సృష్టిలో మరో అందమైన బంధం అక్కా-తమ్ముడు, అన్నాచెల్లి అనుబంధం. వారి అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రాఖీ పండుగ. రాఖీ పండుగ సందర్భంగా వివిధ ఆఫర్లు ఇచ్చినా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఓ సరికొత్త వాణిజ్య ప్రకటన (అడ్వరైటజ్‌మెంట్)ను కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన చూసిన వారందరికీ కళ్ల వెంట నీరొస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియో అక్కాతమ్ముడు బంధాన్ని బలోపేతం చేసేలా ఉంది. ఈ వీడియో ప్రజల హృదయాల్ని పిండేస్తోంది. ఆ వాణిజ్య ప్రకటన రాఖీ పండుగ నాడు సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని కళ్లకు కట్టేలా ఉంది. (చదవండి: ‘హీరోయిన్‌లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’)
యాడ్‌లో ఏముందంటే..?
తమ్ముడికి రాఖీ కట్టగానే అక్క ‘కాళ్లు మొక్కు’ అని చెప్పగా తమ్ముడు కాళ్లకు నమస్కరిస్తుండగా అక్క వీపుపై సరదాగా మూడుసార్లు కొడుతుంది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఇంకో దెబ్బ వేయి అని చెప్పగా ‘ఏందీ ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ’ అంటూ తమ్ముడు పైకి లేస్తాడు. ‘ఇదిగో నేను తయారు చేసిన షీర్ ఖుర్మా తిను’ అని గిన్నె ఇస్తుండగా ‘నిజమా!’ అని సందేహం వ్యక్తం చేస్తూ సోదరుడు తింటాడు. ‘చాలా బాగుంది’ అంటూ తింటూ తన అక్క ‘ఒక్క చెంచా ఇవ్వు’ అని అడిగినా ఇవ్వలేదు.
‘నీకోసం పొద్దటి నుంచి ఉపవాసం ఉన్నా’ అని చెప్పినా ఇవ్వకపోవడంతో ‘నువ్వు ఇవ్వకున్నా పర్లేదు నేను తీసుకుంటా’ అని అక్క పెద్ద గిన్నె తీసుకోబోతుండగా అడ్డుకుంటాడు. ‘ఈ మొత్తం నేనే తింటా.. నేనెవరికి ఇవ్వను’ అంటూ తమ్ముడు పెద్ద గిన్నె మొత్తం తీసుకోగా ‘నాక్కొంచెం’ అంటూ వెంటపడుతుంది. సరదాగా గొడవ పడుతుండగా తల్లి వంట గది నుంచి పిలుస్తుంది. వచ్చేంత వరకు మొత్తం తిన్నావో నిన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తూ వంటగదిలోకి వెళ్లింది.
తల్లి ఉప్పు ఎక్కడ అని అడగ్గా ఆ పక్కనే ఉందని డబ్బా చూపించగా ‘ఎక్కడ లేదు. అయిపోయింది’ అని తల్లి చెబుతుంది. లేదమ్మా అక్కడే ఉండాలి’ అని డబ్బా తీసుకుని చూడగా చక్కెర, ఉప్పు డబ్బా ఒకటే తీరున ఉన్నాయి. చక్కెర అనుకుని పొరపాటున ఉప్పు వేసినట్లు గ్రహించి వెంటనే బయటకు రాగా తమ్ముడు ఇంట్లో పాయసం ఎవరికీ ఇవ్వకుండా ఆటపటిస్తుంటాడు. వెంటనే చేతిలోని గిన్నెలాగి రుచి చూడగా ఉప్పుతో కూడిన పాయసం ఉండడంతో తినలేకపోయింది. తాను తప్పు చేసినా సోదరుడు కప్పిపెట్టేసి ‘బాగుంది’ అని చెప్పడంతోపాటు అది తమను తినకుండా చేసిన సోదరుడి మనసును గుర్తించింది. వెంటనే ఆమె హత్తుకుంటుంది.
చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు
అతడి భుజంపై కన్నీళ్లు రాలుస్తుండగా ‘అక్క ఏడవద్దు. ఇగో నీకో గిఫ్ట్ తెచ్చా. చూడు’ అని చెప్పగా ‘నువ్వు ఆల్రెడీ ఇచ్చేశావ్’ అంటూ ప్రకటన ముగుస్తుంది. అక్క తప్పు చేసినా తమ్ముడు కప్పిపుచ్చి ఉంచడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నిజ జీవితానికి దగ్గరగా ఈ ప్రకటన ఉండడంతో రాఖీ పండుగ రోజు ఈ వీడియో కొంత భావోద్వేగాన్ని రగిల్చింది. సోదరసోదరీమణుల మధ్య అనుబంధం ఎలాంటిదో రెండు నిమిషాల్లో అద్భుతంగా చెప్పారు. చివరగా ‘కొన్నిసార్లు బహుమతులు డబ్బాల్లో రావు’ అని చెబుతూనే ‘ఈ రాఖీ పండుగ ప్రేమను పంచండి’ అంటూ అమెజాన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment