సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
మొత్తం ఓటర్లు 41.46 లక్షలు
హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు.
తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా..
వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు.
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్‌ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment