
జవహర్‌నగర్: ‘రేవంత్ రెడ్డి దోకేబాజ్‌గాడు, చర్ల పల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడతాడా?’ అంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి టీపీ సీసీ అధ్యక్షుడిపై మరోసారి ఆగ్రహం వ్యక్తంచే శారు. ఆదివారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో డివిజన్ కార్యాలయం ప్రారం భోత్సవానికి వచ్చిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇతర పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సీఎం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు.
ప్రజల సంక్షేమంకోసం రాత్రింబవళ్లు ఆలోచించే గొప్ప వ్యక్తి గురించి రేవంత్‌లాంటి వారు అనుచితంగా మాట్లాడడం సరికాదన్నా రు. ‘రూ.50 కోట్లతో టీపీసీసీ పదవి తెచ్చుకున్న ఈ దొంగ, సీఎంను పట్టుకుని ఎట్లపడితే అట్ల తిడుతున్నడు. వాడు మామూలుగా చచ్చి పోడు. పురుగులు పడి చచ్చిపోతడు. గత కాం గ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు, కరెంటు ఇచ్చారా? వాళ్ల మొఖాలకు ఏం చేసిండ్రు.. మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చి, పెద్దమనిషిని తిడ తాడా.. ఖబడ్దార్! ఇడిసేదేలేదు బిడ్డా. ఏడపడితే ఆడ కొట్టి ఇడిసిపెడతాం, మా కార్యకర్తలు ఎవ్వరూ ఊరుకోరు’అని రేవంత్ రెడ్డిపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.