medchal district
-
ఐటీ హాబ్‌గా మేడ్చల్ జిల్లా!
హైదరాబాద్ నగర శివారుల్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పరిశ్రమలతో వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్‌తోపాటు హైదరాబాద్ (Hydearabad) మహానగరం నలువైపులా పారిశ్రామిక పార్కుల విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాటు ఐటీ శాఖ మంత్రి కావటంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పల్ జెన్ ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు, నగరానికి ఉత్తరాన కండ్లకోయలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిని వేగవంతం చేయటంతోపాటు నగరానికి తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో ఇండ్రస్టియల్ పార్కు (Madaram Industrial Park) స్థాపనకు కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇదే మండలంలోని పోచారంలో దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్‌ను మరో రూ.750 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫోసిస్ (Infosys) విస్తరణపై ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పింస్తోంది. మరింత విస్తరింపజేయటం ద్వారా త్వరలో కొత్తగా వందలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. నరానికి తూర్పు వైపు ఐటీ విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో... పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించటంతోపాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములు కాకుండా ఇతర భూములను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలని, వాటి బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ధరలను తెలపాలని పేర్కొంది.చదవండి: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీస్థానికంగా ఉన్న వనరుల వివరాలతోపాటు ఏఏ పరిశ్రమలకు భూములు, ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న విషయాలతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. భూములను గుర్తించిన తర్వాత ఆయా ప్రాంత చిత్రాలు (లొకేషన్ మ్యాప్‌లు) తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కి పంపించాలని నిర్దేశించటంతో అందుకు అనుగుణంగా కార్యాచరణకు వ్యూహా రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ యంత్రాంగం తలములకలైనట్లు తెలుస్తోంది. సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని మేడ్చల్ జిల్లా (Medchal District) పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడ్చల్ జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే.. తొమ్మిది నెలల కాలంలో రూ.380 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు 130 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లాలో కొత్తగా 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లాలో మరో 46,356 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.చదవండి: షంషేర్.. చార్మినార్..కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా ఐటీ హాబ్‌గా మారనుంది. ప్రస్తుతమున్న పరిశ్రమలకు తోడుగా మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ రానున్నాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని పోచారం, ఘట్కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. -
ఆ జిల్లాల బీజేపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
తెలంగాణలో జిల్లా సారథుల ఎంపికపై భారతీయ జనతాపార్టీ అచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ (Hyderabad) శివార్లలో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల నియామకంపై విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ రూరల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్, హైదరాబాద్ గోల్కొండ, భాగ్యనగర్ జిల్లాలను పెండింగ్‌లో పెట్టింది. తమ వర్గానికి చెందిన నేతలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని సీనియర్లు పట్టుబట్టడం కూడా వీటి వాయిదా కారణంగా కనిపిస్తోంది.ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు నియోకవర్గం పరిధిలో ఉన్న రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులుగా తన వర్గీయులను నియమించాలని ఓ కీలక నేత పట్టుబడుతుండగా, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ జిల్లా (Medchal District) పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మరో నాయకుడు తన సన్నిహితుడికి అవకాశం కల్పించాలంటూ మొండికేస్తున్నారు. దీంతో ఈ జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియకు మరికొన్నాళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి గ్రామీణ అధ్యక్ష బాధ్యతలు తనకే అప్పగించాలంటూ ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా నేత ఒత్తిడి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధి పార్టీ సంస్థాగత జిల్లా రంగారెడ్డి రూరల్‌లో అధికంగా ఉన్నందున మాకే అవకాశం ఇవ్వాలని అక్కడి నాయకులు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి (Lankala Deepak Reddy), మేడ్చల్ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బుద్ది శ్రీనివాస్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుండుగోని భరత్‌గౌడ్ (gundagoni bharath goud)ను నియమిస్తూ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనుచరుడిగా చెబుతున్నారు. భరత్ గౌడ్ గతంలో బీజేవైఎం రాష్త్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంపీ డా.లక్ష్మణ్ అనుచరుడిగా పేరుంది.చదవండి: 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకంస్టేట్ కౌన్సిల్ సభ్యుల నియామకం.. మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో స్టేట్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకుంటారు. అందులో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి శేషసాయి, సనత్‌నగర్ నుంచి సురేష్ రావల్, సికింద్రాబాద్ నుంచి గణేష్ ముదిరాజ్, కంటోన్మెంట్ రాయల్ కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి నర్సింగరావు యాదవ్, ఖైరతాబాద్ నుంచి నగేష్, జూబ్లీహిల్స్ శ్రీనివాస్‌రెడ్డి, నాంపల్లి అనిల్‌కుమార్‌లకు అవకాశం కల్పించగా, మేడ్చల్ నియోజకవర్గం నుంచి అచ్చని నర్సింహకు స్టేట్ కౌన్సిల్లో స్థానం లభించింది. -
హైదరాబాద్ శివారులో మరో దిశ తరహా ఘటన
-
Hyderabad: యువతి దారుణ హత్య.. చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..
మేడ్చల్‌రూరల్: ఓఆర్ఆర్ కల్వర్టు కింద గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి మునీరాబాద్ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. నిందితులు యువతి తలపై బండరాయితో మోది.. హత్య చేసి.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లున్నాయి. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మునీరాబాద్ పరిధిలో ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులోని ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పని చేసే ఓ యువకుడు శుక్రవారం ఉదయం కల్వర్టులో నుంచి ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి వెళ్తుండగా ఓ యువతి మృతదేహం కనిపించింది. భయాందోళనకు గురైన యువకుడు ట్రాన్స్‌పోర్టు యజమానికి విషయం చెప్పగా.. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. 25 ఏళ్ల వయసున్న వివాహిత తలపై బండరాయితో బాది హత్య చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిందితులు నిప్పంటించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తెలిసిన వ్యక్తుల పనేనా? ఓఆర్ఆర్ కల్వర్టు కింద యువతి దారుణ హత్యకు గురైన యువతి పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు.. సదరు యువతి తనకు తెలిసిన వ్యక్తి లేదా వ్యక్తులతోనే ఇక్కడికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. యువతిని ఏకాంతంగా కలిసిన అనంతరం విభేదాల కారణంగా పక్కనే ఉన్న బండరాయితో బాది హత్య చేశారా? లేదా పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారా? లేదంటే యువతి మృతదేహాన్ని తీసుకు వచ్చి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బండరాయితో బాది.. పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఉంటారా? నిందితుడు ఒక్కరా లేక ఇద్దరు.. ముగ్గురు ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019 దిశ కేసు తరహాలో రోడ్డు పక్కన యువతి దారుణ హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. మృతురాలి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు .. హత్యకు గురైన యువతి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్లు ఉన్నాయి. కుడి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో.. రోహిత్ అనే పేరు ఇంగ్లిష్‌లో.. ఎడమ చేతిపై నరేంద్ర అనే పేరు ఇంగ్లిష్ లో పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల వయసున్న యువతికి కాళ్ల వేళ్లకు ఉన్న మెట్టెల ఆధారంగా వివాహితగా గుర్తించారు. ఇతర పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులు, ఆయా కేసుల్లో చేతిపై పచ్చబొట్లు ఉన్న వివరాల కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య? -
25 ఏళ్ల యువతి దారుణ హత్య
-
తెలంగాణ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్
-
హైదరాబాద్‌లోనే ఎక్కువ..!
సాక్షి, సిటీబ్యూరో: సొంత స్థలాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సంబంధిత అధికారులు ఆ పనుల్లో పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే జిల్లాలు నాలుగున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంది. ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏ జిల్లా పరిధిలో ఎందరున్నారో ప్రజాపాలన కార్యక్రమాల్లో అందిన దరఖాస్తుల్ని లెక్కలు తీశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనే జీహెచ్ఎంసీ వార్డులు కూడా ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. తర్వాత మేడ్చల్ జిల్లాలోని వారు ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల వంతున జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థికసాయం అందనుంది. సర్వేయర్లకు సహకారం.. దరఖాస్తుదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి ‘ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్’లో వివరాలు నమోదు చేసేందుకు సర్వేయర్లుగా జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు ఆయా జిల్లాల సిబ్బంది పని చేయనున్నారు. క్షేత్రస్థాయిలో లబి్ధదారుల చిరునామాను గుర్తించేందుకు జిల్లాల సిబ్బందికి, కంటోన్మెంట్ సిబ్బందికీ జీహెచ్ఎంసీ సర్కిళ్లలో పనిచే స్తున్న యూసీడీ, ఎంటమాలజీ విభాగాల సిబ్బందితోపాటు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు,తదితరులు సహకరించనున్నారు. మొబైల్ యాప్‌లో వివరాల నమోదు, అప్డేషన్ల కోసం జీహెచ్ఎంసీ జోనళ్లస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. కారును డ్రైవ్ చేస్తోన్న మహేష్ గౌడ్ అతివేగం, మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు.కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులే కాగా, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన ఐదుగురు యువకులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన గోపి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీడిమెట్లలో రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. -
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కారు బీభత్సం
-
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్‌లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
అక్కకు 95, తమ్ముడికి 85
సుభాష్‌నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది. -
ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఉద్రిక్తత.. ఫర్నిచర్, అద్ధాలు ధ్వంసం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్‌లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్‌లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్‌లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అల్లుడు పక్కా స్కెచ్.. భార్యను ఇంటికి పంపకపోవడంతో..
రంగారెడ్డినగర్(మేడ్చల్ జిల్లా): భార్యను ఇంటికి పంపేందుకు అత్తమామలు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న అల్లుడు తన స్నేహితులతో కలిసి మామను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు తెలిపిన మేరకు.. దుండిగల్ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన షేక్ నాసిర్ (31) అదే ప్రాంతానికి చెందిన రమేష్(37) కుమార్తె మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి ముంబయ్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం తన బంధువుల ఇంట్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో అప్పట్లో దుండిగల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో బెయిల్‌పై విడుదలైన నాసిర్ శిక్ష పడటం ఖాయమని భయపడి బాధితురాలు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువురు చర్చిగాగిల్లాపూర్‌లోని సర్వే నెంబరు 214లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన రెండు నెలల పాటు వీరి సంసారం సజావుగా కొనసాగింది. అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న నాసిర్ తరచూ ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మహాలక్ష్మి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యను ఇంటికి పంపేందుకు నిరాకరించిన మామ రమేష్‌పై కక్షపెంచుకున్న నాసిర్ భార్యతో పాటు మామను సైతం చంపేందుకు పథకం పన్నాడు. తన స్నేహితులు కోటేశ్వరరావు(24), కంచేరి మహేందర్(22)లు మెదక్ జిల్లా గడ్డపోతారం నుండి నాలుగు కత్తులను తెచ్చుకుని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 2022 డిసెంబరు 16న రమేష్ ఇంటికి వచ్చిన నాసిర్ భార్య మహాలక్ష్మిని ఇంటికి పంపాలని అడగగా నిరాకరించడంతో గొడవ పడ్డాడు. చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? ఈ క్రమంలో చర్చిగాగిల్లాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతం నుండి వెళ్తున్న రమేష్‌పై దాడి చేసి ఛాతి, వీపు భాగాల్లో కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న దుండిగల్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, కంచేరి మహేందర్లను సైతం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మూడు కత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు. -
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మేడ్చల్: పీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే.. వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతి వల్లే ఇదంతా! ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!. -
75 బృందాలు..100 రోజులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు. ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు.. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు 43 బృందాలను నియమించారు. జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289 డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు. అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. ఇటీవలే వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్(ఏఆర్) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. నిరంతరాయంగా శిబిరాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి -
మా సమావేశానికి కారణం మంత్రి మల్లారెడ్డే: ఎమ్మెల్యే మైనంపల్లి
-
రహస్య భేటీ కాదు.. మంత్రి మల్లారెడ్డే కారణం: ఎమ్మెల్యే మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ ఎమ్మెల్యేలు భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ(శేరిలింగంపల్లి), వివేక్ గౌడ్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు(కూకట్పల్లి), బి సుభాష్‌రెడ్డి(ఉప్పల్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తమ సమావేశానికి మంత్రి మల్లారెడ్డే కారణమని తెలిపారు. పదవులు తీసుకున్న వాళ్లే 3,4 పదవులు తీసుకున్నారని మైనంపల్లి ఆరోపించారు. కార్యకర్తల సమస్యలపై ఎమ్మెల్యేలు కలవడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇది రహస్య సమావేశం కాదని.. కార్యకర్తల కోసమే భేటి అయినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కేడర్ ఇబ్బందులు పడుతోందని, కేడర్ గురించి మాట్లాడకపోతే డమ్మీలవుతామని అన్నారు. చదవండి: మేడ్చల్ బీఆర్ఎస్లో కోల్డ్‌వార్.. మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్ దగ్గరకు ఎమ్మెల్యే పంచాయితీ! కార్యకర్తల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని మైనంపల్లి ప్రశ్నించారు. కేడర్ కష్టపడి పనిచేస్తోందని.. వారికి న్యాయం జరగాలని అన్నారు. ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోందని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పనిచేసే క్యాడర్‌ను కాపాడుకోవాలని, సిస్టమ్‌లో మార్పు రావాలని ఆకాక్షించారు. ‘ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి. మా సమావేశం తప్పేమీ కాదు. మంత్రి కేటీఆర్‌ను కలవాలనుకున్నాం. ఈ సమస్య అన్ని పార్టీలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్‌తో ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి. కొంతమంది మంత్రులు తమ వాళ్లకు పదవులు ఇప్పించుకున్నారు. నా కొడుకు కోసం మీటింగ్ అన్న ప్రచారం నన్ను హర్ట్ చేసింది’ అని ఎమ్మెల్యే తెలిపారు. -
మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
-
మంత్రి మల్లారెడ్డిపై ఆ నలుగురి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై రగిలిపోతున్నారు ఆ నలుగురు.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ తీసుకెళ్లిపోయారని ఆ నలుగురు మండిపడుతున్నారు. ఈ మేరకు ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యేలు.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నామినేటెడ్ పోస్టులు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరణ గణానికే ఇప్పించుకుంటున్నారని, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ పోస్టుపై విషయంలో వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోస్టులు ఒకే నియోజకవర్గానికి వెళ్లిపోయాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తీరుపై కాకుండా.. కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి జోగులాంబ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆయన స్పందించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మల్లారెడ్డి అంశంపై పంచాయితీని మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆ నలుగురు భావిస్తున్నారు. -
అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అమనుష ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కమలానగర్లో గుర్తు వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. రెండ్ అపార్టమెంట్ల మధ్య ఆవరణలో కేవలం ఒకరోజు వయసున్న శిశువును వదిలి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద పసికందును చూసి చలించిపోయిన ఎస్సై స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని వైద్యం నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పట్ల మానవాత్వం చాటుకున్న ఎస్సైని స్థానికులు కొనియాడారు. చదవండి: పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా -
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
Hyderabad: 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓట్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 41.46 లక్షలు హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు. తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా.. వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం
-
విషాదం.. చెరువులోకి మునిగి టీచర్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి
సాక్షి, మేడ్చల్: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా భయాందోళనలో తోటి విద్యార్థులు మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్‌తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహించిన స్థానికులు ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబర్‌పేటలో విషాదఛాయలు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్‌పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అంబర్‌పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లు పరామర్శించారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. చదవడి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి -
యుపిఎస్ సి పరీక్షలో సఫలం కాలేదన్న మనస్తాపంతో సూసైడ్
-
మేడ్చల్ జిల్లా : అంబేద్కర్ నగర్ చర్చ్ లో మహిళ మృతదేహం
-
సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్‌గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్‌గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. అతనే గౌతమ్‌కుమార్. సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్ భూములు, కార్పొరేషన్లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్ మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న గౌతమ్‌కుమార్‌ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్చార్జ్ తహసీల్దార్‌గా బుధవారం అదనపు బాధ్యతలను అప్పగించింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు... ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌కుమార్ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్‌కుమార్ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్ (ఫైల్) గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఒంటరిగా గుట్టల్లోకి తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గౌతమ్‌కుమార్, కాప్రా ఇన్చార్జ్ తహసీల్దార్ -
ఈటల కుటుంబాన్ని పరామర్శించిన అమిత్ షా
మేడ్చల్ రూరల్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లారు. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించడంతో అమిత్ షా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మేడ్చల్ జిల్లా పూడూర్ గ్రామ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన ఉన్న ఈటల రాజేందర్ నివాసానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న అమిత్ షా.. ఈటల మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజేందర్‌తో భేటీ అయిన అమిత్ షా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలసి రాష్ట్ర రాజకీయాలపై 20 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్.. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారెవ్వరూ కేసీఆర్‌తో లేరని, చాలా మంది నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. -
కేసీఆర్ జాతీయ పార్టీ.. పెద్ద జోక్
సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమనేది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద జోక్’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కాలేరన్నారు. దేశంలో కుటుంబపాలన తేవాలనే లక్ష్యంతో కుటుంబ పార్టీలన్నిటినీ కేసీఆర్ కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం కుత్బుల్లాపూర్‌లో ప్రారంభమైన ప్రజాసంగ్రామయాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. తమ పార్టీ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టదని, కేసీఆర్ అవినీతికి మాత్రం తప్పకుండా మీటర్లు పెడుతుందన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. మజ్లిస్‌కు భయపడే.. మజ్లిస్‌కు, ఒవైసీకి బీజేపీ భయపడదని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారని, కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నా.. స్టీరింగ్, బ్రేక్ మాత్రం ఒవైసీ చేతిలోనే ఉన్నాయన్నారు. ‘8వ నిజాం కేసీఆర్. ఆయనలాంటి అరాచక వ్యక్తి, అవినీతిపరుడు ఇంకెవరూ లేరు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను దోచుకున్నది సరిపోవట్లేదు. దేశంలోని బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ హామీలు ఏమయ్యాయి? సంక్షేమ హాస్టళ్లలో కలుషితాహారం తిని విద్యార్థులు మరణిస్తున్నారు. ఏం చేశాడని ఇలాంటి వ్యక్తి పాలన దేశానికి కావాలి?. తెలంగాణనే పరిపాలించే సత్తాలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్ముతారా?’ అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయని, ఇక దేశంలో చెల్లుతుందా? అని అన్నారు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడమే తెలంగాణ మోడలా? అని కిషన్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. రజాకార్లను ఉరికించిన చరిత్ర తెలంగాణదని, ఖాసీంరజ్వీ పాకిస్తాన్‌కి పారిపోగా, అతడి చెంచాలను చంకలో పెట్టుకుని కేసీఆర్ తిరుగుతున్నాడన్నారు. లక్షమంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు వచ్చినా 2024లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజాసంగ్రామయాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, బండి సంజయ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. -
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంతి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఈ కార్యలయాలను ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో , ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది. పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నాం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత అభివృద్ధి. కేవలం 6 నెలల వ్యవధిలో భవనాలు నిర్మించాం. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఇప్పుడున్న 36 లక్షల పెన్షన్లకు తోడు.. మరో పది లక్షల కొత పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్పాం. 11 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమే రాష్ట్రంలో అన్ని రంగాలకూ 24 గంటలూ కరెంట్ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కరెంట్ పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ ఉండదు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన, చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్లే ఈ ఇబ్బందులు. దేశంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్) ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే తెలంగాణలో చాలా నిధులు ఉన్నాయి. మన రాష్ట్రం ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే. గతంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగాసంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్ల కొరత తీర్చుకున్నాం. జాతీయ రాజకీయాల్లో మార్పు రావాలి భవనం కట్టాలంటే చాలా కష్టం, కూలగొట్టాలంటే చాలా ఈజీ. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఏ రకంగానూ మంచిది కాదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకం కావడం అంత ఈజీ కాదు. చైనా సింగపూర్, కొరియా దేశాల తరహాలో కుల మతాలకు అతీతంగా పనిచేయాలి' అని సీఎం కేసీఆర్ అన్నారు. -
అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది: సీఎం కేసీఆర్
-
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్ 11న మేడ్చల్–మల్కాజిగిరి ,వికారాబాద్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాదాపు ఆరేళ్లుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిపాలన కీసర మండల కేంద్రం సమీపంలోని అద్దె భవనం నుంచి కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజలకు పారదర్శక పాలన, పరిపాలన సులభతరం.. అధికారుల్లో జవాబుదారీ తనం పెంచటం.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా 2017 అక్టోబర్ 11న శామీర్‌పేట మండలం, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పునాది వేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాల కార్యాలయాన్ని అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ,ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. -
టీఆర్ఎస్కు షాక్.. మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు బీజేపీలోకి
సాక్షి, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం అవుషాపూర్‌లోని ఎంపీపీ నివాసంలో చర్చలు జరిపారు. వారం రోజుల్లో మండలంలో సమావేశం నిర్వహించి అవుషాపూర్ సర్పంచ్ కావేరి మశ్చేందర్‌రెడ్డితో పాటు పలువురితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధుల విడుదల చేయాలని అధికార పార్టీ ఎంపీపీగా ఉండి గత కొంత కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ పాలనపై పలుమార్లు ఆసంతృప్తిని వ్యక్తం చేసిన, నిధులు కోసం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కలెక్టర్లను కోరినా నిధులు ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కష్టపడి గెలిచిన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు కూడా ప్రజల ఓట్లతోనే గెలిచారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఘట్‌కేస్‌ర్ మండలం అవుషాపూర్‌లోని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలకు తప్ప ఎవరికి అధికారాలు లేవన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధులు బానిసత్వంలో ఇంకా మగ్గకుండ గౌరవం కోసం ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ కరిగిపోతున్న పార్టీ అని యూపీలోనే రాహుల్ గాంధీ ఓడిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల వెంట నడుస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు హనుమాన్, మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. గ్రామానికి రూ. కోటి చొప్పున నిధులిస్తే రాజీనామా చేస్తానన్నది వాస్తవమేనైనా, నిధులు ఇవ్వనందున ప్రస్తుతం ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం అవుషాపూర్‌లో ఎంపీపీ మాట్లాడుతూ నిధుల కోసం మూడేళ్లుగా పోరాటం చేసిన మంత్రులు, అధికారులు స్పందించలేదన్నారు. పాత ప్రొసీడింగ్స్‌తో పనులు చేయిస్తే రాజీనామా చేస్తానన్నది నిజమేనన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కోరినా ఎవరూ స్పందించలేదన్నారు. అందువల్లే ఎంపీపీ పదవికి రాజీనామా చేసేది లేదన్నారు. -
తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలన.. ఇళ్ల వద్దకు అధికారులు
2016లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనర్హుల పేరుతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వందలాది తెల్లకార్డులను తొలగించింది. లబ్ధిదారులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కార్డులను రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ... గతేడాది ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరి పలు సూచనలు చేసింది. రద్దు చేసిన తెల్ల రేషన్‌కార్డులపై పునఃపరిశీలన జరిపి వారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీంతో నేటి నుంచి తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలణను జిల్లా అధికార యంత్రాంగం ప్రారంభించింది. సాక్షి, మేడ్చల్ జిల్లా: చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, ఆధార్ సంఖ్య రెండు సార్లు నమోదైన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయిన వారు, నిబంధనలకు మించి భూములు కలిగి ఉన్న వారు... తదితర కారణాలతో కార్డులను గతంలో రద్దు చేశారు. అయితే వారికి ఫలానా కారణంగా కార్డు రద్దు చేస్తున్నామనే నోటీసులు జారీ చేయకపోవడంతో ప్రస్తుతం మళ్లీ విచారించి నోటీసులు జారీ చేయాల్సి వస్తోంది. వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్ కార్డుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం నుంచి తనిఖీల నిమిత్తం సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారణ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశీలన అనంతరం అర్హులకు కార్డులు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 95,040 తెల్లరేషన్ కార్డులు తొలగించారు. రద్దయిన ఈ కార్డులను పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి పరిశీలన అనంతరం అర్హులైన వారికి తిరిగి తెల్ల రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లకు అధికారులు రద్దు చేసిన తెల్లరేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకొని నోటీసులు జారీ చేసే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రద్దయిన కార్డుల జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో ఉంచింది. వాటిని ఆయా మండలాల తహసీల్దారులు డౌన్లోడ్ చేసుకొని విచారణ సాగిస్తున్నారు. రద్దయిన కార్డుదారులను కలిసి నోటీసులు జారీ చేసి వివరాలను సేకరిస్తున్నారు. విచారణలో అర్హులుగా తేలిన వారికి కార్డులను పునరుద్ధరిస్తారు. మేడ్చల్ జిల్లాలో రద్దయిన తెల్లరేషన్ కార్డులు: 95,040 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తంగా 95,040 తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. మండలాలు, జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిళ్ల వారీగా రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల ఈ విధంగా ఉన్నాయి. బాచుపల్లి మండలంలో 2,378 తెల్లరేషన్ కార్డులు రద్దు కాగా, ఘట్కేసర్లో 2,273, కాప్రాలో 2,263, కీసరలో 3,388, మేడ్చల్‌లో 2,306, మేడిపల్లిలో 4,165, శామీర్‌పేట్‌లో 893, మూడు చింతలపల్లి మండలంలో 328 రేషన్‌కార్డులు రద్దయ్యాయి. ► అలాగే, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. రద్దయిన కార్డుదారులు అందుబాటులో ఉండాలి గతంలో రద్దయిన రేషన్ కార్డుదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి. విచారణకు నియమించబడిన అధికారులు తనిఖీల నిమిత్తం మీ ఇంటి వద్దకు వస్తారు. జిల్లాలో మొత్త గా 95,040 తెల్లరేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇంటి చిరునామా, ఫోన్ తదితర విషయాలలో ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే సంబంధిత తహసీల్/సహాయ, పౌర సరఫరాల కార్యాలయంలో సంప్రదించాలి. – ఏనుగు నర్సింహారెడి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) -
సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..
సాక్షి, హైదరాబాద్: సర్కారు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇప్పుడు ఈ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ఆక్రమిత ప్రభుత్వ స్థలాలపై క్షేత్ర స్థాయి విచారణకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గత రెండు నెలల క్రితం జీవో 58, 59 అనుబంధంగా విడుదలైన జీవో కింద వచ్చిన దరఖాస్తులపై విచారణ ప్రారంభమైంది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి వివరాలను సేకరిస్తోంది. ప్రతి మండల స్థాయి కమిటీకి జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సమగ్ర వివరాల సేకరణ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నివాసం డోర్ టూ డోర్ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు సేకరించి అక్కడికక్కడే ‘జీవో 58, 59 మొబైల్ యాప్’లో నమోదు చేస్తున్నారు. అనంతరం వాటిని కలెక్టర్ లాగిన్‌కు సిఫార్సు చేస్తారు. మరోమారు వాస్తవ పరిస్థితిని పరిశీలించిన అనంతరం క్రమబద్ధీకరణ దరఖాస్తు ఆమోదం లేదా తిరస్కరించే విధంగా చర్యలు చేపట్టారు. 1.14 లక్షలపైనే.. గ్రేటర్లో క్రమబద్ధీకరణ కోసం సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం నాటితో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో జిల్లా వారిగా పరిశీలిస్తే అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దరఖాస్తులు ఇలా కుత్బుల్లాపూర్ –23,878, కాప్రా– 15,848, శేరిలింగంపల్లి– 9,854, కూకట్పల్లి– 9,014, అబ్దుల్లాపూర్‌మెట్–5,990,బాలాపూర్– 4,494, ఉప్పల్–4,231, సరూర్‌నగర్– 3,669, దుండిగల్–3,112, షేక్‌పేట– 2,980, బాచుపల్లి–2,739 హయత్‌నగర్– 2471, మేడిపల్లి– 2,011, ఖైరతాబాద్–1,987, గండిపేట–1,741, ఆసిఫ్‌నగర్– 1,732, రాజేంద్రనగర్– 1,527, సైదాబాద్– 1,147, శంకర్పల్లి– 883, ముషీరాబాద్– 751. (క్లిక్: పాతబస్తీ మెట్రోపై మళ్లీ కదలిక!) -
వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో 75 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోమవారం నుంచే పెరిగిన జీవితకాల పన్ను అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. మొదటి రోజు నమోదైన వాహనాలన్నీ పాత జీవితకాల పన్నుపైనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో వాహనదారుల నుంచి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం మిగతా డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు స్లాబ్‌ల పద్ధతి ఉండగా, కొత్తగా 4 స్లాబుల్లో జీవిత కాల పన్నును విధించిన సంగతి తెలిసిందే. వాహనాల ఖరీదు ఆధారంగా పన్ను విధించినప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై భారం అధికంగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సగటుజీవిపై పన్ను బాదుడు పిడుగుపాటుగా మారింది. జీవిత కాల పన్ను రూపంలో నగరంలోని వాహనదారులుపై ఏటా రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆదాయంలోనూ ఆ మూడు జిల్లాలే.. ► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3500 వరకు కొత్త వాహనాలు నమోదవుతుండగా వీటిలో సగానికి పైగా గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఆదాయంలోనూ ఈ మూడు జిల్లాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా ప్రస్తుతం 1.34 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 70 లక్షలు దాటింది. ► రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు, పర్మిట్లు, వివిధ రకాల పౌరసేవల పునరుద్ధరణపై వచ్చే ఆదాయం కంటే జీవితకాల పన్ను రూపంలోనే ఆర్టీఏకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు రూ.3,350 కోట్ల వరకు ఆదాయం లభించగా గ్రేటర్ పరిధిలోనే రూ.1600 కోట్లకు పైగా ఆదాయం నమోదు కావడం గమనార్హం. ► కొత్తగా పెంచిన జీవితకాల పన్ను ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా గ్రేటర్ నుంచి లభించనుంది. ఇతర రాష్ట్రాలవాహనాల రీరిజిస్ట్రేషన్, హై ఎండ్, లగ్జరీ వాహనాల నమో దు, ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ వేలం తదితర రూపాల్లోనూ రవాణా శాఖకు హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ద్విచక్ర వాహనాలే టాప్... ► గ్రేటర్లో ప్రతి రోజు 1500 నుంచి 2000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి వరకు ద్విచక్ర వాహనాలే. కోవిడ్ కాలంలో సైతం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 శాతం చొప్పున పాత జీవితకాల పన్ను ప్రకారం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు బైక్‌లు లభించాయి. ప్రస్తుతం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ పెరగడంతో వాహనాల ధర రూ.80 వేల నుంచి రూ.90 వేలు దాటనుంది. పెరిగిన పన్నుల మేరకు ద్విచక్ర వాహనాలపైనే గ్రేటర్లో రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా. (చదవండి: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) ► ఇక పాత పన్నుల ప్రకారం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే రూ.10 లక్షల వరకు ఖరీదైన కార్లకు 12 శాతం ఉండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచారు. ఈ మేరకు ఈ కేటగిరి వాహనాలపైనే రూ.కోటికిపైగా అదనపు భారం పడనుంది. అన్ని రకాల వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం అదనంగా లభించే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!) -
కలహాలతో పిల్లలు బలి.. కన్న పేగుతో కాటికి..
నవమాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లి తాను ఆత్మహత్య చేసుకుని మరణిస్తే తన పిల్లలను చూసుకునే వారు ఉండరని భావించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలను సైతం తన తోడు తీసుకెళ్లాలని భావించి వారిని తన కొంగుతో చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలతో సహా ఆ మహిళ చెరువులో దూకింది. ఇద్దరు చిన్నారులతో సహా ఆమె మరణించిన విషయం విదితమే. మేడ్చల్‌రూరల్: ఈ ఘటనలో శివరాణి పెద్ద కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారుల(దీక్షిత్, ప్రణీత)తో పాటు ఆమె మృతి చెందారు. శివరాణి మృతికి కారణమైన భర్త(భిక్షపతి)కు మృతురాలి బంధువులు దేహశుద్ధి చేశారు. మేడ్చల్ పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించారు. కలహాలతో పిల్లలు బలి.. భార్యాభర్తల మధ్య గొడవ అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మేడ్చల్ పోలీసులు భర్త భిక్షపతి, అత్త రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారిపై 498ఏ, 302, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో విషాదఛాయలు.. శివరాణి, పిల్లలు దీక్షిత్, ప్రణీతల మృతదేహాలకు గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు రాజబొల్లారం గ్రామానికి మృతదేహాలు చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతదేహాలను మృతురాలి తండ్రి, బంధువులు తమ చేతుల్లో పట్టుకుని తీసుకెళ్లిన దృశ్యం అందరినీ కలచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలతో బయటపడిన మరో కుమారుడు జగదీశ్‌ను మృతురాలి తల్లిదండ్రులు చెంత ఉన్నాడు. అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: జూబ్లీహిల్స్: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి.. -
మేడ్చల్‌లో దారుణం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ముగ్గురు పిల్లలతోపాటు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలు మరణించగా, అదృష్టవశాత్తు కుమారుడు మృత్యువు అంచులవరకు వెళ్లి బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి భిక్షపతి, మమత దంపతులు. భిక్షపతి ప్లంబర్ పనులు చేస్తున్నాడు.పెళ్లయిన నాటి నుంచే భిక్షపతి మమతపై అనుమానం పెట్టుకుని ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించసాగాడు. తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషులు సర్ది చెప్పారు. వారికి జగదీశ్ (6), ప్రణతి (3), దీక్షిత్ (1) అనే పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టినా భిక్షపతి తీరు మారలేదు. గత రెండు నెలలుగా రోజూ మద్యం తాగి భార్య మమతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా భిక్షపతి, మమతను చితకబాది హింసించాడు. దీంతో మనస్తాపం చెందిన మమత.. తాను చెరువులోకి దూకి చనిపోతానని ఇరుగుపొరుగు వద్ద వాపోయింది. బుధవారం ఉదయం పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపకుండా వారితోపాటే ఆమె ఇంటి వద్ద ఉంది. చదవండి: ఏఎస్పీ ‘ముని రామయ్య’ కేసులో మరో అరెస్టు పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి ఎందుకు పంపలేదని భిక్షపతి ఉదయం మళ్లీ గొడవ పడ్డాడు. దాంతో అంగన్వాడీ కేంద్రానికని బయలు దేరిన మమత.. అక్కడికి వెళ్లకుండా ముగ్గురు పిల్ల లను వెంట పెట్టుకుని తమ పొలం వద్ద ఉన్న చెరువు వద్దకు వెళ్లి పిల్లలను తోసి, తానూ దూకింది. దీంతో నీట మునిగి మమత, ప్రణతి, దీక్షిత్ మృతి చెందారు. మరో కుమారుడు జగదీశ్ అదృష్టవశాత్తు ఒడ్డుకు చేరుకుని బతికాడు. కాగా, మమత ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆమె మరిది, ఆయన భార్య.. అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి చూడగా మమత, పిల్లలు అక్కడ లేరు. చెరువు వద్దకు వెళ్లి చూడగా జగదీశ్ చెరువు ఒడ్డున అపస్మారక స్థితిలో పడిఉండటం గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నీటిలో మునిగిన మృతదేహాలను వెలికి తీశారు. మమత తల్లిదండ్రులు భిక్షపతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నీళ్లు, నిధులు, నియామకాలెక్కడ?
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే, సౌత్ ఇండియా ఇన్చార్జీ సోమనాథ్ భారతి అన్నారు. తెలంగాణ లోని ప్రతి గడపకు వెళ్లి, ప్రజలకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆప్ తెలంగాణ నిర్వహించిన పంజాబ్ విజయోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ముందు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్‌పార్క్ వరకు ర్యాలీ గా వచ్చి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు లేవని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, ఉద్యమ లక్ష్యాలు పక్కకు నెట్టివేశారని సోమనాథ్ ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే సామాన్యుడికే అధికారం అనే నినాదంతో మీ ముం దుకు వస్తున్న ఆప్‌ను అక్కున చేర్చుకోవాలని కోరా రు. అందరి తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు పోరాడితే.. రాష్ట్రం ఏర్పడ్డాక అది కొందరి తెలంగాణగా మారిందని ఇందిరాశోభన్ ఆరోపించారు. -
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో లారీ బీభత్సం
-
మేడ్చల్‌లో ఘోరం.. ఇంటి ముందు నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని చందన్‌రామ్, చందన్ కుమార్ సహరిగా గుర్తించారు. బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్
సాక్షి, మేడిపల్లి(హైదరాబాద్): తల్లిదండ్రులను సంతోషపెట్టేలా యువత తమ భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పీర్జాదిగూడ బుద్ధానగర్ సాయిబాబా టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 వేల పైలుకు పోస్టులను ప్రభుత్వం ప్రకటించందన్నారు. అభ్యర్థులు ఆరు నెలల పాటు సినిమాలు, ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, క్రికెట్ చూడడం తగ్గించుకోవాలని సూచించారు. సెంటర్లో ప్రొజెక్టర్‌ను ప్రారంభిస్తున్న కేటీఆర్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారి పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని అభినందించారు. 20 సంవత్సరాలు అనుభవిజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ సెంటర్లో 3 నుంచి 4 నెలలు పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత మెటీరియల్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీ తత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తుందని భరోసానిచ్చారు. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! Live: Speaking after inaugurating a Govt Coaching Center in Peerzadiguda Municipal Corporation https://t.co/dXWgZpeKZT — KTR (@KTRTRS) March 14, 2022 టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 13 వేల పరిశ్రమల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 6వేల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ హరీష్, జిల్లాపరిషత్ చైర్మన్ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ధి సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
కీసరగుట్ట జాతరకు రూ.50 లక్షలు
Maha Shivratri in Telangana, 2022: మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ హరీష్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట జాతర జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశం, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ, ధర్మకర్తల మండలి సభ్యుడు నారాయణ శర్మ, డీఆర్ఓ లింగ్యానాయక్, ఆర్డీఓలు రవికుమార్, మల్లయ్య, ఆలయ ఈఓ కట్ట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో శాసనాల ప్రదర్శనశాల) -
మోదీని దోషిగా నిలబెడతాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ చెప్పారు. ప్రణాళికా సంఘాన్ని పాతరపెట్టి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్ శక్తులను సభ్యులుగా నియమించారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జాతి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే కార్మికవర్గం, ప్రజలు విముక్తి అవుతారని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పాలనలో నిరుద్యోగుల శాతం 8.1కి చేరుకుందని, వివిధ ప్రభుత్వరంగ శాఖల్లో 9 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని వివరించారు. దేశంలో 40 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారని కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ప్రైవేట్పరమే: ఎంపీ బినోయ్ ఎయిర్ ఇస్రో, రక్షణ, బీమా, బ్యాంకులు ఇలా ప్రతి రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సీపీఐ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం నిలదీశారు. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని ఆరోపించారు. వచ్చే మార్చి 29, 30 తేదీల్లో జరుగుతున్న సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాల్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యం.డి.యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మొట్టె నర్సింహ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, జాతీయ నాయకులు మోహన్, ఓబులేసు, రాజేంద్రన్, విద్యాసాగర్, పీఎం మూర్తి, ప్రేంపావని పాల్గొన్నారు. -
రైతుబంధు.. టాప్‌లో ఏ జిల్లా అంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు యాసంగి రైతుబంధు సొమ్ము అందింది. మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు చెందిన రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లు జమయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ. 601,74,12,080 నిధులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని సూచించారు. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
కరోనా కేసులతో వణికిపోతున్న మేడ్చల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. పాజిటివిటీ రేటు ఒక శాతం లోపుంటే కరోనా నియంత్రణలో ఉన్నట్లు లెక్క. కానీ రాష్ట్రంలో గత వారం సరాసరి పాజిటివిటీ రేటు మూడు శాతం నమోదైంది. అయితే ఏడు జిల్లాల్లో మాత్రం ఏకంగా నాలుగు శాతానికి మించడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో 5.65, రంగారెడ్డి జిల్లాలో 4.92, నిజామాబాద్ జిల్లాలో 4.81, కామారెడ్డి జిల్లాలో 4.51, సంగారెడ్డి జిల్లాలో 4.21, మెదక్ జిల్లాలో 4.02 శాతం నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 0.25 శాతం, గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 0.29 శాతం చొప్పున పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది. 17 జిల్లాల్లో ఒక శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదైనట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. చదవండి: కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా 3.3 శాతానికి పెరిగిన పడకల ఆక్యుపెన్సీ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్, ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ శాతం కూడా కాస్త పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాంధీ సహా జిల్లా ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఆక్సిజన్, ఐసీయూ పడకలు 2.7 శాతం నిండిపోగా, ఈ నెల 12వ తేదీనాటికి 3.3 శాతానికి పెరిగింది. అయితే చాలావరకు కేసులు పెద్దగా సీరియస్ కావడం లేదని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రోగుల కోసం 56,036 పడకలు కేటాయించారు. ఇందులో 97 శాతం వరకు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. పెరిగిన పిల్లల పడకలు పద్నాలుగు ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పిల్లల పడకలను పెంచింది. 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలను 6 వేలు చేసింది. అందులో ఆక్సిజన్ పడకలు 4,125 ఉండగా, ఐసీయూ పడకలు 1,875 ఉన్నాయి. అలాగే ఆయా ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులు 256 మంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. కొనసాగుతున్న ఫీవర్ సర్వే రాష్ట్రంలో లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం కోసం ఫీవర్ సర్వే జరుగుతోంది. తద్వారా ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వైద్యం చేయడం వంటివి చేస్తున్నారు. చాలా మందికి తేలికపాటి లక్షణాలే ఉంటాయి. కొందరికి అసలు లక్షణాలే ఉండటం లేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,231 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 76 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. రోజుకు కనీసం 71,600 టెస్టులు లక్ష్యం ప్రతిరోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. కనీసం 71,600 పరీక్షలైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో రోజుకు కనీసం 12,300 పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అయితే కనీసం కంటే ఎక్కువగానే కొన్నిసార్లు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటికే రెండుసార్లు కనీస లక్ష్యానికి మించి టెస్టులు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ఏకంగా 90,021 పరీక్షలు చేయగా అంతకుముందు రోజు 83,153 పరీక్షలు చేశారు. మరోవైపు కొందరు సొంతంగా పరీక్షలు చేసుకుంటున్నారు. అవి రోజుకు దాదాపు 10 వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్: పెళ్లైన 15 రోజులకే.. శవమై తేలిన నరేష్
సాక్షి, మేడ్చల్: సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కొత్త నరేష్(32) అదృశ్యమయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుండి బయటకొచ్చిన నరేశ్ ఆచూకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామంలోని మంగళ కుంట చెరువు దగ్గర శనివారం నరేష్ ద్విచక్ర వాహనం, చెప్పులను కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని పోలీసలకు తెలపగా నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ.. ఈ క్రమంలో ఈ రోజు చెరువులో నుంచి నరేష్ మృతదేహన్ని గజ ఈతగాళ్ళు వెలికి తీశారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా నరేష్‌కు గత నెల 26న కోకాపేటకు చెందిన యువతితో వివాహం అయ్యింది. పెళ్లైన 15 రోజులకే నరేష్ విగత జీవిగా మారడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేష్‌ది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి.. -
గురుకులం దూరాభారం
ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్‌లో ఉంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ)కు చెందిన మూడు మహిళా డిగ్రీ కాలేజీలు ఈ ఒక్క భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ మూడూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బుద్వేల్, హైదరాబాద్ జిల్లా మహేంద్రహిల్స్‌లో ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. గురుకుల సొసైటీ మాత్రం ఈ మూడింటినీ ఆయా ప్రాంతాలకు దూరంగా, అంకుషాపూర్‌లోని ఒక మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ ఫొటోలోని భవనం శామీర్‌పేటలో ఉంది. ఇక్కడ జగద్గిరిగుట్ట ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిని గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో నిర్వహించగా.. అక్కడ అద్దె భవనం విషయంలో నెలకొన్న సమస్యతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కాలేజీని సుదూర ప్రాంతానికి తరలించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భవనంలో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో రెండు నెలల క్రితం విద్యార్థినులు నిరసనలకు దిగారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా వసతులు కల్పించిన సొసైటీ అధికారులు.. ఈ వ్యవహారం రోడ్డెక్కినందుకు కాలేజీలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల గురుకుల కళాశాల. జిల్లాలోని కోడేరు గురుకుల పాఠశాలలో హాస్టల్ వసతులు సరిపోక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడికి తరలించారు. బైపీసీలో 40 మంది, సీఈసీలో 40 మంది చొప్పున విద్యార్థులను తరలించడంతో విద్యార్థులు తరగతుల్లో కిక్కిరిసి కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే అదే పాఠశాల ఆరో తరగతికి చెందిన రెండు సెక్షన్లను వసతులు లేక అధికారులు నాగర్‌కర్నూల్ పాఠశాలకు తరలించారు. దీంతో కరోనా సమయంలోనూ తరగతి గదుల్లో ఒక్కో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ హాస్టల్లోనూ రద్దీ పెరిగి ఒకే గదిలో 40 మంది వరకు విద్యార్థులు సర్దుకొని ఉండాల్సి వస్తోంది. అంతేగాకుండా మరుగుదొడ్లు, స్నానాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు. కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు. అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే స్థాయిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే వీటికి పక్కాగా భవనాలు నిర్మించి, సరైన విధంగా మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇక్కడి గురుకులం మరెక్కడో ♦రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు. ♦ హైదరాబాద్ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. ♦రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమిన్‌పేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్లోనే నిర్వహిస్తున్నారు. -
ఆరెస్సెస్ జాతీయ బైఠక్‌కు జేపీ నడ్డా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని అన్నోజిగూడలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొంటారు. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహణ, వాటిలో ఏబీవీపీ, బీఎంఎస్, బీకేఎస్, తదితర సంఘాల భాగస్వామ్యం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. -
జైల్లో హత్య చేయించాలని చూశారు: తీన్మార్ మల్లన్న
ఘట్కేసర్: జైల్లోనే తనను హత్య చేయించాలని పెద్దకుట్ర జరిగిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల జేకే కన్వెన్షన్‌లో తీన్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లతో భవిష్యత్ కార్యాచరణసభను ఆదివారం నిర్వహించారు. అధికార పార్టీ అకారణంగా తనను అరెస్టు చేసి 74 రోజులపాటు జైలుకు పంపి ఇబ్బందులకు గురిచేసిందని మల్లన్న పేర్కొన్నారు. గత అక్టోబర్ 2న పాత నేరస్తులతో జైల్లోనే అతి క్రూరంగా చంపాలని చూశారని, అయితే తాను చాక చక్యంగా తప్పించుకున్నానని చెప్పారు. తర్వాతిరోజు చీకటిగదిలో బంధించి మానసిక దివ్యాంగులకు ఇచ్చే మత్తుమందు, మాత్రలతో పిచ్చివాడిని చేయాలని యత్నించారని ఆరోపించారు. జైలు నుంచి బయటకు తీసుకురావడానికి శక్తిమంతమైన కొందరు నాయకులతో ప్రయత్నించడం నిజమేనన్నారు. -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. చదవండి: (వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు) అయితే ప్రియురాలిని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయిని ప్రశాంత్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్‌ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్‌కు తరలించారు. -
మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం
కుత్బుల్లాపూర్: డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఓ ముఠాకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెట్టారు. మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు రూ.2 కోట్ల విలువైన 5 కిలోల మెఫిడ్రోన్/మిథాంఫిటమిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి న్యూ బాలాజీనగర్‌లోని ఎస్వీ సెలెక్షన్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకోవడం తీసుకోవడంతోపాటు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్.. ఈ దాడుల్లో క్యాబ్ డ్రైవర్ పవన్ అలియాస్ చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 5 గ్రాముల మత్తు పదార్థం లభించింది. అదుపులోకి తీసుకుని విచారించగా, కన్నారెడ్డి అలియాస్ మహేశ్ కన్నారెడ్డి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో బొంగులూర్ గేటు సమీపంలోని గురుదత్తా లాడ్జిపై దాడులు చేయగా కన్నారెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 921 గ్రాముల మెఫిడ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మరాజ్పేట మండలం బావాజీపల్లి గ్రామానికి చెందిన కొండమూరి రామకృష్ణగౌడ్ ఇంటిపై దాడులు చేశారు. అతడి వాహనాన్ని తనిఖీలు చేయగా, 4 కిలోల మెఫిడ్రోన్ పట్టుబడింది. బావాజీపల్లికి చెందిన బండారు హన్మంత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి అలియాస్ ఎస్.కె.రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అతను చెప్పారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేసిన ఎస్.కె.రెడ్డి పటాన్చెరులో ఓ మూతబడిన పరిశ్రమను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా, కుత్బుల్లాపూర్, బాలానగర్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల వద్ద నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు లేదా తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన నగదు పారితోషికం అందిస్తామని అధికారులు తెలిపారు. -
జైలుకు వెళ్లిన వ్యక్తి.. సీఎంను తిడతాడా?
జవహర్‌నగర్: ‘రేవంత్ రెడ్డి దోకేబాజ్గాడు, చర్ల పల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడతాడా?’ అంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి టీపీ సీసీ అధ్యక్షుడిపై మరోసారి ఆగ్రహం వ్యక్తంచే శారు. ఆదివారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్లో డివిజన్ కార్యాలయం ప్రారం భోత్సవానికి వచ్చిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇతర పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సీఎం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల సంక్షేమంకోసం రాత్రింబవళ్లు ఆలోచించే గొప్ప వ్యక్తి గురించి రేవంత్‌లాంటి వారు అనుచితంగా మాట్లాడడం సరికాదన్నా రు. ‘రూ.50 కోట్లతో టీపీసీసీ పదవి తెచ్చుకున్న ఈ దొంగ, సీఎంను పట్టుకుని ఎట్లపడితే అట్ల తిడుతున్నడు. వాడు మామూలుగా చచ్చి పోడు. పురుగులు పడి చచ్చిపోతడు. గత కాం గ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు, కరెంటు ఇచ్చారా? వాళ్ల మొఖాలకు ఏం చేసిండ్రు.. మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చి, పెద్దమనిషిని తిడ తాడా.. ఖబడ్దార్! ఇడిసేదేలేదు బిడ్డా. ఏడపడితే ఆడ కొట్టి ఇడిసిపెడతాం, మా కార్యకర్తలు ఎవ్వరూ ఊరుకోరు’అని రేవంత్ రెడ్డిపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
మాట నిలబెట్టుకోలేదనే కవితను ఓడించారు
బోధన్/కుత్బుల్లాపూర్: ప్రజలను మాటలతో మభ్యపెడితే ఓటుతో ఓడిస్తారని, మూతబడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లే రైతులు సీఎం కేసీఆర్ కూమార్తె కవితను ఓడగొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ జలయజ్ఞం ద్వారా అప్పట్లోనే 60–70 లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. హుజూరాబాద్‌లో దళితబంధు అమలు తీరుపై కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే, ఓడిపోతామనే భయంతో తెలంగాణ–ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్.. సోనియాగాంధీ గురించి విమర్శించడం మానుకోవాలని సూచించారు. కుమారుడిని అదుపులో పెట్టుకోకపోవడం డి.శ్రీనివాస్ తప్పేనన్నారు. తాను త్వరలో గజ్వేల్, నిజామాబాద్‌లో భారీసభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ప్రభుత్వ విప్ అనిల్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మేడ్చల్ జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్
-
విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: కీసర మండలం నాగారం వెస్ట్ గాంధీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో నలుగురు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తెల్లవారితే పెళ్లి.. తలుపు తీసి చూస్తే.. మోసపూరితంగా ‘హెచ్1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..! -
పారడైజ్ బిర్యానీలో వచ్చిన పురుగు
-
తల్లి పక్కన ఉండగానే అడవి జంతువుల దాడి!
తుర్కపల్లి: అడవి జంతువులు ఓ చిన్నారిని చిదిమేశాయి. వాటి దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వాపన్ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కుమారుడు హరీశ్ కుటుంబం సహా నెలరోజుల క్రితం వాసాలమర్రికి వలసవచ్చారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కుమారుడు మునేశ్వర్‌రావు(4) ఉన్నారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం వరకు కోళ్లు అమ్ముకొని వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అటవీప్రాంతం కావడంతో పాములు, తేళ్ల భయానికి మునేశ్వర్‌రావు పక్కన తల్లి గంగోత్రి, ఆమెకు రక్షణగా భర్త హరీశ్, మరోపక్కన తాత శివ పడుకున్నారు. అర్ధరాత్రి బాలుడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి పాలిచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూడగా కొడుకు తలను కొరికివేసినట్టుగా ఉండటం చూసి గట్టిగా కేకలేయడంతో భర్త, మామ నిద్రలేచారు. బాలుడి తల రక్తమడుగులో ఉంది. తీవ్రగాయాలపాలై కళ్లు బయటికి వచ్చాయి. రాత్రి 2.30 గంటల సమయంలో బాలుడి తలను అడవిజంతువులు కొరికివేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, బాలుడి తలను కొరికివేసింది కుక్కలా.. అడవిజంతువులా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు. -
‘రాష్ట్రంలోనే మేడ్చల్ అగ్ర పథంలో కొనసాగుతుంది’
సాక్షి, మేడ్చల్ : రైతులు అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలనే లక్ష్యంతో అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్‌పేట్ మండల కేంద్రంలో వ్యవసాయదారుల సేవ సహకార సంఘం నిర్మించిన భవనాన్ని భవనాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వెయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గిడ్డంగులను రెండు కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. దీంతోపాటు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ మాట్లాడుతూ.. శామీర్‌పేట్ వ్యవసాయదారుల సేవ సహకార సంఘం ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులకు అవసరమైన గిడ్డంగులను నాబార్డు నుంచి రుణం పొంది తమ సహకార సంఘం అద్వర్యంలోనే రెండు గిడంగులు నిర్మించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. శామీర్‌పేట్ వ్యవసాయదారుల సేవ సహకార సంఘం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చైర్మన్ ముధాకర్ రెడ్డిని మంత్రి ప్రశంసించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించటంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలోనే అగ్ర పథంలో కొనసాగుతుందని మంత్రి అన్నారు. ముడుచింతలపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి సహాయం చేసిన ముగ్గురు దాతలను మంత్రి అభినందించారు. చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం! అందుకే ఖమ్మం వచ్చా: యాంకర్ ప్రదీప్ -
కీసర ఆత్మహత్యలు: పెద్దల పేర్లు బయటికొస్తాయనే
సాక్షి, హైదరాబాద్: వరుస అరెస్టులు, ఆత్మహత్యలతో ‘కీసర వ్యవహారం’రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మిగిలిన నిందితులంతా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుత పరిణామాలు.. ఈ ఆత్మహత్యల వెనక రాజ కీయ నేతల హస్తం ఉండి ఉంటుందన్న ఏసీబీ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూవివాదం, ధర్మారెడ్డి ఆత్మహత్యపై స్థానిక నాయకుడిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన సదరు నాయకుడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంలో పెద్ద తలలున్నాయని చెప్పుకొచ్చాడు. మాజీ తహసీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డివి ఆత్మహత్యలు కావని, వీరి మృతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేయడంతో వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. అన్నీ అనుమానాలే.. కీసర భూవివాదంలో ఏసీబీ అధికారులు అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ నుంచి రూ. కోటిపది లక్షలు స్వాధీనం చేసుకున్న సమయంలో తొలుత ఓ ఎంపీ పాత్రపై ఆరోపణలొచ్చాయి. సదరు నాయకుడి భూములకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత దీనిపై రకరకాల ప్రచారాలు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. ఆయనకు దీనితో సంబంధం లేదని, ఏమైనా ఆధారాలు లభిస్తే విచారణకు పిలుస్తామని చెప్పారు. తరువాత చంచల్ౖగూడ జైలులో మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆయన భార్య మానవ హక్కుల సంఘం వరకు వెళ్లారు. అంతలోనే నకిలీ పాస్‌పుస్తకాల కేసులో అరెస్టయిన ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ బలవన్మరణాలపై అనుమానాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు మరికొందరి రాజకీయ నేతల పేర్లు బయటికొస్తుండటం వీటికి బలం చేకూరుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే.. కీసర తహసీల్దార్ నాగరాజు సాయంతో కందాడి ధర్మారెడ్డి వివాదాస్పద 93 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు యత్నించాడని, అందులో భాగంగానే తన కుటుంబసభ్యుల పేరిట 24 ఎకరాలకు అక్రమంగా పాస్‌బుక్ లు జారీ చేయించుకున్నాడనేది ఏసీబీ ఆరోపణ. కానీ, తామెక్కడా నిబంధనలు అతిక్రమించలేదని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదుచేసి ధర్మారెడ్డిని, అతని కుమారుడు మరికొందరిని అరె స్టు చేసింది. ఈ వివాదంలో స్థానికంగా ఉండే ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని ప్రచారం జరగడం తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘పెద్దల పేర్లు బయటికొస్తాయనే..’ కీసర భూవివాదంపై సదరు మాజీ ఎమ్మెల్యే ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తనకు, ధర్మారెడ్డి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. నాగరాజు, ధర్మారెడ్డిలవి అనుమానాస్పద మరణాలని, వారిద్దరూ బతికుంటే పెద్దల పేర్లు బయటికి వస్తాయన్న భయంతోనే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 93 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఈనాటిది కాదని, 2015లోనే దీనికి బీజం పడిందని ఆరోపించారు. కొందరు పెద్దలు కేసును ప్రభావితం చేస్తున్నారని, మొత్తం వివాదంపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాస్తానని బాంబు పేల్చారు. -
కీసర భూ వివాదం: ఆత్మహత్యలా? ప్రేరేపిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం మరువక ముందే అక్రమ పాస్ పుస్తకాల కేసులో నాగరాజుతో కలిసి అరెస్టయిన మరో నిందితుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్య వెలుగుచూడటం సంచలనం రేపుతోంది. వీరు కేసులకు భయపడి ప్రాణాలు తీసుకున్నారా? లేక ఎవరైనా వీరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిందితుల భద్రతపై ఆందోళన భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఆగస్టు 14న నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. దీంతో ఈ కేసులో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు.. కందాడి ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ప్రధాన నిందితుడు కందాడి ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, మిగిలిన నిందితులంతా జైలులోనే ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో జైలులో ఉన్న మిగిలిన నిందితుల భద్రతపై వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. (చదవండి: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు: వెంకటమ్మ) ఇదీ వివాదం.. ధర్మారెడ్డి అనేక నకిలీ పత్రాలు సృష్టించి వందల ఎకరాలు కాజేసేందుకు యత్నించిన దాఖలాలున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారు. కీసర మండలంలో 96.22 ఎకరాల భూమిని రక్షిత కౌలుదారు కింద కాజేసేందుకు గతంలో కీసరలో పనిచేసిన ఓ తహసీల్దార్‌తో కలిసి ధర్మారెడ్డి నకిలీ టెనెంట్ పత్రాలు సృష్టించాడు. స్థాని కులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ధర్మారెడ్డికి ఆ భూమిపై ఎలాంటి హక్కుల్లేవని, అతని వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని అప్పటి తహసీల్ కార్యాలయ అధికారులు సైతం తేల్చారు. తరువాత కీసర మండలానికి నాగరాజు తహసీల్దార్‌గా వచ్చాడు. ధర్మారెడ్డి చక్రం తిప్పి తాను కన్నేసిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు సాయంతో కాజేసే ప్రయత్నం చేశా డు. దీనిపై స్థానికులు అభ్యంతరాలు తెలిపినా.. నాగరాజు పట్టించుకోకుండా ధర్మారెడ్డి, అతని కుటుంబసభ్యులకు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేశాడు. దీంతో స్థానికులు ఆర్డీవో కార్యాలయంలో అప్పీల్‌తోపాటు, ఉన్నతాధికారులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారులు రంగం లోకి దిగి.. నాగరాజు, ధర్మారెడ్డి కలిసి పాల్పడ్డ భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిన మీదట ఏసీబీ నాగరాజు, ధర్మారెడ్డి, అతని కుమారుడు తదితరులను అరెస్ట్ చేసింది. వరుస ఆత్మహత్యలపై ఆరా నాగరాజు ఏసీబీ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కేసు ముగిసిపోదని, యథావిధిగా దర్యాప్తు సాగుతుందని, మిగిలిన నిందితులనూ విచారిస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. అంతలోనే మరో కీలక నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ ఈ కేసులో ఎలా ముందుకు సాగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. వీరు నిజంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారా? ఎవరైనా అందుకు ప్రేరేపించారా? అనేది కూపీలాగేందుకు వీరి ములాఖత్, ఫోన్ రికార్డ్స్‌పై ఏసీబీ ఆరా తీస్తోందని తెలిసింది. రాజకీయ అండదండలున్న వ్యక్తులే వీరి ఆత్మహత్యకు కారణమై ఉంటారని అనుమానిస్తోంది. ఇవి ఆత్మహత్యలు కావని, రాజకీయ అండదండలున్న కొందరు వీరిని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని కీసరవాసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘లైఫ్ వైరో ట్రీట్’తో కోవిడ్‌కు కళ్లెం
బాలానగర్(హైదరాబాద్): కోవిడ్ వైరస్‌తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్ వైరో ట్రీట్’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు బాలానగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సంస్థ వెల్లడించింది. నైపర్, లైఫ్ ఆక్టివ్స్, సుప్రీం ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను శుక్రవారం నైపర్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అనంతరం నైపర్ డైరెక్టర్ డా.శశిబాలాసింగ్ మాట్లాడారు. వ్యాక్సిన్ పనితీరు వివరించారు. నెబ్యులైజర్ సహాయంతో మందు పనితీరు ప్రదర్శించారు. అందరికీ అందుబాటులో తక్కువ ధరకే ఈ మందు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అయినా నియంత్రణలోకి వస్తాయని ఆమె తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్రిములు కేవలం 3 రోజుల్లో శరీరం నుంచి తొలగిపోతాయని వివరించారు. ఈ మందును ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ మెడిసిన్‌గానూ వాడవచ్చని తెలిపారు. కోవిడ్ బాధితులకూ మందుగా ఉపయోగించవచ్చని తెలిపారు. జంతువులు, మానవులపై ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తోందని చెప్పారు. అన్ని శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లకూ వ్యతిరేకంగా ‘లైఫ్ వైరో ట్రీట్’ పనిచేస్తుందని, మానవాళికి సహాయపడుతుందని అన్నారు. -
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయలో ఉన్న ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. రూ.31 లక్షల విలువైన భారీ నకిలీ విత్తనాలతో పాటు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, జొన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల ప్యాకెట్లపై టెస్టింగ్ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాల విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో రూ.12.24 లక్షల విలువైన 1529 మొక్క జొన్న విత్తనాల ప్యాకెట్లను, రూ.18. 76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని అధికారులు అన్నారు. సీజ్ చేసిన విత్తనాలను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించి, వారిపై విత్తన చట్టం, ఐ.పీ.సీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
‘డబుల్’ ఇళ్లకు గ్రహణం
సాక్షి, మేడ్చల్ జిల్లా: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల తీరుతో ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ఇళ్ల నిర్మాణాలపై కరోనా–లాక్డౌన్ మరింత ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం మంజూరు... మేడ్చల్ జిల్లాలో రూ.137 కోట్ల వ్యయంతో 2420 రెండు పడకల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటాయించిన నిధుల్లో రూ.40 కోట్ల విలువైన పనులను కూడా అధికారులు పూర్తి చేయలేకపోయారు. జిల్లాలో ఇప్పటి వరకు 13 ప్రాంతాల్లో 630 ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, 33 ప్రాంతాల్లో 422 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరో 1368 ఇళ్లు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇంకా 260 నిర్మాణాలకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. జిల్లాలో రెండు పడకల ఇళ్ల కోసం 1.20 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వారి ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. కేటాయింపులు అంతంత మాత్రమే జనాభా, ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల ప్రాతిపదికన కాకుండా మేడ్చల్ జిల్లాకు ప్రభుత్వం కేవలం 2,420 ఇళ్లను కేటాయించడంతో అవి ఎటూ సరిపోని పరిస్థితి నెలకొంది. గృహ నిర్మాణ శాఖ రద్దు కావడంతో జిల్లాకు మంజూరైన ఆ కొద్దిపాటి ఇళ్ల నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ (పీఆర్) శాఖలకు అప్పగించి సత్వరమే నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం అవుతోంది. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఇలా.. జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో13 ప్రాంతాల్లో చేపట్టిన 630 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కీసరలో 50 ఇళ్లు, యాద్గార్పల్లి– 40, ఫీర్జాదిగూడ– 74, పర్వతాపూర్– 40, చెంగిచర్ల– 40 , తుర్కపల్లి –40, కిష్టాపూర్– 80, సోమారం– 30, చీర్యాల– 40, బోడుప్పల్– 74, ఘట్కేసర్– 50, కొర్రెముల్లో 80 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పీఆర్ శాఖ ఆధ్వర్యంలో ... జిల్లాలో పంచాయతీ రాజ్ (పీఆర్) శాఖ ఆధ్వర్యంలో 33 ప్రాంతాల్లో 1790 ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రూ.90.57 కోట్లు మంజూరైనప్పటికీ..ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. 422 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.2.98 కోట్లు ఖర్చు చేశారు. 1368 ఇళ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. మేడ్చల్ మండలంలో 308 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉండగా, శామీర్‌పేట్ మండలంలో 370 ఇళ్లకు గాను 40 ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అలాగే, మూడుచింతలపల్లి మండలంలో 450 ఇళ్లకు 100, ఘట్కేసర్లో 354 ఇళ్లకు 90, కీసరలో 170 ఇళ్లకు 54, మేడిపల్లి మండలంలో 138 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అదనపు బాధ్యతతో నత్తనడక ... జిల్లాలో గృహ నిర్మాణశాఖ లేక పోవటంతో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను జిల్లా యంత్రాంగం ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖలకు అప్పగించగా, తమ పరిధిలోని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే.... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాల్సి రావటంతో ఏ పనిపై సరిగ్గా కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే ధర ఎటూ సరిపోవటం లేదన్న కారణంతో కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని తెలుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడి భరించలేక కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినప్పటికీ కరోనా–లాక్డౌన్ కారణంగా మూడు నెలలు జాప్యం జరిగిందని చెప్తున్నారు. -
ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్‌కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
-
స్కూటీపై వెళ్తుండగా చేతిని ‘ముద్దాడిన’ నాగుపాము..
సాక్షి, హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హల్చల్ చేసింది. స్కూటీలో దూరి ఓ వ్యక్తికి చెమటలు పట్టించింది. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూమాదిరిగానే మంగళవారం ఉదయం స్కూటీ తీసుకుని ఉద్యోగానికి బయలుదేరాడు. రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది. దాంతో స్కూటీని ఆపి చూడగా హెడ్‌లైట్‌లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన రాములు స్కూటీని పక్కనపడేసి.. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోగ్గౌడ్కు విషయం చెప్పాడు. వినోగ్గౌడ్ పాములు పట్టే ఎరుకలి మైసయ్యను పిలిపించాడు. స్కూటీ హెడ్‌లైట్‌లో దాగున్న పామును బయటకు తీయించి అడవిలో వదిలేశారు. రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
40 ఏళ్లుగా 'ఆ' గ్రామంలో ఒకే గణేశుడు
సాక్షి, మేడ్చల్: గణేశ్ నవరాత్రులకు గల్లీకో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి హంగు ఆర్భాటం చేయడం... గ్రామం, పట్టణం అని తేడా లేకుండా ప్రతి చోటా జరిగే తంతు. ఇందుకు భిన్నంగా ఒకే గ్రామం... ఒకే వినాయకుడి సంప్రదాయానికి మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగూడ నిలిచింది. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగడం విశేషం. ఏటా వినాయక ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఒకే విగ్రహాన్ని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 40 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకోగా, నేటికీ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అట్టహాసంగా.. భక్తి పూర్వకంగా.... గ్రామంలో ఒకే వినాయకుడ్ని ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఉత్సవాల్లో ఐక్యంగా ఉండి అటు అట్టహాసంగా... ఇటు భక్తి పూర్వకంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా భారీ సెట్టింగ్‌లతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులూ భజనలు, ప్రత్యేక పూజలతో భగవంతుడ్ని ఆరాధిస్తున్నారు. నేటికీ అదే ఆనవాయితీ ఊరంతా ఐక్యంగా ఉండాలన్న ఆకాంక్షతో గ్రామంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేయాలని 40 ఏళ్ల కిందట నిర్ణయించారు. గల్లీకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే భక్తి కన్నా ఆధిపత్య పోరు ఎక్కువ అవుతుంది. ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం సందర్భంగా గొడవలు జరిగి ఐక్యత దెబ్బతింటుంది, మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఒకే వినాయకుడి ప్రతిమ ఉంటే ఐక్యత పెరుగుతుంది. మేము తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానికులు ఇప్పటికీ కట్టుబడటం సంతోషంగా ఉంది. – వెంకటేష్, గ్రామ హనుమాన్ యూత్ సభ్యుడు -
నడవాలంటే నరకమే..!
సాక్షి,మేడ్చల్‌జిల్లా: జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. మౌళిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు .గ్రామ పంచాయతీల నుంచి పట్టణాలుగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపట్టలేదు. అస్తవ్యçస్తమైనరోడ్లు, డ్రైనేజీలతో వర్షం వస్తే రహదారులు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాలక వర్గాలు ఏర్పాటు కాకపోవడంతో స్థానిక అధికారులు ఆడిందే ఆట ..పాడిందే పాట అన్నట్లుగా మారింది . కార్పొరేషన్లలోనూ అదే తీరు మేజర్ గ్రామపంచాయతీల విలీనంతో మున్సిపల్ కార్పొరేషన్లుగా మారిన బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లోనూ çసమస్యలు యథాతథంగా ఉన్నాయి. శివారు కార్పోరేషన్లకు దాదాపు ఐదేళ్లకు పైగా పాలకవర్గం లేక పోవటంతో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధి లో మేడిపల్లి, పర్వాతాపూర్, పీర్జాదిగూడ ప్రాంతాలు ఉండగా, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చెంగిచర్ల, బోడుప్పల్ ప్రాంతాలు ఉన్నాయి. నిజాంపేట్, జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దాదాపు ఐదు లక్షలపైగా ప్రజలు నివాసం ఉంటున్న ఆయా మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజల నుంచి పన్నుల రూపేణా ఏటా రూ.130 కోట్లు వసూలు చేస్తున్న అధికారులు వసతులు కల్పించటంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో వాటి పరిస్థితి గ్రామానికి ఎక్కువ, పట్టణానికి తక్కువ అన్న చందంగా మారింది. పారిశుద్ధ్యం, చెట్ల పొదలు, దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ పరిధిలో మూసీ కాలువ కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్‌కు ‘మిషన్ భగీరథ’ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తామని పాలకులు ఇచ్చిన హామీలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పలు కాలనీల్లో పైప్లైన్లు వేసినా ఇప్పటి వరకు చుక్కనీరు పంపిణీ చేయలేదు. యాప్రాల్ నుంచి దమ్మాయిగూడ, నాగారం వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలు లేక నిత్యం అంధకారం అలుముకుంటోంది. జవహర్‌నగర్ ప్రధాన రహదారిని వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామన్న ప్రజాప్రతినిధుల హామీ అమలుకు నోచుకోలేదు. బాలాజీనగర్, అంబేద్కర్‌నగర్ రోడ్డు ఇరుగ్గా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధ్వానంగా మున్సిపాలిటీలు మేడ్చల్ çమున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. వర్షపు నీరు ఇళ్ల మధ్యన ఖాళీ స్థలాల్లోకి చేరుతుండటంతో మురికి కూపాలుగా మారుతున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో గతవారం 20 మంది భవన నిర్మాణ రంగకార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తూంకుంట మున్సిపాలిటీలోనూ ఎటు చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు, జాతీయ రహదారిపై ఘట్కేసర్ అండర్‌పాస్ నుంచి ఎన్‌ఎఫ్‌సీనగర్ రైల్వేవంతెన వరకు సర్వీస్ రోడ్డు నిర్మించాల్సిఉంది. జాతీయ రాహదారిపై ఘట్కేసర్ బైపాస్ రోడ్డు చౌరస్తా నుంచి ఎన్‌ఎఫ్‌సీనగర్ వంతెన వరకు సెంట్రల్ లైటింగ్ లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోచారం మున్సిపాలిటీలోనూ ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. నారపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, అన్నోజిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ïడ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు కారణ ంగా ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ, కుందన్‌పల్లి, రాంపల్లి గ్రామాల ప్రజలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. అన్నీ మట్టి రోడ్లే పోచారం మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. నారపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, అన్నోజిగూడ, పోచారంలో కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. వీటితో పాటు డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వసతి కల్పించాలి. – వెంకన్న, ఎల్ఐజీ, పోచారం పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలి మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాలనీల్లో మట్టి రోడ్ల కారణంగా వర్షం పడితే ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. – మహిపాల్‌రెడ్డి నడవలేక పోతున్నాం చిన్నపాటి వర్షానికే నడవలేని పరిస్ధితి నెలకొంది. కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసినా ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. – కొత్తకొండ వేణు, జవహర్‌నగర్