
సాక్షి, తిరుమల: మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం మరో ముందడుగు వేశారు అని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామం.
దిశ చట్టాన్ని తీసుకురావడం ద్వారా మహిళల పై ఎంత గౌరవం ఉందో తెలుస్తోంది. మహిళలకు 50 శాతం హక్కు కల్పించడమే కాకుండా, ఓ మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చారు. ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి కల్పించారు. ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించారు. గాజువాకలో పవన్ కల్యాణ్‌ని చిత్తుగా ఓడించారు. అందుకే వైజాగ్‌పై పవన్ కసి పెంచుకున్నారా? చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధి చూపించాలి. చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రక్ష బంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో భద్రతగా, గౌరవంగా బయటకు వచ్చాం. జగనన్న ఉన్నాడనే భరోసా ఇలాగే మరో 30, 40 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అని రోజా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment