
మెగాఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ సెలబ్రేషన్‌ను అభిమానులతో షేర్ చేసుకునే ఉపాసన, రాఖీ సందర్భంగా ఆసక్తికర వీడియోనే ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఉపాసన ‘మామయ్య రాఖీ సెలబ్రేషన్స్ విత్ లవ్లీ సిస్టర్స్’ అని కామెంట్ చేశారు. చెల్లెల్లిద్దరిని ప్రేమగా ఆశీర్వదించిన చిరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గిఫ్ట్స్ ఇచ్చారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నారు. మెగా తనయుడు రామ్‌చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదలైన సైరా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment