమే కాకుండా, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు కలిగి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మహిళ భద్రత కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ళ విద్యార్ధినుల చేసిన అభిప్రాయాలు అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారూ ఈ-రక్షాబంధన్ ద్వారా లబ్ధి పొందారని వివరించారు. సైబర్ బుల్లింగ్ ఎక్కువగా ఉంది : సమంత మహిళలను, పిల్లలను ఆన్ లైన్ మోసాల నుంచీ రక్షించడం చాలా అభినందనీయమన్నారు సినీనటి అక్కినేని సమంత. ప్రస్తుతం సైబర్ బుల్లింగ్ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్న సమంత..దీని అడ్డుకట్ట వేయడంలో ఈ- రక్షాబంధన్ విజయవంతమైందన్నారు. ఈ-రక్షాబంధన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం పట్ల సంతోషిస్తున్నాను.ఈ కార్యక్రమం స్త్రీలకు ఒక సోదరుడిలా పనిచేసిందని సమంత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇచ్చిన యూట్యూబ్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ , భారత మహిళా క్రికెటర్ రావి కల్పన తెలిపారు. సీఎం జగన్ ఆలోచనల నుంచి పుట్టిన దిశా చట్టం మహిళలకి కొండంత భరోసా ఇస్తోందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. -
సైబర్ సెక్యురిటీ నిపుణులతో కార్యక్రమాల నిర్వహణ: సుచరిత
-
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
రక్షాబంధన్ ఫోటోలను సాక్షితో పంచుకోండి!
రక్షా బంధన్ రోజు సోదరి రక్ష కట్టగానే, సోదరుడు నీకు జీవితాంతం కష్టం రాకుండా తోడుగా ఉంటానంటూ ప్రమాణం చేస్తాడు. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేసి రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. ఎంత దూరంలో ఉన్నా తన సోదరుడి దగ్గరకు వెళ్లి రాఖీని కట్టి తన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటారు. ఈ రోజు అన్నాచెల్లెళ్ల అల్లర్లకు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి పెట్టింది పేరు. అలాంటి ఉత్సవాన్ని మీ ఇంట్లో కూడా జరుపుకుంటే ఆ ఆనందాన్నిసాక్షితో పంచుకోండి. మీరు జరుపుకున్న రక్షాబంధన్ వేడుకల ఫోటోలను మాకు పంపించండి. మీ పేరుతో పాటు, మీ ఊరు పేరును కూడా మాకు పంపించండి. మీరు ఫోటోలు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9705456111. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోటోలను వెంటనే మాకు పంపించండి . -
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
-
సెంటిమెంట్ ఉంటే రాజీనామా చేయాలి
-
ఈ-రక్షాబంధన్
-
అందుకే పవన్ వైజాగ్‌పై కసి పెంచుకున్నారా?
సాక్షి, తిరుమల: మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం మరో ముందడుగు వేశారు అని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామం. దిశ చట్టాన్ని తీసుకురావడం ద్వారా మహిళల పై ఎంత గౌరవం ఉందో తెలుస్తోంది. మహిళలకు 50 శాతం హక్కు కల్పించడమే కాకుండా, ఓ మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చారు. ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి కల్పించారు. ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించారు. గాజువాకలో పవన్ కల్యాణ్‌ని చిత్తుగా ఓడించారు. అందుకే వైజాగ్‌పై పవన్ కసి పెంచుకున్నారా? చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధి చూపించాలి. చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రక్ష బంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చాం. జగనన్న ఉన్నాడనే భరోసా ఇలాగే మరో 30, 40 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అని రోజా అన్నారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్యేలకు ఆర్కే రోజా సవాల్ -
మోదీకి రాఖీ కట్టిన ట్రిపుల్ తలాక్ పిటిషనర్
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఐదుగురిలో ఒకరైన పశ్చిమ బెంగాల్ మహిళ ఇష్రత్ జహాన్ గురువారం ఢిల్లీకి వచ్చి మోదీకి రాఖీ కట్టారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించేలా చట్టాన్ని తెచ్చినందుకు ముస్లిం సోదరిల తరఫున ఆమె మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. త్రివర్ణాలతో ఉన్న రాఖీని మోదీ చేతికి కట్టే అవకాశం వచ్చినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే తాను కోల్‌కతా నుంచి తెచ్చిన రసగుల్లాను భద్రతా కారణాల వల్ల మోదీకి ఇవ్వలేకపోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని హౌరాలో నివసించే ఇష్రత్ జహాన్‌కు దుబాయ్‌లోని తన భర్త 2014లో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయగా, ఆ చర్యను నేరంగా పరిగణించేలా కేంద్రం చట్టం తెచ్చింది. -
చిరు ఇంట్లో రాఖీ వేడుకలు
మెగాఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ సెలబ్రేషన్‌ను అభిమానులతో షేర్ చేసుకునే ఉపాసన, రాఖీ సందర్భంగా ఆసక్తికర వీడియోనే ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్న వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఉపాసన ‘మామయ్య రాఖీ సెలబ్రేషన్స్ విత్ లవ్లీ సిస్టర్స్’ అని కామెంట్ చేశారు. చెల్లెల్లిద్దరిని ప్రేమగా ఆశీర్వదించిన చిరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గిఫ్ట్స్ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నారు. మెగా తనయుడు రామ్‌చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదలైన సైరా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. -
తమ్ముడూ.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా..
‘‘ఒరేయ్ తమ్ముడూ.. నాకు అండగా ఉంటావనుకున్నాన్రా.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా...?’’ అంటూ అక్క శిరీష గుండె బాదుకుంటూ ఏడుస్తుంటే.. చూపరులంతా చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమ్మం: సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో ఆదివారం గల్లంతైన యువకుడు కొక్కొండ వినోద్‌చారి(22) మృతిచెందాడు. వినోద్‌చారి మృతదేహాన్ని చూడగానే తల్లి విజయలక్ష్మి, తండ్రి గిరిబాబు, అక్క శిరీష గుండె పగిలేలా రోదించారు. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్నేహితుల రోజున గల్లంతై, రక్షాబంధన్ నాడు విగతుడిగా బయటికొచ్చాడు. తమ్ముడికి అదే చివరి రాఖీ..! సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ రాఖీ కడుతూనే.. ‘‘తమ్ముడూ.. నీకు ఇదే చివరి రాఖీరా... ఇక నుంచి నేనెవరికి కట్టాలిరా..?’’ అని కన్నీటితో ప్రశ్నిస్తూ మృతదేహంపై పడిపోయింది. అక్కడున్న అందరి హృదయాలు.. ఆ దృశ్యంతో బరువెక్కాయి. కొందరు మౌనంగా.. ఇంకొందరు బిగ్గరగా రోదించారు. ముందు రోజు ఏం జరిగిందంటే... ఆదివారం.. స్నేహితుల దినోత్సవం. సత్తుపల్లి పట్టణానికి చెందిన మల్లిశెట్టి హిమకిరణ్, కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన గోల్డ్ షాపు యజమాని కొక్కొండ గిరిబాబు కుమారుడు వినోద్‌చారి(22) మంచి మిత్రులు. సత్తుపల్లిలోని సాయిస్ఫూర్తి కళాశాలలో డిప్లొమా కోర్సు చదివారు. నెల్లూరులో మల్లిశెట్లి హిమకిరణ్, హైదరాబాద్‌లో కొక్కొండ వినోద్.. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహితుల దినోత్సవం రోజున సత్తుపల్లిలో మిగతా మిత్రులతో సరదాగా గడిపారు. ఆదివారం ఉదయం ఈ ఇద్దరు కలిసి బేతుపల్లి చెరువు అలుగు చూసేందుకు కారులో వెళుతున్నారు. అది అదుపుతప్పి అదే చెరువులోకి దూసుకెళ్లింది. ఇద్దరూ అతి కష్టంగా డోర్లు తెరుచుకుని పైకి చేరుకున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి వారిద్దరినీ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అంతలోనే, వినోద్ చేతిలోని సెల్‌ఫోన్ పడిపోయింది. దానిని తీసుకునేందుకు అతడు ఒక అడుగు ముందుకు వెళ్లాడు. రక్షించేందుకు వచ్చిన వారి చేతిలో నుంచి జారి చెరువులోని నీటిలో పడిపోవడం.. గల్లంతవడం క్షణాల్లో జరిగిపోయింది.