ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు
ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో..
సాక్షి, సిటీబ్యూరో: సొంత స్థలాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సంబంధిత అధికారులు ఆ పనుల్లో పడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకొచ్చే జిల్లాలు నాలుగున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంది. ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఏ జిల్లా పరిధిలో ఎందరున్నారో ప్రజాపాలన కార్యక్రమాల్లో అందిన దరఖాస్తుల్ని లెక్కలు తీశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనే జీహెచ్‌ఎంసీ వార్డులు కూడా ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. తర్వాత మేడ్చల్ జిల్లాలోని వారు ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల వంతున జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థికసాయం అందనుంది.
సర్వేయర్లకు సహకారం..
దరఖాస్తుదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి ‘ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్’లో వివరాలు నమోదు చేసేందుకు సర్వేయర్లుగా జీహెచ్‌ఎంసీ సిబ్బందితోపాటు ఆయా జిల్లాల సిబ్బంది పని చేయనున్నారు. క్షేత్రస్థాయిలో లబి్ధదారుల చిరునామాను గుర్తించేందుకు జిల్లాల సిబ్బందికి, కంటోన్మెంట్ సిబ్బందికీ జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో పనిచే స్తున్న యూసీడీ, ఎంటమాలజీ విభాగాల సిబ్బందితోపాటు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు,తదితరులు సహకరించనున్నారు. మొబైల్ యాప్‌లో వివరాల నమోదు, అప్‌డేషన్‌ల కోసం జీహెచ్‌ఎంసీ జోనళ్లస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment