Votes remove
-
టీడీపీ ‘ఐ’ గేమ్..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘ఉదయగిరి మండలం గండిపాళెంలోని 31, 32 పోలింగ్ కేంద్రాల పరి«ధిలో 42 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు రాపల్లె శ్రీనివాసులు అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.’ – ఇది ఈనాడు పత్రికలో వచ్చిన వార్త. వాస్తవం ఏంటంటే... గండిపాళెంలో 42 మంది ఓట్ల తొలగింపు కోసం ఫారం–7 ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడం నిజమే. కానీ రాపల్లె శ్రీనివాసులు పేరుతో నమోదు చేసింది మాత్రం జిల్లా ఐ టీడీపీ వింగ్‌లో ఉన్న కీలక వ్యక్తి. గండిపాళేనికి చెందిన ఐ టీడీపీ లీడరే రాపల్లె శ్రీనివాసులు పేరుతో ఫారం–7 నమోదు చేయించి ఆ నేరం వైఎస్సార్సీపీపై నెట్టేశారు. ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పచ్చపత్రికలో దీనిపై వార్త కూడా ప్రచురించేశారు. ఆ 42 మంది అసలు స్థానికులు కారు. వ్యాపారాల పేరుతో గత 20 ఏళ్లుగా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో స్థిరపడిన వారే. వారి ఆధార్ కార్డులు పరిశీలించినా స్థానికేతరులని తెలుస్తుంది. కానీ తహసీల్దార్ వాస్తవాలు తెలుసుకోకుండా పచ్చపత్రిక ప్రభావం, స్థానిక టీడీపీ నేతల ఒత్తిడితో రాపల్లె శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. స్వచ్ఛమైన జాబితాలపైనా టీడీపీ కుయుక్తులు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ రకరకాల కుయుక్తులు పన్నుతోంది. తాజాగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ అభూత కల్పన కోసం ఐ టీడీపీ వింగ్‌ను టీడీపీ రంగంలోకి దింపింది. ఆ టీం సభ్యులు టీడీపీ సానుభూతిపరులు అధి కంగా ఉన్న గ్రామాలను ఎంచుకుంటున్నారు. ఆ గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాలలో వ్యాపార నిమిత్తం స్థిరపడి ఉండి టీడీపీ సానుభూతిపరులైన వారిని ఎంపిక చేసుకుని వారి ఓట్లు తొలగించమని, ఈ మెయిల్స్ ద్వారా ఆన్లైన్లో ఫారం–7ను నమోదు చేయిస్తున్నారు. వెంటనే స్థానిక టీడీపీ నేతల చేత ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఇరకాటంలో అధికారులు టీడీపీ చేస్తున్న ఈ పన్నాగంతో అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ముందుగా ఐ టీడీపీ సభ్యులు ఫారం–7 దరఖాస్తులు పంపి ఎల్లో మీడియాలో అవి వైఎస్సార్సీపీ నాయకులు పంపినట్లుగా కథనాలు రాయిస్తున్నారు. రోజూ అధికారులపై వ్యతిరేక వార్తలు రాయించి వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. నెల రోజులుగా జిల్లాల్లో ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ ఎల్లో మీడియాలో నిత్యం వార్తలు వసూ్తనే ఉన్నాయి. వాటిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వాటిని జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ పంపి విచారణలు చేయించడం జరుగుతోంది. ఇలా అధికారులపై కొత్తరకం దాడి చేయిస్తున్నారు. -
అధికారం కోసం అడ్డదారులు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుపొందడానికి రాజకీయపార్టీలు ప్రయత్నించడం సాధారణం. కానీ.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఇందుకు భిన్నం. అడ్డదారుల్లో గెలుపొందటానికి ప్రయత్నించడం ఆ పార్టీ నైజం. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి కుట్రలు చేయడం టీడీపీ రివాజుగా మార్చుకుంది. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు చేర్పించి.. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చాక సేవా మిత్ర యాప్‌తో 2015–17 మధ్య 50.23 లక్షల మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు... ఇపుడు ప్రతిపక్షంలోకి మారినా అదే కుట్రను అమలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం–1950లో సెక్షన్–123(3)కి విరుద్ధంగా మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ ఆనే వెబ్ సైట్ ఏర్పాటుచేశారు. ఈ వెబ్సైట్ ద్వారా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలుకుతారో వివరాలు సేకరిస్తోంది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన వారిని లక్ష్యంగా చేసుకుంటోంది.. బతికున్నప్పటికీ చనిపోయినట్లు చిత్రీకరించి, నకిలీ అంటూ వక్రీకరించి, శాశ్వతంగా వలస వెళ్లారంటూ మాయచేసి, రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ బొంకి.. సుమారు పది లక్షలకుపైగా ఓట్లను తొలగించాలంటూ టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ గంపగుత్తగా ఎన్నికల సంఘానికి ఫారం–7లను అందజేశారు. వాటిపై ఆయా జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. కొనేరు సురేష్ గంపగుత్తగా దరఖాస్తు చేసిన ఫారం–7లపై విచారణ చేసిన బీఎల్వోలు.. అందులో 80 శాతానికిపైగా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేశారని తేల్చారు. ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించారు. ఓట్లను తొలగించేందుకు తప్పుడు సమాచారంతో ఫారం–7లు దరఖాస్తు చేయడం ఐపీసీలో సెక్షన్–182, ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లో సెక్షన్–31 ప్రకారం నేరం. ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా.. లేదంటే ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును హరిస్తూ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా లక్షలాది ఫారం–7లు దరఖాస్తు చేసి, అధికారుల సమయాన్ని వృథా చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కొనేరు సురే‹Ùపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం అమెరికాలో నిక్షిప్తం.. ఎన్నికల్లో ఇచ్చి న హామీల్లో 99.5 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.17 లక్షల కోట్ల ప్రయోజనాన్ని ప్రజలకు చేకూర్చారు. సంక్షేమ పథకాల ఫలాలు 87 శాతం కుటుంబాలకు చేరాయి. వికేంద్రీకరణ, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉనికి కాపాడుకోవడం కోసం ఎప్పటిలానే ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరతీశారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నప్పుడు తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్‌కు అనుసంధానం చేసి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి బూత్‌లో ఇంటింటికీ కార్యకర్తలను పంపి.. ఓటరు పేరు, ఓటరు కార్డు నెంబరు దగ్గర నుంచి కులం, మొబైల్ నెంబరు, ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతారు వంటి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా వారి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది ప్రజాప్రతినిధ్య చట్టం–1950 ప్రకారం నేరం. ఇలా అక్రమంగా సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అమెరికాలో వర్జీనియాలోని యాష్బర్న్లో అమెజాన్ డేటా సర్వీసెస్‌లో నిక్షిప్తం చేస్తుండటం గమనార్హం. గంపగుత్తగా పది లక్షలకుపైగా ఫారం–7 దరఖాస్తులు.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని.. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే.. వాటిని తొలగించేందుకు రోజుకు గరిష్ఠంగా 5 వరకు ఫారం–7లను ఆన్లైన్లో దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. తప్పుడు సమాచారంతో ఫారం–7లను దరఖాస్తు చేస్తే.. అలా దరఖాస్తు చేసిన వారిపై బీఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్లు) చట్ట ప్రకారం కేసులు పెడతారు. గంపగుత్తగా ఫారం–7లు అందజేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ.. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ ద్వారా సేకరించిన సమాచారంతో తొలి దఫాలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సుమారు పది లక్షల మంది ఓట్లను జాబితాను తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేయడం గమనార్హం. బతికున్నా చనిపోయినట్లు.. నివాసం ఉన్నా వలస వెళ్లినట్లు.. వైఎస్సార్సీపీ మద్దతుదారులు బతికున్నా సరే చనిపోయినట్లు.. నివాసం ఉన్నా సరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు.. చిరునామా పక్కాగా ఉన్నా నకిలీ చిరునామాతో ఓట్లు ఉన్నట్లు.. ఒకే వ్యక్తికి ఒక చోట ఓటు ఉన్పప్పటికీ రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు చిత్రీకరిస్తూ.. పది లక్షలకుపైగా ఓట్లను తొలగించాలని ఫారం–7లను గంపగుత్తగా టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశారు. వాటిపై విచారణకు ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దాంతో.. టీడీపీ అందజేసిన ఫారం–7లను బీఎల్వోలకు పంపి క్షేత్ర స్థాయిలో విచారణ చేసింది. అందులో 80 శాతం వరకూ తప్పుడు సమాచారంతో ఫారం–7లను దరఖాస్తు చేసినట్లు బీఎల్వోలు తేల్చారు. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో బతికి ఉన్న 8,355 మందిని చంపేసిన టీడీపీ.. ♦ అన్నమయ్య జిల్లాలో రాజంపేట, కోడురు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో 18,936 మంది చనిపోయినట్లు, 5071 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు, 910 నకిలీ ఓట్లు ఉన్నట్లు, 3,799 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 11,642 మంది నివాసం ఉంటున్న ఇళ్లు లేనట్లు చూపి మొత్తం 40,358 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి గంపగుత్తగా దరఖాస్తులు అందజేశారు. వాటిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ♦ టీడీపీ దరఖాస్తు చేసిన 40,358 ఫారం–7లపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ చేయించారు. 10,581 మంది చనిపోయినట్లు, 933 మంది శాశ్వతంగా వలసపోయినట్లు, 1397 మందికి రెండు చోట్ల ఓటు ఉన్నట్లు, 2350 ఓట్లను ఇప్పటికే తొలగించినట్లు విచారణలో వెల్లడైంది. అంటే.. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లలో 25,097 నకిలీవని స్పష్టమవుతోంది. అంటే.. 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లు టీడీపీ చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 25,097 మందికి ఓటు హక్కు లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ పంపారు. విశాఖ జిల్లాలో 4,632 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు.. ♦ విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో 8,914 మంది చనిపోయినట్లు, 4,862 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు, 391 నకిలీ ఓట్లు ఉన్నట్లు, 11,279 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 13,426 మంది చిరునామాలు లేనట్లు చిత్రీకరిస్తూ 38,872 ఓట్లు తొలగించాలని టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి ఫారం–7లను గంపగుత్తగా అందజేశారు. వాటిపై విశాఖపట్నం కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ♦ కొనేరు సురేష్ దరఖాస్తు చేసిన 38,872 ఫారం–7లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో 26,123 ఫారం–7లు తప్పుడు సమాచారంతో దరఖాస్తు తేల్చారని తేల్చారు. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7ల మేరకు 5,027 మంది చనిపోయినట్లు, 6,647 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 841 మందికి రెండు ఓట్ల ఓట్లు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే 254 ఓట్లు తొలంచినట్లు తేల్చారు. వీటిని పరిశీలిస్తే.. విశాఖ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 3,887 మంది బతికే ఉన్నా చనిపోయినట్లు, 4,632 మంది స్థానికంగా నివాసం ఉన్నా శాశ్వతంగా వలస పోయినట్లు టీడీపీ తప్పుడు సమాచారం ఇచ్చి నట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు విచారణ నివేదికను విశాఖ కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదించారు. గుంతకల్లు నియోజకవర్గంలో 4,666 ఓట్ల తొలగింపునకు కుట్ర ♦ అనంతపురం జిల్లాలో గుంతకల్లు నియోజవకర్గంలో 9,582, రాయదుర్గం నియోజకవర్గంలో 6,130, శింగనమల నియోజకవర్గంలో 1904, అనంతపురం నియోజకవర్గంలో 1803, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 6,416 ఓట్లను తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ గంపగుత్తగా ఎన్నికల సంఘానికి అందజేశారు. వాటిపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ♦ టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లపై అనంతపురం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. గుంతకల్లు నియోజవకర్గంలో 4,666, రాయదుర్గంలో 1,630, శింగనమలలో 1137, అనంతపురంలో 406, కళ్యాణదుర్గంలో 2,640 ఓట్లు అర్హమైనవిగా తేల్చారు. అంటే.. టీడీపీ ఎంత భారీ ఎత్తున తప్పుడు ఫారం–7లను దరఖాస్తు చేసిందో విశదం చేసుకోవచ్చు. కుప్పంలో 2,435 మందిని చంపేశారు.. ♦ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుప్పం, నగరి, జీడినెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో 27,008 ఓట్ల తొలగింపు కోసం ఫారం–7లను ఆపార్టీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ దరఖాస్తు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాటిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారణ చేయించారు. ఎన్టీఆర్ దెబ్బకు 1983 ఎన్నికల్లో సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయి 1989 ఎన్నికలకు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వలస వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఆరు సార్లు వరుసగా గెలిపించిన పాపానికి కుప్పం నియోజకవర్గంలో 2,435 మంది బతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లుగా తేల్చేసిన టీడీపీ వారి ఓట్లు తొలగించాలని ఫారం–7లు దరఖాస్తు చేసినట్లు కలెక్టర్ విచారణలో వెల్లడైంది. ఇక చిత్తూరు జిల్లాలో పుంగనూరు, నగరి, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో బతికి ఉన్న 4,780 మందిని కొనేరు సురేష్ చనిపోయినట్లుగా చిత్రీకరించి.. వారి ఓట్లను తొలగించాలని కోరడం గమనార్హం. కలెక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లపై విచారణ చేసిన కలెక్టర్లు.. అందులో 80 శాతానికిపైగా తప్పుడు సమాచారంతో కూడుకున్నవని తేల్చారు. అర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఆ ఓట్లను తొలగించాలంటూ కలెక్టర్లను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, చిత్తూరు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే అందుకు తార్కాణం. 2019 ఎన్నికలకు ముందు 50.23 లక్షల ఓట్లు తొలగింపు విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చి న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆధార్తోసహా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ–ప్రగతి నుంచి ప్రైవేటు సంస్థలు ఐటీ గ్రిడ్స్, బ్లూప్రాగ్ సంస్థలకు చేరవేశారు. అదే సంస్థలతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను తయారుచేయించి.. తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దానితో అనుసంధానం చేశారు. దీనిపై హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. 2015–17 మధ్య ఇంటింటికీ వెళ్లిన టీడీపీ కార్యకర్తలు సేవా మిత్ర యాప్‌లలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతామని చెప్పిన వారి ఓట్లను తొలగించేలా ఫారం–7లను దరఖాస్తు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్రంలో 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేల్చిన ఎన్నికల అధికారులు 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో చేర్చారు. దీంతో గత ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. -
అనర్హుల ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను తొలిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని మంత్రి దాడిశెట్టి రాజా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనర్హుల ఓట్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను మంత్రులు చెల్లబోయిన వేణు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌లు కలిశారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆ ఓట్లను తనిఖీ చేసి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. అనర్హులైన ఓటర్లందరిని తొలగించాలని కోరామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో భారీగా అక్రమ ఓట్లను నమోదు చేశారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇప్పటికే బీఎల్ఓలు ఆ అనర్హులని గుర్తించారని పేర్కొన్నారు. కానీ వాటిని ఇంకా తొలగించలేదని తెలిపారు. చనిపోయిన ఓటర్లను కూడా తోలగించాలని కోరామని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లోనూ, ఇక్కడ రెండు చోట్లా ఓట్లు ఉండటం సమంజసం కాదని అన్నారు. అందుకే ఆ ఓట్లను వడకట్టి ఎదో ఒక చోట ఉంచాలని కోరినట్లు తెలిపారు. 'పక్క రాష్ట్రల్లో ఉన్నవారికి ఇక్కడ ఓట్లు నమోదు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉండటం, రెండు, మూడు ఓట్లు ఉండటం సమంజసం కాదు. టీడీపీ హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశాం. వాటన్నింటిని తోపగించాలని కోరాం' అని మంత్రి చెల్లబోయిన వేణు తెలిపారు. ఇదీ చదవండి: చంద్రబాబు, రామోజీ అసలు బండారం బట్టబయలు: సజ్జల -
Hyderabad: 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓట్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 41.46 లక్షలు హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు. తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా.. వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
అడుగడుగునా అరాచకాలే
సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రంలోనే అడుగడుగునా అరాచకం తాండవించింది. అక్రమాన్ని ప్రశ్నించినా, నోరు మెదిపినా అటు జైలుకో లేక ఇటు గృహ నిర్బంధమో తప్పని పరిస్థితులు. సాక్షాత్తు ప్రభుత్వం నిరసనలకు దిగితే భద్రత కల్పించిన పోలీసు యంత్రాంగం, ప్రతిపక్షం, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా వెంటాడి కేసులు నమోదు చేసిన ఘటనలు ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను సహించిన జనం ఎన్నికల వేళ తమదైన తీర్పు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. మేమింతే..మారమంతే.. జిల్లా పరిషత్‌కు వెయ్యికోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్ కార్యాలయం స్థానంలో సొంత భవనం కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకు మహాత్మాగాంధీ కాంప్లెక్స్ పేరుతో పంచాయతీరాజ్ కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండాలని తీర్మానించారు. ఈ మేరకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కానీ ఆ స్థలంపై అధికార పార్టీ కన్నుపడింది. ఇంకేముంది జెడ్పీ కార్యాలయ నూతన భవనానికి అనుమతులు రాకుండా అడ్డుకున్నారు. అంతేనా...ఆ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వయానా ఈదర హరిబాబును కలిసి అభ్యర్థించడం, దానిని ఈదర హరిబాబు సమర్థనీయంగా అడ్డుకున్న విషయమూ చర్చనీయాంశమే. ప్రభుత్వ భూములపై పెత్తనమేంటి..? స్థానిక కేశవరాజుకుంటకు పడమర భాగంలో ఉన్న ప్రాంతంపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ భూమిలోకి అడుగుపెట్టారు. హద్దురాళ్లు వేసుకుంటూ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే అప్పటికే ఆ భూముల్లో పట్టాలు ఉన్న వారు తమ భూములంటూ అడ్డుకోగా వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ నేతలు పేదలకు అండగా ఉండి, అసలు ఆ భూమి ఎవరిదంటూ ఆరా తీయడం ప్రారంభించారు. మరో వైపు ప్రజలు గట్టిగా నిలదీయడంతో కొంతమంది అధికార పార్టీ నేతలు పట్టాలను బయటపెట్టారు. తీరా వాటిని చూస్తే కనీసం సంతకాలు కూడా లేనవి కొన్నయితే మరికొన్నింటిపై తహసీల్దార్ చిరంజీవి సంతకం పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఆయన మాత్రం తాను పట్టాలు ఇవ్వలేదని పేర్కొనడం కొసమెరుపు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు వచ్చిన వారిని తమ సమక్షంలోనే విచారించాలని, వారిని ఎవరు పంపించారో నిగ్గుతేల్చాలంటూ కేశవరాజుకుంట, చినమల్లేశ్వర కాలనీకి చెందిన పలువురు మహిళలు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో తమ విధులను అడ్డుకుంటారంటూ ఏకంగా 40 మందిపై కేసులు పెడుతున్నట్లు తాలూకా పోలీసులు పేర్కొన్నారు. తీరా విచారిస్తే ఆ భూమి ఇంకా ఎన్ఎస్పీ స్వాధీనంలోనే ఉంది. అది రెవెన్యూకు కన్వర్షన్ కాలేదు. మరి..పట్టాలు ఎలా చెల్లుబాటవుతాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసులు మౌనం వహించారు. కానీ తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పలువురు కొనుగోలుచేసిన డాక్యుమెంట్లతో ఫిర్యాదులు చేసినా నేటికి వాటిపై కదలిక లేకపోవడానికి కారణం కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడమేననే భావన వ్యక్తం అవుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో రూలా..? ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినా పోలీసులు కేసులు నమోదుచేసిన దాఖలాలు లేవు. కానీ వైఎస్సార్ సీపీ నాయకులు కొద్దిసేపు బస్సులను అడ్డుకున్నారంటూ వారిని పశువులు తోలే వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి దోర్నాలకు తరలించి కేసులు నమోదుచేసిన అనంతరం వదిలిపెట్టిన ఘటనలు నేటికి చిరపరిచితమే. చిరు వ్యాపారులపై ప్రతాపమా..? రంజాన్ మాసం పర్వదినాన ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో అల్లాను పూజించే ముస్లింలపై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. కనీసం ఏంటనేది చెప్పకుండా దుకాణాలను ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేశారు. షాపులను కూల్చవద్దంటూ ముస్లింలు వేడుకున్నా వినలేదు. దశాబ్దాల తరబడి ఊరచెరువు కట్టనే ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్న వారి షాపులను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో ఆ రంజాన్ మాసంలో ముస్లింలు పడిన ఇక్కట్లు చెప్పేవీ కావు. స్థలాలకు పట్టాలు ఉన్నాయని చెప్పినా వాటిని చూపించగా అవి చెల్లవంటూ నగరపాలక సంస్థ కమిషనర్ దుకాణాలను కూల్చేశారు. అయితే ఇదంతా తనకు తెలియకుండా జరిగిందంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తూనే మరో వైపు కోర్టులో ముస్లింలకు ఆ స్థలం దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అధికారం అండగా.. అడ్డగోలుగా.. ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ రాజీనామాతో కొత్తనేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. పట్టుమని 18 మంది మాత్రమే ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. కానీ శాంతిభద్రతల సమస్య తలెత్తే వ్యవహారం ఉందంటూ చివరకు సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి పాలకవర్గ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇచ్చేంత వరకు పోలీసులు వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా మారింది. కేవలం 18 మంది వ్యక్తులకు భద్రత కల్పించలేకపోతే ప్రస్తుతం ఎన్నికలను ఏ విధంగా సజావుగా నిర్వహించగలుగుతారా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ పద్ధతి, పాడు లేకుండా.. ఆర్టీసీలో సిటీ సర్వీసులు ఉండాలంటూ నగర పౌరులు ఎప్పటినుంచో పోరాటం చేస్తూ వచ్చారు. చివరకు మంత్రి శిద్దా రాఘవరావు హయాంలో వాటిని ఏర్పాటుచేశారు. తూర్పునాయుడుపాలెం ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి బయల్దేరిన బస్సు గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ఉన్న మంత్రి ఫ్యాక్టరీ వద్దకు నడిచింది. దూరం విపరీతంగా ఉండడం, కేవలం నాలుగు సర్వీసులు మాత్రమే రెండు ప్రధాన రూట్లలో తిప్పడంతో ప్రజల ఆశలకు భంగం వాటిల్లింది. దీంతో ఆదాయం తక్కువుగా ఉందంటూ కనీసం మంత్రికి కూడా తెలియకుండానే ఆర్టీసీ అధికారులు సిటీ సర్వీసులకు మంగళం పాడేయడం, అనంతరం ఆటో చార్జీలు పెరిగిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకు సిటీ బస్సుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఒంగోలులో సిటీ బస్సుల ఆవశ్యకత ఎంతో ఉన్నా ప్రజాప్రతినిధులెవ్వరూ ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. ఈ క్రమంలో అరాచకాలు స్వస్తి చెబుదాం..ప్రజాస్వామ్యానికి పట్టం కట్టుకుందాం అంటూ ప్రజల నుంచి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతా ఏకపక్షమే.. ఫ్లెక్సీలు చించారనే అనుమానంపై వైఎస్సార్ సీపీ నేతలకు చెందిన పలువురు యువకులను అదుపులోనికి తీసుకొని 24 గంటల పాటు నిర్బంధించారు. కానీ ట్రంకురోడ్డులో ఫ్లెక్సీలను చించడంతో పాటు మరుసటి రోజు కార్యక్రమం జరగకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేసినా స్పందించలేదు. మరుసటి రోజు కేవలం కొద్దిమంది ఎలాగైనా వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని యత్నించడం, వారిని నిలువరించడంలో వైఫల్యం చెందిన పోలీసులు తీరా సమస్య ఉధృతరూపం దాల్చిన తరువాత కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనం వహిస్తే చివరకు వారిపైనే కేసులు నమోదుచేసి జైలుకు పంపించిన ఘటనల పట్ల జనంలో చర్చలు నడుస్తున్నాయి. ఓట్ల చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారంలు సమర్పించాలనుకుంటే వ్యక్తిగతంగా వారే హాజరుకావాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఆగడాలు ఆగలేదు. చివరకు ఓ మహిళా బీఎల్ఓ అధికార పార్టీ నేత వాసు ఒత్తిడికి తట్టుకోలేక పడిపోయింది. ఈ మేరకు ఆమె తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేసినా నేటికి దానిపై చర్యలు లేవు. కానీ గంపగుత్తగా దరఖాస్తులు మీవద్ద ఎందుకు ఉన్నాయంటూ వాటిని తీసుకొని ప్రశ్నించినందుకు టూటౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదవడానికి అధికార పార్టీ ఒత్తిళ్లే పనిచేశాయని విమర్శలు నేటికి వినిపిస్తున్నాయి. డెయిరీ సర్వనాశనం.. ఒంగోలు డెయిరీ ఎవరి పాలనలో తీవ్ర సంక్షోభానికి లోనైంది, డెయిరీ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికార పార్టీ ఎందుకు చిత్తశుద్ధితో ముందుకు రాలేదు, లాభాలలో ఉన్న డెయిరీ నష్టాల బాటలో పట్టడానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరనే అంశంపై నేటికి కనీసం కమిషన్ కూడా లేకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎంతమంది పాల రైతులు తమ డబ్బులు నేటికి పొందలేకపోయారంటూ చర్చించుకుంటున్నారు. -
పశ్చిమంలో ఓట్ల తొలగింపు కలకలం!
సాక్షి, విజయవాడ: రానున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా తిరిగి అధికారాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతుందని పలువురు మండి పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం కావటంతో అధికార పార్టీ పెద్దలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికల్లో ఏదో విధంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో ఫారం–7 ద్వారా కొంతమంది వైఎస్సార్ ఓట్ల తొలగింపుకు కుట్రలు చేస్తే గత నాలుగేళ్లగా ఈప్రాంతంలో వైఎస్సార్ సీపీ అనుకూల ప్రాంతాలంటూ కొన్నింటిని ఎంపిక చేసుకొని అధికారపార్టీ దానిపై దృష్టి సారించింది. పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు కసరత్తు చేశారు. అయితే చాలా మందికి తమ ఓట్లు పోయిన సంగతి తెలియకపోవటంతో ఇప్పుడిప్పుడే బాధితులు బయట పడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ వల్లే..! తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారానే మా ఓట్లు గల్లంతయ్యాయంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. తమ ఇంటికి వచ్చి పెన్షన్ వస్తుందా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటూ అన్ని వివరాలను తీసుకొని వెళ్లి తీరా ఓట్ల తొలగింపు చేశారంటూ 37వ డివిజన్‌కు చెందిన పలువురు మండిపడుతున్నారు. ఇప్పటి వరకూ తమ ఓట్లు ఎలా పోయాయో తెలియని బాధితులు తాజాగా రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఐటీగ్రిడ్ సంస్థ లీలలు, టీడీపీ నేతలు ప్రకటనలతో చాలా మందికి తమ ఓట్లు తొలగింపు వారి పుణ్యమేనని అర్ధమైందంటూ పలువురు చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లో అధికం ... కొండ ప్రాంతాల్లో అధికంగా ఓట్లు గల్లంతైనట్లు ఆయా ప్రాంతాల్లోని నాయకులు చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లోని నివాసితులు తమ ఓట్లును ఎప్పటికప్పుడు పరిశీలించటం చేతకాకపోవటం, నిత్యం కూలి పనులకు వెళ్లేవారు కావటంతో తమ ఓటు ఉన్నది, లేనిది వారు తెలుసుకోలేకపోతున్నారని నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా 37వ డివిజన్లోని కొండ ప్రాంతంలోనూ చాలా వరకూ ఓట్లు గల్లంతయ్యాయి. అలాగే డివిజన్లోని మైనార్టీలకు సంబంధించిన ఓట్లు కనపడటం లేదని ఆయా బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. -
టీడీపీ వైపు లాగండి.. లేకుంటే ఓట్లు ఎత్తేయండి!
సాక్షి, అమరావతి: ‘మీకు ఓటర్లందరి పూర్తి సమాచారమిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాలను టీడీపీకి అనుకూలంగా మార్చండి. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ఇలా చేస్తే ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు మనకు అదనంగా వస్తాయి. అప్పుడు ఎన్నికల్లో మన గెలుపు ఈజీ అవుతుంది..’ అని ఐటీ మంత్రి, సీఎం తనయుడు లోకేశ్ టీడీపీ సమావేశాల్లో కార్యకర్తలకు ఉద్బోధ చేస్తూ వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ప్రజా సాధికార సర్వే డేటా మొత్తాన్ని సేవా మిత్ర యాప్‌కు అనుసంధానం చేశారు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలోని ఐదు శాతం ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా రెండేళ్లుగా టీడీపీ నాయకత్వం చాపకింద నీరులా పనిచేసింది. ఇందుకు టీడీపీ బూత్ కన్వీనర్లు, సభ్యులు, కొన్నిచోట్ల సాధికార మిత్రలను కూడా ఉపయోగించుకున్నారు. ప్రజాసాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చెందిన సమస్త సమాచారాన్ని సేకరించిన టీడీపీ ప్రభుత్వం.. ఇంతవరకు ఈ సర్వే పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. (ఓట్ల తొలగింపు కేసులు...తలలు పట్టుకుంటున్న పోలీసులు ) కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఈ సమాచారాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించే పేరుతో 25 వేల మంది సాధికార మిత్రలను నియమించారు. ప్రతి సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించి.. వారిని స్థానికంగా ఉన్న టీడీపీ బూత్ కన్వీనర్లు, నాయకులకు అనుసంధానం చేశారు. ఆయా కుటుంబాల సమస్త సమాచారాన్ని సేవా మిత్ర యాప్ ద్వారా వీరికి అందించారు. టార్గెట్లు ఇచ్చారు. వారి అవసరాలను ఉపయోగించుకుని ఈ కుటుంబాల్లో కనీసం రెండింటినైనా టీడీపీ వైపు ఆకర్షించే బాధ్యతను వారికి అప్పగించారు. రెండు కుటుంబాలంటే సరాసరిన పది ఓట్లుగా లెక్కించారు. ఇలా ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో ఐదు శాతం ఓట్లు, నియోజకవర్గ స్థాయిలో సుమారు పది వేల ఓట్లను ప్రభావితం చేసేలా ప్లాన్ రూపొందించారు. టీడీపీ వైపు రాకపోయినా, వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నా.. ఆయా కుటుంబాల్లోని వారందరి ఓట్లను తొలగించారు. (ఇబ్బందికర డేటాను తొలగించండి..) -
సర్వే కలకలం
ధర్మవరం: రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు అలజడి సృష్టిస్తున్నాయి. ఓట్లు తొలగిస్తున్నారని, తమకు తెలియకుండా తమ పేరిటే ఫారం–7 దరఖాస్తులు నమోదవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క గోప్యంగా ఉండాల్సిన పౌరుల ఆధార్, అకౌంటు తదితర వివరాలు ఐటీ కంపెనీల వద్దకు చేరుతున్న ఉదంతం ఆధారాలతో సహా బయటపడ్డా.. సర్వేలు మాత్రం అగడం లేదు. ఓటమి భయంతో ఉన్న అధికారపార్టీ పోలీసుల ద్వారా సర్వేరాయుళ్లకు సహకరిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో ట్యాబ్‌లతో సర్వే టీంలు గ్రామ గ్రామానా పర్యటించి వివరాలు సేకరిస్తున్నాయి. ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిని కేంద్రంగా చేసుకున్న ఓ సర్వే టీం నాలుగు బృందాలుగా విడిపోయి, బుధవారం ధర్మవరం మండల పరిధిలోని సీసీకొత్తకోట, నిమ్మలకుంట, పోతులనాగేపల్లి, బిల్వంపల్లి, బుడ్డారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్ల వివరాలను సేకరించారు. బత్తలపల్లి మండల పరిధిలోని జ్వాలాపురం, తంబాపురం గ్రామాల్లో మరో టీం సభ్యులు వివరాలను సేకరించారు. అయితే సీసీ కొత్తకోట, జ్వాలాపురం గ్రామాలకు వెళ్లిన సర్వే టీం సభ్యులకు గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. మీకు వివరాలు చెబితే.. మా ఓట్లు తీసేస్తారంటూ గ్రామస్తులు తిరగబడ్డారు. సర్వే బృందం సభ్యులను ధర్మవరం రూరల్ పోలీసులకు అప్పగించారు. రక్షణగా పోలీసులు అయితే ప్రజల వివరాలను సేకరిస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పగిస్తే.. ‘మీదేం పోయింది.. మీకు ఇష్టం ఉంటే వివరాలు చెప్పండి.. లేకపోతే లేదు.. సర్వేలు అడ్డుకోకూడదంటూ మాకు ఆదేశాలు అందాయి.. మేమేమీ చేయలేం’ అంటూ పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. మరో సర్వే బృందం సభ్యుడు ఏకంగా పోలీస్ అధికారికే ఫోన్ చేసి, తాము సర్వే చేస్తుంటే అడ్డుకుంటున్నారు.. వీళ్లకు కాస్త గట్టిగా చెప్పండని పోలీస్ ఉన్నతాధికారికి చెబితే ఆయన గ్రామస్తులపై బూతుపురాణం మొదలుపెట్టి భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజల వివరాలను భద్రంగా ఉంచాల్సిన అధికారులే సర్వే రాయుళ్లకు వంతపాడుతుంటంతో గ్రామస్తులు చేసేదిలేక నిమ్మకుండిపోయారు. ఎవరూ వివరాలు చెప్పొద్దు సర్వే పేరిట సమాచారం సేకరించే వారెవరికీ మీ వివరాలు చెప్పొద్దు. మనం చెప్పే వివరాలు కంపెనీల చేతికి చేరుతున్నాయి. ప్రభుత్వమే సర్వే చేస్తుంటే గుర్తింపు కార్డు ఇవ్వాలి కదా?.. ఊరూపేరు లేని కంపెనీలు ప్రజల వివరాలు ఎలా సేకరిస్తాయి?.. అయినా పోలీసులు.. ప్రజల వివరాలను సేకరిస్తున్న వారిని అడ్డుకోకుండా ప్రజలను బెదిరించడం ఏమిటి?..– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త -
సర్వే గుట్టు.. లాడ్జీలో రట్టు!
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపు వ్యవహారం జిల్లాలోనూ బట్టబయలైంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కనుసన్నల్లో సర్వే బృందం పనిచేసినట్లు తెలుస్తోంది. చౌదరికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఎస్ఆర్ నాగభూషణానికి చెందిన ‘వైభవ్’ లాడ్జి కేంద్రంగా ఈ వ్యవహారం సాగింది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో సర్వే బృందాన్ని లాడ్జీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండగా.. ‘సాక్షి’ ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో గుట్టు రట్టయింది. టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థలో పనిచేస్తున్న విజయవాడ యువకులు సర్వే కోసం అనంతపురంలో తిష్టవేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అడ్డడారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ బలహీనపడిన నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ నేతలు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, తద్వారా వీలైనన్ని ఓట్లు తొలగిస్తే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందచ్చనే కుటిల ఆలోచనకు తెర తీశారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించారు. మొదట సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి ఓటరు కార్డులను సేకరించారు. వీటి ఫొటోలను ట్యాబ్‌లు, సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఓటరు కార్డు అనేది ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపుకార్డు. ఈ సమాచారాన్ని వ్యక్తి అనుమతి లేకుండా రాజకీయ అవసరాలకు వాడుకోకూడదు. అయితే ఓటరు కార్డు ఫొటోలు సేకరించిన సర్వే బృందం ఈ వివరాలన్నీ టీడీపీకి చెందిన వెబ్సైట్లోకి చేరవేశారు. ఓటర్ ఐడీ కార్డులో ఏ ఫొటో ఉందో, అదే ఫొటోను కాపీ చేసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులో ముద్రించారు. అంటే ఓటర్ ఐడీలోని సమాచారం టీడీపీ నేతలు పూర్తిగా సేకరించారనేందుకు ఇంతకంటే సాక్ష్యాం మరొకటి ఉండదు. దీన్నిబట్టి ఓటరు కార్డుదారుల ప్రమేయం లేకుండానే వారి పేరుతో టీడీపీ గుర్తింపు కార్డులు జారీ అయ్యాయనేది స్పష్టమవుతోంది. ఇది టీడీపీ చేసిన మొదటి తప్పు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు, ఓటరు ఐడీ కార్డులో ఒకే ఫొటో ఉన్న దృశ్యం ఓటర్ ఐడీ సమాచారంతోనే ఫారం–7 దరఖాస్తుల అప్లోడ్ టీడీపీ గుర్తింపుకార్డులోని ఫొటో, ఓటర్ ఐడీ ఫొటో చూస్తే టీడీపీ సభ్యత్వకార్డులు ఉన్న వారి సమాచారంతో పాటు, సభ్యత్వ కార్డులు లేని ఓటర్ల సమాచారం కూడా సేకరించారని అర్థమవుతోంది. ఈ సమాచారం ఆధారంగా వైఎస్సార్సీపీ నేతల ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎవరి ఓటు వారే తొలగించుకునేలా, భార్య ఓటు భర్త, వైఎస్సార్సీపీ కార్యకర్త ఓటు ఆ పార్టీ నాయకుడు తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. చివరకు అనంతపురంలోని 84వ పోలింగ్ బూత్ పరిధిలోని బీఎల్ఓ లక్ష్మి ఓటును కూడా తొలగించాలని దరఖాస్తు చేశారంటే ఈ దరఖాస్తుల్లోని డొల్లతనం తేటతెల్లమవుతోంది. అనంతపురంతో పాటు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే తరహాలో తప్పుడు సమాచారంతో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించడమే లక్ష్యంగా దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన సర్వే బృందాలను వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులు తిరిగి వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. అయితే సర్వే బృందాలతో తమకేమీ సంబంధం లేదని ఇన్నాళ్లూ టీడీపీ నేతలు బుకాయించారు. తాజా ఉదంతంతో ‘సర్వే బృందాలు’ టీడీపీ కనుసన్నల్లో పనిచేశాయనే విషయం స్పష్టమైంది. ‘వైభవ్’ లాడ్జీలో 20 రోజులుగా తిష్ట అనంతపురంలో సర్వే చేసేందుకు విజయవాడ నుంచి 15 మంది యువకులను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి రప్పించినట్లు తెలుస్తోంది. వీరిని తనకు సన్నిహితుడైన ఎస్ఆర్ నాగభూషణానికి చెందిన బళ్లారిరోడ్లోని ‘వైభవ్’ లాడ్జీలో ఉంచారు. 206, 208తో పాటు మరో నాలుగు గదుల్లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నగరంలో సర్వే చేసి వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు ఇదివరకే ఉన్న ఓటర్ ఐడీ కార్డు సమాచారం ద్వారా ‘ఫారం–7’ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే బృందానికి చంద్రబాబు నాయుడు(సీఎం కాదు) అనే వ్యక్తి నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, రాష్ట్రవ్యాప్తంగా సర్వేకు సంబంధించి దుమారం రేగడం, తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేయడంతో సర్వే బృందాలను విజయవాడకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసి ‘సాక్షి’ బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జీకి వెళ్లింది. 206 గదిలోకి వెళితే ఇద్దరు యువకులు ఉన్నారు. వీరి పేర్లను ఆరా తీస్తే చెప్పలేదు. అయితే తమది విజయవాడ అని, జయభేరి కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పారు. 10 రోజులుగా ఇక్కడే ఉంటున్నామన్నారు. ‘జయభేరి’ అనేది ఎంపీ మురళీ మోహన్‌కు సంబంధించిన కంపెనీ. లగేజీ సర్దుకుని తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. 208 గది వద్దకు వెళితే లాక్ చేశారు. వీరు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. -
బరితెగింపు.. బుకాయింపు..
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది బూత్ కన్వీనర్లు, గ్రామస్థాయి నేతలపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దార్ టీబీ శ్రీనివాస్ ఓ ఫిర్యాదు చేశారు... దీంతో వారందర్నీ మంగళవారం సాయంత్రంలోగా పోలీసు స్టేషన్లో హాజరుకావాలంటూ పోలీసులు కబురు పంపారు... ఇంతకీ వారు చెప్పిందేమిటి?... ఓటర్ల జాబితాల్లో చోటుచేసుకున్న డబుల్ ఎంట్రీలపై దృష్టి పెట్టి సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని! కానీ పోలీసులు ఏమి చేస్తున్నారు?... ఓట్లను తొలగించడానికి దరఖాస్తులు చేశారు కాబట్టి కేసులు పెడుతున్నామని చెబుతున్నారు! ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలం .. ఆదివారం వైఎస్సార్సీపీకి చెందిన 51 మంది బూత్ కన్వీనర్లు, నాయకులపై.. మంగళవారం మరో 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ఫారం–7తో తాము దరఖాస్తు చేయలేదని వారు చెబుతున్నా తహసీల్దార్ రఫీజాన్ ఫిర్యాదుతో ఈ యాక్షన్ చేస్తున్నారు. అసలు అక్రమంగా దరఖాస్తు చేసినవారెవ్వరో తెలియాలంటే వీరిపై కేసులు తప్పవని చెబుతున్నారు. కానీ వాస్తవమేమిటో తేటతెల్లం చేసే దిశగా దర్యాప్తు ఇప్పటివరకూ చేపట్టలేదని వైఎస్సార్పీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆదేశంతోనే పోలీసులు ఓవరేక్షన్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్ల తొలగింపునకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న టీడీపీ.. ఇప్పుడు పోలీసుల ద్వారా బుకాయింపునకు దిగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై రెండు మండలాల్లోనే కాదు జిల్లావ్యాప్తంగా ఈ తరహా రివర్స్ కేసులే నమోదవుతున్నాయి. ఫారం–7 దరఖాస్తులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారని నిందితులు ప్రశ్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. గత ఏడాది కాలంలో ఓటర్ల జాబితాల్లో నమోదవుతున్న డబుల్ ఎంట్రీలను తొలగించాలని, చనిపోయినవారి పేర్లను తీసేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరుతూ వచ్చాయి. అందుకు భిన్నంగా జిల్లాలో గత ఏడాది ఆగస్టు నాటికి కొత్తగా 16,818 ఓట్లు చేరితే, అంతకన్నా రెట్టింపు సంఖ్యలో 33,957 ఓట్లను తొలగించారు. దీంతో గత మార్చి నెలలో 20.12 లక్షల వరకూ ఉన్న ఓటర్ల సంఖ్య ఆర్నెల్లలో 19.95 లక్షలకు తగ్గిపోయింది. ఇలా తొలగించిన ఓట్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులవే ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. సాధారణ ఎన్నికల వరకూ ఓట్ల నమోదు ప్రక్రియ ఉంటుందని, అక్రమాలు జరిగితే సరిదిద్దుతామని అటు నుంచి హామీ వచ్చింది. సర్వే బృందాల హల్చల్ ప్రభుత్వ వ్యతిరేకులు, వైఎస్సార్సీపీ మద్దతుదారులను గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశంతో ‘సర్వే’ ముసుగులో ఇటీవల వరకూ ప్రతి మండలంలోనూ బృందాలు దిగాయి. టీడీపీ ప్రోత్సాహంతో ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఆధార్ నంబరు సహా వారి వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయడంపై గగ్గోలు రేగిన సంగతి తెలి సిందే. ఇంతలోనే ఫారం–7 దుర్వినియోగం గురిం చి వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. తహసీల్దార్ల ఫిర్యాదులే ఆధారంగా... ఆన్లైన్లో దాఖలైన ఫారం–7పై దరఖాస్తుదారుడిగా ఉన్న వారెవ్వరో గుర్తించి, అసలు దాఖలు చేసింది వారేనా? లేదా వారి పేర్లతో వేరెవ్వరైనా దాఖలు చేశారా? అని పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఐపీ ఆధారంగా ఎక్కడి నుంచి ఈ దరఖాస్తులు వచ్చాయో పరిశీలించాల్సి ఉంది. కానీ ఫారం–7 దరఖాస్తులపై పేరున్న లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా పోలీసుల చర్యలు ఉంటున్నాయి. ఇందుకు తహసీల్దార్లు ఇస్తున్న ఫిర్యాదులను ఆధారంగా చేసుకుంటున్నారు. ఈ తరహా చర్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ ఆ పార్టీ బూత్ కమిటీ సభ్యుల పేర్లతోనే అక్రమంగా దాఖలైన ఫారం–7 ఇప్పుడు పోలీసులకు ఆయాచిత వరమైంది. ఆన్లైన్లో అక్రమంగా దరఖాస్తు పెట్టిన అక్రమార్కులను వదిలేసి, ఆ పేరున్న ప్రత్యర్థి పార్టీ శ్రేణులపై ఓవరేక్షన్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి! ఈ తరహా పక్షపాత వైఖరిని సహించబోమని, తప్పకుండా వ్యతిరేకిస్తామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఆరోపిస్తే కేసులే.... ♦ పలాస నియోజకవర్గంలోని మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలతోపాటు పలాస మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 38 మంది వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫారం–7 ద్వారా ఓట్లు తొలగించాలని దొంగ దరఖాస్తు చేశారనే నెపంతో ఈ కేసులు నమోదు చేశారు. ఇందులో పలాసలో 12 మంది, మందసలో 14 మంది, వజ్రపు కొత్తూరులో 12మంది ఉన్నారు. ♦ ∙శ్రీకాకుళం రూరల్ మండలంలో 907 మందిపై కేసులు నమోదయ్యాయి. గార మండలంలో ఒకరిపై బైండోవర్ కేసు నమోదైంది. ♦ పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో మొత్తం 30 మంది, పాలకొండలో 38 మంది వైఎస్సార్సీపీ నాయకులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. ♦ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 115 పంచాయతీల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3,680 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ♦ నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 950 మంది నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ♦ రాజాం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి ఇప్పటివరకు 720 మందిపై, పాతపట్నం నియోజకవర్గంలో 45 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. -
కేసుల పోటు.. ఓట్లపైనా వేటు
మొగుడ్ని కొట్టి.. మొగశాలకెక్కిన చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది.పౌరుల డేటా చోరీకి పాల్పడి గంపగుత్తగా ఆన్లైన్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు ఆ పార్టీ నేతల పేర్లతోనే దరఖాస్తులు నమోదు చేయడానికి తెగించిన టీడీపీ నేతలు.. ఆ వ్యవహారం కాస్త రచ్చ రచ్చ అయ్యి.. తమ బండారం బయటపడటంతో మరింత దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారు. తమ ఓట్లనే తొలగిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసులు పెడుతున్నారు.అధికార పార్టీకి వీరభక్తులుగా మారిపోయిన పోలీసులు.. ఫిర్యాదు అందడమే ఆలస్యం ఎన్నడూ లేనంత వేగంగా స్పందిస్తున్నారు. తమకు అందిన ఫిర్యాదుల్లో వాస్తవమెంతో కనీసం ప్రాథమికంగానైనా నిర్ధారించుకోకుండానే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా కేసులు బనాయించేస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీ వారి ఓట్లు తొలగిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులపై మాత్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. కేసుల సంగతి ఇలా ఉంటే.. ఓట్ల తొలగింపుపై గత కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అబ్బే.. ఫారం–7 దరఖాస్తులు వచ్చినంత మాత్రాన.. తమ ప్రమేయం, పరిశీలన లేకుండా ఎటువంటి తొలగింపులు ఉండవని గంభీరమైన ప్రకటనలు చేసిన అధికారులు.. ఆచరణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గత 20 రోజుల్లో అందిన 75,747 ఫారం–7 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపామంటూ మూడోవంతు... అంటే 25,635 ఓట్లపై వేటు వేసేశారు. మరో 14,830 తొలగింపు దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయని అంటున్నారు. అంటే రేపో మాపో అవి కూడా పోయే ప్రమాదముందన్న మాట. ఈ పరిణామాలతో ఆందోళనకు గురవుతున్న వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతల చేతుల్లో అధికారులు సైతం తోలుబొమ్మల్లా మారినట్టు కన్పిస్తోంది. వారి ఆడిందే ఆట.. పాడిందే పాటగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదులివ్వడమే తరువాయి క్షణాల్లో యాక్షన్‌లోకి దిగి పోతున్నారు. ఎన్నికల ముంగిట అధికార పార్టీ నేతలు ఆడుతున్న ఓట్ల దొంగాటలో అధికారులు పావులుగా మారుతున్నారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు ఒడిగడు తున్నారు. దొంగ ఓట్లు నమోదవుతున్నాయ్.ఉన్న ఓట్లుతొలగించేస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళన చేస్తున్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ నుంచి మండల తహసీల్దార్ వరకు ఫిర్యాదులు చేశారు. వాటి జోలికి పోనీ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో వారిచ్చిన ఫిర్యాదులపై ఆఘమేఘాల మీద చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యులు, శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఆరిలోవ, కంచరపాలెం, నర్సీపట్నం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో 27 మంది, ఆరిలోవ పోలీస్ స్టేషన్లో 53 మంది, నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో 24 మందిపైన కేసులు నమోదు చేశారు. ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరిలోవ పోలీస్‌స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. మిగిలిన పోలీస్స్టేషన్లలో టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కేసులు నమోదు చేస్తున్నట్టు తెలు స్తోంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపైనే అధికారులు దృష్టి కేంద్రీకరించడం విమర్శలకు తావిస్తోంది. మరో వైపు వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన పేరుతో ఓట్ల తొలగింపులకు అధికారులు శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల ముంగిట కేవలం 20 రోజుల వ్యవధిలోనే 75,747 దరఖాస్తులందాయి. పైకి ఒక్క ఓటు కూడా తొలగించలేదంటూనే ఇప్పటి వరకు క్షేత్రస్థాయి పరిశీలన పేరిట 25,635 ఓట్లను అధికారికంగా తొలగించారు. మరో 14,830 ఓట్ల తొలగింపులకు చెందిన క్లైమ్లు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఓట్లతొలగింపు దరఖాస్తులకు దీటుగానే కొత్త ఓట్ల నమోదు కోసం కూడా దరఖాస్తులు వెల్లువెత్తాయి. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 2,22,557 దరఖాస్తులందాయి. వీటిలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1,65,705 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించారు. మరో 36,357 మందికి ఓటు హక్కుకల్పించేందుకు అర్హులుగా నిర్ధారించినప్పటికీ ఆ క్లైమ్లు సంబంధిత ఆర్వోల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన వాటికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలా.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి విశాఖ జిల్లాలో 34,21,822 మంది ఓటర్లుండేవారు.–అలాంటిది 2019 జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని ఓటర్ల సంఖ్య 32,80,028లకు చేరింది. –2014–18 మధ్యలో ఏకంగా 2,72,480 ఓట్లు తొలగించారు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 జనవరి మధ్యలో ఏకంగా 1,64, 579 ఓట్లు కొత్తగా చేర్చగా, కేవలం 43,893 ఓట్లను మాత్రమే తొలగించారు. కాగా రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ గడువు వరకు చేర్పులు, మార్పులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండడంతో దరఖాస్తుల వెల్లువ కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదు, ఉన్న ఓట్ల తొలగింపులు పెద్ద ఎత్తున జరిగే ఆస్కారం కన్పిస్తోంది. ఇప్పటికే నగరంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు చెందిన వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పెద్ద ఎత్తున కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తులు చేయించినట్టుగా తెలుస్తోంది. గీతం యూనివర్సిటీ, నారాయణ, శ్రీచైతన్య, ఆళ్వార్‌దాస్ తదితర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఎత్తున ఓటు హక్కు కల్పిస్తున్నారు. వీరికి తమ స్వస్థలాలతో పాటు ఇక్కడ కూడా ఓటు హక్కు కల్పించడం ద్వారా రేపటి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వీటిని అడ్డుకోవల్సిన అధికారులు అధికార పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. -
అడ్డదార్లు తొక్కుతున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, కంచిలి/ ఇచ్ఛాపురం రూరల్/ కవిటి/ ఇచ్ఛాపురం/ సోంపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న జనాదరణ చూసి తట్టుకోలేని టీడీపీ నాయకులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. టీడీపీ కంచుకోటైన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఓడిపోతామనే భయంతో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆన్లైన్ ఫారం–7తో ఓట్ల తొలగింపుకు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకుల పేర్లతో దరఖాస్తులు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆన్లైన్లో ఫారం–7 ద్వారా ఓట్లు తొలగించాలని సుమారు 8740 దరఖాస్తులు వచ్చాయని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ తెలిపారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను ఆ పార్టీ నేతలే తొలగించాలని కోరుతున్నట్టు పెద్ద ఎత్తున ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తు చేయడం జరిగింది. దీంతో గ్రామస్థాయిలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య పొరపచ్చాలు వచ్చి తగవులు పడేవిధంగా కుట్రలు పన్నేందుకు ఇటువంటి పన్నాగం పన్నినట్టు భావిస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకర్గం పరిధిలో మొత్తంగా నాలుగు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించాల్సిందిగా ఆన్లైన్లో దరఖాస్తులు రావడంతో ఎన్నికల అధికారులు విస్మయం చెందారు. దొంగ అడ్రస్‌లతో ఒకరి బదులు వేరొకరి ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతో అధికారులు ఆయా దరఖాస్తుదారులను విచారించడానికి పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా కంచిలి తహసీల్దార్ బి.టి.శ్రీనివాస్‌ను స్థానిక ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డి.ధర్మారావు, రుషి, దీనబందు, జోగారావులు శనివారం కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తమ ప్రమేయం లేకుండా తమ పేర్లు పెట్టి ఓట్లు తొలగించాల్సిందిగా ఆన్లైన్లో దరఖాస్తు చేశారని, అటువంటి దొంగపని చేసిన వారిని కనిపెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో అ«ధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ఆయా దరఖాస్తులను ఫ్రోసెస్ చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఈ విధమైన కుట్రలకు పాల్పడడంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, న్యూట్రల్ ఓటర్లు ఇటువంటి చర్యలకు పాల్పడినవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు టీడీపీ వారు ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపునకు పూనుకున్నారు. మండపలి పంచాయతీలో ఓట్లు తొలగించాలంటూ నాపేరుపై దరఖాస్తులు ఆన్లైన్లో ఉండడంతో ఆశ్చర్యపోయాను. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలి. వైఎస్సార్ ఓటర్లను తొలగించేందుకు అధికార పార్టీ పెద్ద కుట్ర చేస్తోంది. పిట్ట మామయ్య, వైఎస్సార్సీపీ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం వెంటనే చర్యలు తీసుకోవాలి పల్స్ సర్వే సమయంలో సేకరించిన బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్ల తొలగింపు ప్రధాన లక్ష్యంగా ఈ డేటాను వాడుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీడీపీ ఉలిక్కిపడుతోంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. కారంగి మోహనరావు, మాజీ ఎంపీపీ, ఇచ్ఛాపురం అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆన్లైన్ ఫారం–7 లో 8,740 ఓట్లు తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయి. వీటిని స్థానిక బూత్ లెవల్ అధికారుల(బీఎల్వో)చే ధర్యాప్తు, తనిఖీ చేయిస్తున్నాం. అక్రమాలకు పాల్పడినవారిపై తగిన చర్యలు తీసుకుంటాం. -
నకిలీ అర్జీలపై సీరియస్
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటరుకు తెలియకుండా వారి ఓటు తొలగించాలని ఆ వ్యక్తి పేరుతో ఆన్లైన్లో ఫారం–7 ద్వారా నమోదు చేసిన వ్యక్తులపై ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చాంబర్లో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట, పెనమలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, మైలవరం, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించాలని చీటింగ్దారులు కొంత మంది సుమారు 30 వేల వరకు ఆన్లైన్లో నమోదు చేశారన్నారు. ఇవి గత నెల 26, 27 తేదీల్లో ఎక్కువగా నమోదయ్యాయని తాము గుర్తించామన్నారు. అనంతరం మార్చి 1వ తేదీన తాను జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌బూత్‌లలో పరిశీలించి ఈ విధంగా ఓట్లు తొలగింపు దరఖాస్తులు చేసుకునే వాటిని పరిశీలించామన్నారు. పరిశీలన అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లకు ఆన్లైన్లో పొందుపరిచిన దరఖాస్తులు, ఎవరి పేరుతో నమోదై ఉన్నాయో వారి వివరాలను ఆయా గ్రామాలకు వెళ్లి తనిఖీ చేసి వారిని ప్రశ్నించామన్నారు. ఓటరుకు తెలిసే దరఖాస్తు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఓట్లను తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తు చేశార అన్న వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఇలా నమోదైన వాటిలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు సంబంధించి ఆయా పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశామన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల, అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో ఇటువంటి దరఖాస్తులు కావటంతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో వీటిపై కేసులు నమోదయ్యాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని చిలకలపూడి, తాలుకా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. మైలవరం నియోజకవర్గంలో మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో పడమట పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్, ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేయటం, తదితర సెక్షన్లతో ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదైన దరఖాస్తులకు సంబంధించి 15 కేసులు నమోదు చేశామన్నారు. వీటిని పూర్తిస్థాయిలో పోలీస్ అధికారులు విచారణ చేపట్టి వ్యక్తులను గుర్తించటం, ఎన్ని ఓట్లు తొలగించేందుకు దరఖాస్తు చేశారో కూడా పరిశీలించిన అనంతరం అవసరమైతే ఆ వ్యక్తిని జిల్లా బహిష్కరణ చేసేందుకూ వెనుకాడబోమన్నారు. -
ఓటుపై వేటు
సాక్షి, కనిగిరి: ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు కుతంత్రాలకు తెరలేపారు. ప్రత్యేక సర్వేలు, ప్రభుత్వ సర్వేలు పేరుతో వైఎస్సార్ సీపీ అభిమానుల ఓట్లను తొలగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కనిగిరి పట్టణంతో పాటు, పామూరు పట్టణంలో సర్వే బృందాల పేరుతో ప్రభుత్వ సర్వే అంటూ హడావిడి చేశారు. ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో కొంత కాలం సద్దుమణిగిన కుట్రదారులు మరలా రెండ్రోజుల క్రితం మండలంలోని బల్లిపల్లి, అడ్డరోడ్డు, కాశీపురం గ్రామాల్లో ప్రభుత్వ సర్వేల పేరుతో గ్రామాల్లో తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చామని ప్రభుత్వ పథకాల వివరాలకు అడిగిన తర్వాత వివరాలు చెప్పే వ్యక్తి ఏ పార్టీకి అనుకూలం అనే అంశాలను పొందుపర్చడం. ఫోన్ నెంబర్లు సేకరించడం వంటి చర్యలకు పాల్పడటంతో ప్రజలు తిరగబడ్డారు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడినుంచి పరారైయ్యారు. 71 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు.. ఓటర్ల జాబితాలో సవరణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కనిగిరి, పామూరు మండలాల్లో కొందరు ఓటర్ల తొలగింపుకు దరఖాస్తు పెట్టినట్లు సమాచారం. కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో 71 ఓట్లకు, పామూరు మండలం చిలంకూరు 13 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు వచ్చాయి. పేరంగుడిపల్లిలో ఒకే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫారం 7 పూర్తి చేసి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మొత్తం 71 ఓట్లను వారి ఓట్లు వారే తొలగించాలని దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొనడంతో అవాక్కైన అధికారులు విచారణ చేపట్టారు. అసలు ఓటరుకు తెలియకుండానే ఓట్లు తొలగించినట్లు దరఖాస్తులు వచ్చినట్లు తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు రకాల కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తహశీల్దార్ కే. రాజ్‌కుమార్ తెలిపారు. -
డేటా దోపిడీ.. జర భద్రం!
సాక్షి, చీరాల : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ దర్శకత్వంలో నూతన దోపిడీకి తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లే వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు ఓ కొత్త నాటకానికి తెరదీశారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీ ఓట్లు తొలగించాలని ప్రయత్నించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగించాలని అదే పార్టీ నాయకులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం ఏంటి? ఫారం–7 పేరుతో నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల, వేటపాలెం మండలాల్లో 11 వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ఆన్లైన్లో రెవెన్యూ అధికారులకు చేరాయంటే ఏ స్థాయిలో అధికారపార్టీ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకెళితే.... చీరాల, వేటపాలెం మండలాల్లో 1,73,291 మంది ఓటర్లు ఉండగా మొత్తం 218 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. చీరాల మున్సిపాలిటీలో 60,078 ఓటర్లు ఉ ఉండగా వీరిలో పురుషులు 29,179, స్త్రీలు 30599 ఉన్నారు. చీరాల మండలంలోని 15 గ్రామాల్లోని 60,333 ఓటర్లు ఉండగా పురుషులు 29,827, స్త్రీలు 30,504 ఉన్నారు. వేటపాలెం మండలంలోని 9 గ్రామ పంచాయితీల్లో 52,872 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 26,020, స్త్రీలు 26,852 ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఓట్ల గల్లంతు.. వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగించాలని కోరుతూ బూత్ కన్వీనర్లే ఫిర్యాదు చేశారంటూ ఆన్లైన్లో వైసీపీ ఓట్లు తొలగింపుకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఒక్కో బూత్ కన్వీనర్ ద్వారా 50 నుంచి 100 మంది వైసీపీ ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పడం విశేషం. వీటిలో చీరాల మండలంలో 5965, మున్సిపాలిటీలో 3700, వేటపాలెం మండలంలో 2875 ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయించారు. భవిష్యత్తుకు భద్రత ఉందా..? ప్రజాసాధికార సర్వేతో పాటుగా ఆధార్ అనుసంధానంతో ప్రజల బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు పొందిన వివరాలు, పొలం, కులం, ఏపార్టీకి సానుభూతిపరులు వంటి పూర్తి వివరాలు డేటా బేస్‌లో లభ్యం అవుతున్నాయి. అత్యంత నిక్షిప్తంగా ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన సమాచారం హైద్రాబాద్, విశాఖపట్నంలో టీడీపీ నాయకులకు చెందిన ఐటీ కంపెనీలకు ఓటర్లు, ప్రజల సమాచారం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు సైతం వేరే ఖాతాలకు వెళ్లే సైబర్ మోసాలు జరగనున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చక్రం తిప్పుతున్న టీడీపీ ఎమ్మెల్సీ, నేతలు.. చీరాల్లో గత నాలుగు దఫాలుగా ఓటమి చెందిన టీడీపీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో అక్రమ మార్గాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లును ఓటరు జాబితాలనుంచి తొలగిస్తే తమకు అడ్డు ఉండదని, టీడీపీ అధినేత, అతని కుమారుడు మంత్రి అండగా ఉండాడనే గర్వంతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు తెరవెనక ఉండటం, మీసేవా కేంద్రాల నిర్వహకులు, మండల, నియోజకవర్గ అధికారులతో కలిసి చేశారని పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 50 నుంచి 100 వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపులు చేసేలా ఆన్లైన్ దరఖాస్తులు చేయించారంటే టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డు అదుపులేదా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. సైబర్ క్రైం కింద పోలీస్ కేసులు నమోదు.. నియోజకవర్గంలో 11వేల వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపుకు ఆన్లైన్లో ఫిర్యాదులు రావడంతో విస్తుపోయిన అధికారులు చీరాల ఒన్‌టౌన్, వేటపాలెం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అలానే ఫిర్యాదు దారుడికి, ఫిర్యాదులో పేర్కొన్న ఓటర్లుకు నోటీసులు అందించి వివరాలు, రికార్డులు చేయిస్తున్నారు. చీరాల్లో జరగుతున్న ఆన్లైన్ ఓటరు అక్రమాలపై పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం క్రింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర.. నేను వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్‌గా ఉన్నాను. నా పేరుతో మా ఊరిలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించాలని ఫారం–7క్రింద 70 అర్జీలు పెట్టారు. తాను ఎవ్వరి ఓటు తీసేయమని అర్జీలు దాఖలు చేయలేదు. ఓట్లు తొలగించాలని మేం ఎందుకు అర్జీలు దాఖలు చేస్తాం. ఇదంతా టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర. నిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. –బి. చిట్టిబాబు వక్రమార్గాలు టీడీపీకి పెట్టిన విద్య.. అధికారం కోసం అక్రమార్గాలకు పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనం. తమ వారి ఓట్లు 37 తొలగించాలని మేమే అర్జీలు పెట్టామని నోటీసులు అందించడం దారుణం. తమ వారి ఓట్లు తొలగించడంతో పాటుగా డేటా అంతా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం రాజ్యాంగాన్ని అపహాసనం చేసినట్లే. నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలి. –జి.వెంకటేశ్వర్లు. ముందే గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా.. ఐటీ గ్రిడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు టార్గెట్ చేసి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఫారం–7 ద్వారా వైఎస్సార్ సీపీ సానుభూతి ఓటర్లే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారని దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో ప్రజలకు అర్థం అవుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టి కొద్దిరోజుల క్రితమే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశా. చివరకు నా సొంత మేనల్లుడు, కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించేదుకు కుట్ర చేయడం దారుణం. –ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల -
ఓట్ల తొలగింపు కుట్రపై ఆందోళన
సాక్షి, భీమవరం: రానున్న ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందేందుకు ఓట్ల తొలగించేందుకు ఆ పార్టీ నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం నుంచి కాలినడకన తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఎన్నికల డెప్యూటీ తహసీల్దార్ సీతారత్నం, డీటీ వి.బాబాజీకి ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, కోడే యుగంధర్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, కొరశిఖ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో టీడీపీ అడ్డదారిలో విజయం సాధించడానికి పార్టీకి అనుకూలమైన వారికి రెండు, మూడు ఓట్లు నమోదు చేయించారన్నారు. ఓటర్ల జాబితాను తమ పార్టీ పూర్తిగా అధ్యయనం చేయగా దాదాపు 7వేలు వరకు డబ్లింగ్, త్రిబ్లింగ్ ఓట్లు ఉన్నాయని వీటిని తొలగించి అర్హులందరికీ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. అయితే వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టారో సమాచారం లేదన్నారు. ఓట్లు తొలగింపు అక్రమాలపై భీమవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ డీటీ సీతారత్నానికి ఫిర్యాదు చేస్తోన్న వైఎస్సార్ సీపీ నాయకులు అక్రమ ఓట్లపై తాము అభ్యంతరం చెప్పడంతో టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేసి తమను అప్రదిష్టపాల్జేసేందుకు అర్హుల ఓట్లను కూడా తొలగించేందుకు తాము దరఖాస్తు చేసినట్టు వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్ల పేరుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. తమకు తెలియకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తొలగింపులకు సంబంధించి తమకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. అలాగే ఓట్ల సర్వేలో బూత్‌లెవిల్ ఆఫీసర్లు కొందరు అధికార టీడీపీ తొత్తులుగా మారి వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. టీడీపీ దొంగ ఓట్లుతో రిగ్గింగ్ చేసి విజయం సాధించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మరొక కుట్రకు పాల్పడ్డారన్నారు. తాము ఇప్పటికే ఆధారాలతో ఫిర్యాదు చేసిన డబ్లింగ్, త్రిబ్లింగ్ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన ఎలక్షన్ డీటీ సీతారత్నం మాట్లాడుతూ ఓట్ల తొలగింపులో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగింపునకు ఫిర్యాదు చేసిందంటూ ప్రచారం చేసే బూత్ లెవిల్ అధికారులపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్లు గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు (తాతా రాజు), భూసారపు సాయి సత్యనారాయణ, పాలవెల్లి మంగ, వైఎస్సార్ సీపీ నాయకులు పేరిచర్ల సత్యనారాయణరాజు, కొప్పరి సత్యనారాయణ, రేవూరి గోగురాజు,విజ్జురోతు రాఘవులు, కోమటి రాంబాబు, బొక్కా గోపి, వసంతరావు, జలాలుద్దీన్‌బాబా, పెనుమాల నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పెదబాబు డైరెక్షన్ ..చినబాబు యాక్షన్
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో కేవలం డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించిన పెదబాబు, చినబాబు ఇప్పుడు ఏకంగా ఓటర్లపైనే గురి పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ గత ఏడాది నవంబర్ నుంచి నిరాటంకంగా కొనసాగతోంది. ఇందుకు మార్గదర్శకత్వం పెదబాబుది కాగా, దాన్ని అమలు చేసే బాధ్యతను చినబాబు తన భుజాలపై వేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 6,000 నుంచి 21,000 ఓట్లను తొలగించడమే ధ్యేయంగా చినబాబు బృందం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లపై వేటు వేసేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎవరి ఓట్లను తొలగించాలో వారి పేర్లతోనే ఆన్లైన్ ద్వారా ఫారం–7 దరఖాస్తులను చినబాబు బృందం సమర్పిస్తోంది. తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటూ నవంబర్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 8,73,500 దరఖాస్తులు ఆన్లైన్లో రావడం గమనార్హం. ఓట్ల తొలగింపును కోరుతూ ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. నివ్వెరపోతున్న ఎన్నికల సంఘం ఒక్కో జిల్లా నుంచి ఆన్లైన్లో వేల సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడం చూసి ఎన్నికల సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించింది. అత్యధికంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఫారం–7 దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా నుంచి 1,13,500, చిత్తూరు జిల్లా నుంచి 1,02,500 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 90 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇవన్నీ కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా సమర్పించినవేనని ఎన్నికల సంఘం గుర్తించినట్లు సమాచారం. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ఆన్లైన్లో వచ్చిన ఫారం–7 దరఖాస్తులపై క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలని, ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు సమర్పించిన వారిని గుర్తించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. -
చనిపోయిన అమ్మ..కొడుకు ఓటు తీయమంది...
విజయనగరం , కురుపాం: తాము దరఖాస్తులు చేయకుండానే తమ పేర్లుతో ఫారం 7 కింద అక్రమంగా నమో దు చేసి కొంతమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని.. అటువంటి అక్రమ నమోదులను అడ్డుకోవాలని కురుపాం మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయిపిల్లి శ్రీధర్, మండల బూత్ కన్వీనర్ జీవీ శ్రీనివాసరావు, మండల వైస్ ఎంపీపీ వంజరాపు కృష్ణతో పాటు కిచ్చాడకు చెందిన గవర చంద్రశేఖర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావును కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన్ని కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ, కొంతమంది కావాలనే తమ పేర్లతో ఇతరుల ఓట్లు తొలించేందుకు ఆన్లైన్లో నమోదు చేశారన్నారు. తమ పేర్లతో ఆన్లైన్లో ఎవరు దరఖాస్తులు చేశారో... అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, కురుపాం నియోజకవర్గంలో 3,349 ఫారం 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులు వచ్చినంత మాత్రా న ఓట్లు తొలగించమని... బూత్ లెవిల్ అధికారులు పరిశీలించిన తర్వాతే తొలగిస్తామని చెప్పా రు. అలాగే ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారన్నదానిపై ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తహసీల్దార్ల ద్వారా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తులు ఏ కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో ఫారం 7కు నమోదు చేశారో తెలుసుకొని వారిపై సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా ..? కురుపాం నియోజకవర్గంలో ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 3349 దరఖాస్తులు ఫారం 7 కింద ఆన్లైన్లో నమోదు కాగా వీటిని వైఎస్సార్సీపీ కార్యకర్తల పేరుతో దరఖాస్తు చేయడం విశేషం. ముఖ్యం గా కురుపాం, మొండెంఖల్, కిచ్చాడ, నీలకంఠాపురం, ధర్మలక్ష్మీపురం, జి. శివడ, తిత్తిరి, గొత్తిలి, గిరిజన గ్రామాలకు చెందిన చాలా మంది ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారు. అయితే వైఎస్సార్సీపీ నాయకుల పేరుతో తొలగింపులకు దరఖాస్తు చేయడంపై ఎవరో కావాలనే చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు ఫారం 7 కింద దరఖాస్తు చేసినంత మాత్రాన ఓట్లు తొలగించే పరిస్థితి లేదు. సంబంధిత ఓటర్ల వద్దకు బీఎల్ఓలు వెళ్లి దర్యాప్తు చేపడతారు. అలాగే ఆన్లైన్లో ఎవరు నమోదు చేశారో వారిపై సైబర్‌క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తాం.– వి.విశ్వేశ్వరరావు,ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,కురుపాం చర్యలు తీసుకోవాలి పోలింగ్‌స్టేషన్ –3 పరిధిలో పది మంది ఓటుహక్కు తొలగించాలని ఎవరో నా పేరుమీద దరఖాస్తు చేశారు. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు తెలియకుండా ఎలా దరఖాస్తు చేశారో అర్థం కావడం లేదు. – రాయిపిల్లి శ్రీధర్ (వైఎస్సార్సీపి ఎస్సీ సెల్ అధ్యక్షులు ,కురుపాం మండలం) చనిపోయిన అమ్మ..కొడుకు ఓటు తీయమంది... ఓటర్ల నమోదు, తొలగింపులకు వస్తున్న దరఖాస్తులు చూస్తుంటే మతిపోతోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లతో కొంతమంది అక్రమార్కులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి ఆన్లైన్లో నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సాలూరు మండలంలోని కురుకుట్టి గ్రామానికి చెందిన చిప్పాడ నాగమ్మ ఈ ఏడాది జనవరిలో చనిపోయింది. అయితే ఆమె కుమారుడు గాంధీ ఓటును తొలగించాలని నాగమ్మే ఈ నెల 23,24 తేదీల్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటరు కార్యక్రమంలో దరఖాస్తు చేసిందట. ఉన్న మనిషి ఓటును లేని మనిషి తొలగించాలని ఎలా దరఖాస్తు చేసిందే అధికారులకే తెలియాలి. – సాలూరు -
ఈవీఎంలు సరే.. ఓట్ల తొలగింపో?
పేపర్ బ్యాలెట్‌కు ఉన్న పారదర్శకత ఈవీఎంలకు లేనందునే, అనుమానం వచ్చి ప్రశ్నించగల అవకాశం ఓటరుకు లేనందునే వాటి పారదర్శకతను పెక్కు దేశాలు ప్రశ్నించి ఆ యంత్రాలను ఎన్నికలలో ఓట్ల నమోదు ప్రక్రియ నుంచి ఉపసంహరించి, రద్దుచేసి రాజకీయ ఓటింగ్‌తో నిమిత్తంలేని చిల్లర పనులకు వాడుతుండవచ్చు. కానీ, ఈవీఎంల రహస్యపాత్రకు తానేమీ తీసిపోలేదన్నట్లుగా దొంగ సర్వేల ద్వారా ప్రత్యర్థి పార్టీల తాలూకు ఓటర్లను లక్షల సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి తొలగించే ‘యజ్ఞం’లో టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు. ఇది ఈవీఎంల ట్యాంపరింగ్‌కు మించిన పెనుప్రమాదం అని గుర్తించకపోతే ప్రజల ఓటుహక్కుకే భంగకరం. బ్యాలెట్ పత్రాలు ఆధారంగా ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలా లేక ఆధునికమైన ‘ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల’ ద్వారా నిర్వహించాలా అన్న సమస్య మరోసారి విస్తృత స్థాయిలో దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ మీమాంస – విత్తుముందా చెట్టు ముందా అన్న ప్రశ్నలా తయారైంది. ఈ విషయమై ఇప్పటికే పలు స్థాయిల్లో శషభిషలు నడుస్తున్నాయి. పైగా మరిన్ని కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. బహుశా ఇందుకు మొదటి కారణం అమెరికాలో ఉంటున్న సయ్యద్ సూజీ అనే భారతీయ హ్యాకర్, 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను రహస్యంగా శోధించి (హ్యాకింగ్) ఓట్ల జాబితా తారుమారు చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని చేసిన ఆరోపణ. పైగా ఈ హ్యాకింగ్ ప్రక్రియతో ఒక్క బీజేపీకే కాకుండా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు కూడా ప్రమేయముందని ఆ హ్యాకర్ ప్రకటించారు. ఈ ఆరోపణను భారత ఎన్నికల సంఘం ఖండిస్తూ, లండన్ పత్రికా గోష్టిలో సూజీ చేసిన ఆరోపణలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విషయమై పరిశీలిస్తున్నామని ప్రకటించింది (21–01–2019) అయినా మనదేశంలో వివిధ రాజకీయ పక్షాల మధ్య ఈవీఎంలకు, బ్యాలెట్ పత్రాలనే తిరిగి ప్రవేశపెట్టేందుకు అనుకూల, ప్రతికూల వాదోపవాదాలు చర్చలు బహుముఖంగా సాగుతూనే ఉన్నాయి గానీ, ఈవీఎంల గురించిన అనుమానాలు మాత్రం ఇంకా సమసిపోలేదు. ఇందుకు ఉదాహరణగా పెక్కుమంది మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాస్త్ర నిపుణులు సలహాదార్లుగా ప్రారంభమై వర్ధిల్లుతున్న ప్రసిద్ధ పక్ష పత్రిక ‘లా ఏనిమేటెడ్ వరల్డ్’ ఈవీఎం, బ్యాలెట్ పత్రాల వాడకానికి సంబంధించిన వాదప్రతివాదాలన్ని ప్రస్తావిస్తూ 2018 డిసెంబర్ 18 సంచికలోనే ఒక సంపాదకీయం రాసింది. అందులో పేర్కొన్న విషయాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి: సుమారు ఇప్పటికి పదేళ్లో అంతకుపైబడి మన దేశ ఎన్నికల ప్రక్రియ నుంచి బ్యాలెట్ పత్రం కాస్తా కనుమరుగైపోయింది. చిత్రమేమంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు తమ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రాకముందు ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి చిక్కుల్లో పడనుందో వివరిస్తూ ఒక పుస్తకమే రాశారు. దానిపేరు ‘డెమోక్రసీ ఎట్ రిస్క్’! ఆ పుస్తకానికి ముందు మాట రాసిన వారు బీజేపీ అగ్రనేత అడ్వాణీ. ఆయన ఈవీఎం యంత్రాలను ఇండియాలో వాటి ప్రవేశాన్ని నిరసిస్తూ ఆ ముందుమాటలో రాశారు. కానీ అలాంటి బీజేపీ వారే అధికారం చేపట్టిన తర్వాత తమ వైఖరి మార్చేసుకున్నారు. అలాగే నిన్న మొన్నటిదాకా ఈవీఎంలను ఆడిపోసుకున్న కాంగ్రెస్ అకస్మాత్తుగా ఇటీవల మూడు రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా సానుకూల ఫలితాలను పొందిన తర్వాత అవే యంత్రాలను సమర్థించడం మొదలెట్టింది. కానీ ఈవీఎంల తంతును, ఓటరు తన ఓటు అసలు నమోదైందా లేదా తెలుసుకునే.. లేక అసలు దాని ఆచూకీని తెలుసుకోవడానికి వీలు కల్పిం చేందుకు ఈవీఎంల సరసనే ఏర్పాటు చేసిన వీవీప్యాట్లనుంచి వెలువడే రసీదులను తనిఖీ చేసుకునే అవకాశం గురించి కూడా ఇటీవల కొన్ని ఎన్నికల ఫలితాల సందర్భంగా వివాదాలు తలెత్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపకులపై లీగల్ చర్యలు తీసుకుంటామని ఎంతగా హెచ్చరించినా, జరిగే పరిణామాలను ఆపగల పరిస్థితి మాత్రం లేదు. ఇందుకు తాజా ఉదాహరణే– తెలంగాణలో ఇటీవలనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలలో పోటీ చేసిన ఇరువురు కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఫలితాలపైన హైకోర్టుకు ఫిర్యాదు చేయవలసి రావటం. ఇందుకు కారణం ఈవీఎం మెషీన్లు, వాటికి అనుబంధంగా ఉన్న ‘వీవీప్యాట్స్’ను భద్రపరిచిన ‘నిషిద్ధ గదుల’ను (స్ట్రాంగ్ రూమ్స్) అభ్యర్థుల అభ్యంతరాలపై హైకోర్టు పరిశీలన పూర్తి కాకుండానే వికారాబాద్ కలెక్టర్ ఈవీఎంలకు చెందిన మూడు కంట్రోల్ యూనిట్లను, వాటికి అనుబంధంగా అమర్చిన వీవీపాట్స్నీ తెరచిచూసి, అందలి సమాచారాన్ని వెల్లడించబోవటం. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ‘వీవీప్యాట్స్’ సీళ్లు బద్ధలుకొట్టి ఉండటమూ, ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌పైన ఫిర్యాదు నమోదు కావటమూ, వికారాబాద్ కలెక్టర్‌ను ఎలెక్షన్ కమిషన్ సస్పెండ్ చేయటమూ జరిగింది. ఒకసారి అభ్యర్థి తన ఫలితంపైన అనుమానంతో కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, దాన్ని కోర్టు అందుకున్న తరువాత, దానిపై తుది తీర్పు వెలువడేదాకా స్ట్రాంగ్ రూమ్స్ తాళాలు తీయరాదన్నది ఆనవాయితీ. ఇంతకుముందు ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎం వీవీపాట్స్కు సంబంధించిన అవకతవకలు జరిగినప్పుడు అప్పటి ప్రధాన ఎన్నికల అధికారి ‘వీవీప్యాట్స్‌ను నిర్వహించగల సిబ్బంది శిక్షణగలవారు కారన్న’ సాకుతో అభ్యర్థుల ఫిర్యాదులను తోసిపుచ్చారని మరవరాదు. పలు సందర్భాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీప్యాట్స్ నుంచి వెలువడే కాగితం ‘చీటీ’లకు సంబంధం లేకుండా పోయిందని, కాబట్టి ప్రతి ఈవీఎం తాలూకు వీవీప్యాట్ చీటీలను తైపారు వేసి చూడాల్సిందేనన్న డిమాండ్లు ఎక్కువైపోయాయి. అంతేగాదు, దేశంలో కొన్నిచోట్ల ‘ఈవీఎం’ల తంతు కనిపెట్టిన కొందరు రాజకీయ నాయకుల ఇళ్ల వద్దకు ‘ఈవీఎం’లు చేరినట్టు కొందరు ఫిర్యాదులు చేయడం కూడా విన్నాం. ఎన్నికల్లో గతంలో పేపర్ బ్యాలెట్ పత్రాలు వినియోగంలో ఉన్నప్పుడూ ఆ పత్రాలను దొంగిలించారని, బ్యాలెట్ పెట్టెలను తస్కరించారని లేదా పెట్టెల్లో ఓట్లు గుప్పిం చారన్న ఫిర్యాదులుండేవి, అలాగే ఈవీఎంలు రంగంలోకి వచ్చింతర్వాత కూడా ఆ యంత్రాలు సంక్లిష్టమైనవి అయినందున, ఓట్ల ట్యాంపరింగ్ సాధ్యపడదన్న ‘విశ్వాసం’ ఒకవైపున ప్రచారంలో ఉన్నప్పటికీ ట్యాంపరింగ్ సాధ్యమేనని వివిధ దేశాల్లో అత్యున్నత సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు. దాని ఫలితంగానే, ప్రపంచంలోనే సాంకేతిక విప్లవంలో అగ్రగాములుగా, అగ్రశ్రేణిలో నిలిచిన అమెరికా, జపాన్‌లు ఎన్నికల రంగం నుంచి ‘ఈవీఎం’లను తప్పించి, బ్యాలెట్ పేపర్లకు మళ్లాల్సి వచ్చిందని నిపుణుల అంచనా. అంతేగాదు, వీవీప్యాట్స్ నుంచి వెలువడే ఓటర్ల పేర్లున్న స్లిప్పులను కౌంట్ చేయటానికి ఎన్నికల సంఘం కొన్నిచోట్ల అనుమతించకపోవడమూ అనుమానాలకు దోహదం చేసింది. పెక్కుచోట్ల ఈవీఎంలు ఆచరణలో ‘దూడలు’ వేశాయని (మిస్‌బిహేవ్), చివరికి పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య ఒక్క ఓటు తేడా వచ్చినా ఆమోదయోగ్యం కాదని ప్రసిద్ధ ‘హిందూ’ వ్యాసకర్త, పాత్రికేయులు సంపత్ రాస్తూ ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థగా మనుగడలో ఉండాలని దేశం కోరుకోవడానికి కారణం– ఆ దేశపు ప్రభుత్వానికే అది నైతిక బలాన్ని కల్గిస్తుంది కాబట్టి. ఆ బలం పౌరుడి ఓటులో ఉంది. దానికి మారుపేరే రహస్య బ్యాలెట్. అందువల్ల ఏ పోలింగ్ నిర్వహణ పద్ధతైనా మూడు పరీక్షలు విధిగా నెగ్గాలి– పారదర్శకత, కచ్చితమైన ధృవీకరణ, రహస్యం. ఈ మూడు పరీక్షలకు పేపర్ బ్యాలెట్లే గీటురాయి. ఎందుకంటే, తాననుకున్న అభ్యర్థి ఎంపికను ఓటరు బ్యాలెట్ పత్రంలో కళ్లారా ధృవీకరించుకోగల్గుతాడు, ఓటింగ్ రహస్యంగానే జరి గిందని నమ్ముతాడు, తన ఏజెంటు కళ్లముందే ఓట్ల లెక్కింపు జరిగిందని తృప్తి పడతాడు. ఈ మూడు పరీక్షల్లోనూ ‘ఈవీఎం’లు విఫలమయ్యాయి. దీన్ని 2009లోనే జర్మనీ రాజ్యాంగ ధర్మాసనం ధృవీకరించింది’’ అని చెప్పారు. ఈవీఎంలలో రెండు యూనిట్లు ఉంటాయని, ఒకటి కంట్రోల్ యూనిట్, రెండోది బ్యాలెట్ యూనిట్టూనని వివరిస్తూ ‘ఈవీఎం ఓటింగ్ వ్యవస్థలో ఓటరు నిజమైన ఓటరా, దొంగ ఓటరా అని తెలుసుకోవడానికి వీలుండదని ఈవీఎంలను దుర్వినియోగం చేసే దుర్మార్గుల నుంచి కాపాడటం కష్టతరమనీ’ అంతర్జాతీయ కంప్యూటర్ సైన్స్, ఇంజ నీరింగ్ పత్రిక నిర్వహించే ప్రసిద్ధుడు సంజయ్ కుమార్ వెల్లడించాడు. అందుకనే పేపర్ బ్యాలెట్‌కు ఉన్న పారదర్శకత ఈవీఎంలకు లేనందుననే, అనుమానం వచ్చి ప్రశ్నించగల అవకాశం ఓటరుకు లేనందుననే ఈవీఎంల పారదర్శకతను పెక్కు దేశాలు ప్రశ్నించి ఆ యంత్రాలను ఎన్నికలలో ఓట్ల నమోదు ప్రక్రియ నుంచి ఉపసంహరించి, రద్దుచేసి రాజకీయ ఓటింగ్‌తో నిమిత్తంలేని చిల్లర పనులకు వాడుతున్నాయి. కంప్యూటర్ టెక్నిక్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడినుంచైనా సరే ఈవీఎం యంత్రాల ట్యాంపర్ చేయొచ్చునని కంప్యూటర్ సాంకేతిక నిపుణుడు ఐశ్వర్య కృష్ణన్ (15.3.17) ధృవీకరించాడు. అందుకనే, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీలు ఈవీఎంల వాడకాన్ని మానేసి పేపర్ బ్యాలెట్ వాడకానికి మళ్లిపోయాయి. అయితే అమెరికా, వెనిజులాల్లో కొన్నిచోట్ల ఈవీఎంలతో పాటు పేపర్ బ్యాలెట్లు కూడా వాడుకుంటున్నారు. ‘సందట్లో సడేమియా’ అన్నట్టు ఈ సందర్భంలోనే ఈవీఎంల ‘దందా’ సంగతేమోగానీ ఈవీఎంల రహస్యపాత్రకు తానేమీ తీసిపోలేదన్నట్లుగా దొంగ సర్వేల ద్వారా ప్రత్యర్థి పార్టీల తాలూకు ఓటర్లను తమ పార్టీకి పోటీ లేకుండా చేసుకోడానికి ఓటర్ల జాబితా నుంచి లక్షల సంఖ్యలో తొలగించే ‘యజ్ఞం’లో టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు. ఇందుకుగాను నెల్లూరు సభలో (9.2.19) ప్రజ లను ఓ నియంతగా శాసించి బాబు ఇలా హుకుం జారీ చేశారట: ‘నేను అడిగిన సీట్లు గెలిపించి తీరాలి. మీ ఇష్ట ప్రకారం ఓట్లు వేస్తే కుదరదు. మీరే నష్టపోతారు. అభ్యర్థుల్ని చూసి కాదు, నన్నూ నా కష్టాన్ని చూసి గెలిపించాలి’ ఇంతకీ ఈ పేలవ ప్రేలాపన వెనక ఉన్న దడ, భయం ఏమిటో ఆయన నోటినుంచే చెప్పక చెప్పినట్టు వినండి– ‘‘నేను విదేశాలకు వెళ్లినప్పుడు మీరు ఓడిపోతే మేం పెట్టిన పెట్టుబడులన్నీ ఏమైపోతాయని చాలామంది ఎన్నారై పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు’’ట! గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకోవటం అంటే ఇదే! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు,abkprasad2006@yahoo.co.in -
మీకు వైఎస్సార్సీపీ అంటే ఇష్టమా? లేక టీడీపీనా?
సాక్షి, అమరావతి: ‘‘మీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా? తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమా? వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానిస్తారా? చంద్రబాబును అభిమానిస్తారా? ప్రభుత్వం పథకాలు ఎలా అమలవుతున్నాయి? చంద్రబాబు బాగా పనిచేస్తున్నారా? వైఎస్ జగన్, చంద్రబాబులలో ఎవరంటే మీకు ఇష్టం? ఈ ఇద్దరిలో ఎవరికి మీ ఓటు?’’ ఇటీవలి కాలంలో కొందరు యువకులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రమంతటా తిరుగుతూ ఎన్నికల సర్వే పేరిట ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాబ్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలను తమతోపాటు తీసుకొస్తున్నారు. ఎక్కువగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఈ బృందాలు మోహరిస్తున్నాయి. ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నామని చెబుతూ ఓటర్లను ప్రశ్నలు అడుగుతున్నారు. ఓటరు ఐడీ నెంబర్, మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు. ఆయా నెంబర్లను తమతోపాటు తెచ్చుకున్న ట్యాబ్‌ల్లో అప్లోడ్ చేస్తున్నారు. కొద్దిసేపటికి సదరు ఓటర్ల ఓటు హక్కు రద్దవుతోంది. తమ ఓటు రద్దయినట్లు తెలుసుకుని జనం అవాక్కవుతున్నారు. ఓట్ల తొలగింపే లక్ష్యం గ్రామాలకు వస్తున్న యువకుల అసలు ఉద్దేశం సర్వే కాదని, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా చేయడమేనని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు భంగపాటు తప్పదని తేటతెల్లం కావడంతో టీడీపీయే సర్వేల పేరిట యువకులను పంపించి, ప్రతిపక్షం ఓట్లను తొలగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 70 మంది యువకులను బృందాలుగా విభజించి, వారిపై ఒక సూపర్వైజర్ను నియమించి తిప్పుతున్నారు. యువకుల వద్ద చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలున్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులున్నాయి. సర్వే బృందాలకు వాట్సాప్ గ్రూప్ గుంటూరులోని బాలాజీ నగర్లో ఇటీవల కొందరు యువకులు సర్వే పేరిట ఇంటింటికీ తిరుగుతూ పట్టుబడ్డారు. పి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసానికి వచ్చి సర్వే పేరిట ఓటర్ ఐడీ నంబర్, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగారు. సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్(స్పా) అనే సంస్థ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని చెప్పారు. ఓటర్ ఐడీ నెంబర్, ఫోన్ నెంబర్‌తో పనేముందని వారిని ప్రశ్నించడంతో అసలు సంగతి బయటపడింది. వీరిని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా పోలీసులకు అప్పగించారు. తాము ఇక్కడ 12 మంది తిరుగుతున్నామని, బెంగళూరు కేంద్రంగా తమ కార్యాలయం పనిచేస్తోందని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ బృందాలు తిరుగుతున్నాయని సదరు యువకులు చెప్పారు. ఆ యువకుల మొబైల్లో 76 మందితో కూడిన సర్వే బృందం వాట్సాప్ గ్రూప్ ఉంది. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలోనూ మరో బృందం సర్వే చేసి వెళ్లింది. యువకుల బృందాలు సర్వే చేసి వెళ్లిన కొద్దిసేపటికే తమ ఓట్లు రద్దవుతున్నాయని బాధితులు తెలిపారు. ఎన్నికల సంఘం పేరిట.. సర్వేలంటూ కొన్ని బృందాలు తిరుగుతుండగా మరికొందరు ఎన్నికల సంఘం పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం వచ్చామంటూ ఓటర్ల వివరాలు తెలుసుకుంటున్నారు. వారి చేతిలోని ట్యాబ్‌లో పార్టీల గుర్తులు చూపిస్తూ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో దానిపై వేలిముద్ర వేయాలని సూచిస్తున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుపై వేలిముద్ర వేసిన వారి ఓట్లన్నీ ఓటర్ల జాబితా నుంచి మాయమవుతున్నాయి. తమ ఇంటికీ కొందరు యువకులు వచ్చి వివరాలు తీసుకొని, వేలిముద్ర వేయించుకొని వెళ్లారని, అనుమానం వచ్చి ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే తమ ఓటును తొలగించినట్లు సమాధానం వచ్చిందని తోట కార్తీక్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ ఓట్ల తొలగింపు ముఠాలు పట్టుబడ్డాయి. అంబాజీపేట, రాజోలు ప్రాంతాల్లో ఓట్లు తొలగిస్తున్న ఈ ముఠాలను స్థానికులు, వైఎస్సార్సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాజోలు మండలం మాచవరం, వాకలగరువు గ్రామాల్లో తిరుగుతూ ఓటరు ఐడీ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అడుగుతున్న యువకులపై అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని విచారించారు. తాము సోషియో పొలిటికల్ ఎనాలసిస్ అనే సంస్థ నుంచి వచ్చామని యువకులు చెప్పుకొచ్చారు. ఒక్కో నియోజకవర్గానికి 60 మంది బృందాలుగా ఏర్పరిచినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సర్వేల పేరిట వివరాలు తెలుసుకుని, ఓట్లను తొలగిస్తున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. వివరాలు అడిగితే చెప్పొద్దని, ఓటరు ఐడీ, ఫోన్ నెంబర్లను ఇవ్వొద్దని పేర్కొంటున్నారు. అనుమానం వస్తే గట్టిగా నిలదీయాలని, పోలీసులకు అప్పగించాలని అంటున్నారు. ఓటర్లకు తెలియకుండా వారి ఓటు హక్కును తొలగించడం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేరమని చెబుతున్నారు. అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేలిముద్ర వేస్తే ఓటు మాయమైంది ‘‘మా ఇంటికి కొందరు యువకులు వచ్చారు. ఓటర్ ఐడీ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ట్యాబ్‌లోని గుర్తులపై వేలిముద్ర వేయాలంటే వైఎస్సార్సీపీ గుర్తుపై వేశాం. మరుసటి రోజు చూసుకుంటే ఓటరు జాబితాలో మా కుటుంబ సభ్యుల పేర్లు కనిపించలేదు’’ – సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎల్ఆర్ కాలనీ, గుంటూరు ఇది తెలుగుదేశం పార్టీ పనే గుంటూరు నగరంలో సర్వేల పేరిట యువకులను నియమించి, 36 వేలకు పైగా ఓట్లను తొలగించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా చెప్పారు. ఈ ఓట్లన్నీ తమ పార్టీ అభిమానులు, సానుభూతిపరులవేనని అన్నారు. అధికార తెలుగుదేశం పార్టీయే ఇదంతా చేయిస్తోందని ఆరోపించారు. టీడీపీ అడ్డదారులు ప్రతిపక్ష మద్దతుదారులకు చెందిన ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇలాంటి ముఠాలు పర్యటిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించలేమనే టీడీపీ నేతలు అడ్డదారుల్లో ఇలా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. -
ఓట్ల తొలగింపు ముఠా పట్టివేత
అంబాజీపేట/రాజోలు: అనధికారికంగా సర్వే చేస్తూ పథకం ప్రకారం వైఎస్సార్సీపీకి చెందినవారి ఓట్లను తొలగిస్తున్న బృందాన్ని తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు సోమవారం అడ్డుకున్నాయి. అంబాజీపేట, రాజోలు మండలాల్లోని మాచవరం, వాకలగరవు గ్రామాలకు రెండు బృందాలుగా 11 మంది యువకులు చేరుకుని అనధికారికంగా సర్వే చేపట్టారు. మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనుమానాస్పందంగా సంచరిస్తున్న ఆరుగురు యువకులను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నాగవరపు నాగరాజు, మట్టా వెంకటేశ్వరరావు, కొర్లపాటి కోటబాబు, మైలా ఆనందరావు, జనసేన నాయకుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు గుర్తించి నిలదీశారు. యువకులు ‘సోషియో పొలిటికల్ ఎనాలిసిస్’ (స్పా) సంస్థ నుంచి వచ్చామన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో సర్వే చేసేందుకు 60 మంది బృందంగా ఏర్పడినట్లు తెలిపారు. ఓట్లు తొలగించే బృందంపై ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, పథకాలు, ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. గుర్తింపు కార్డులు చూపించాలని అడగడంతో.. జి.సాయి, గణేష్, నరేంద్ర, రాహుల్, మణికంఠ, వెంకటేశ్వరరావుగా పేర్లు చెప్పుకున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలిచ్చారు. అనుమానం వచ్చి టీడీపీకి అనుకూలంగా లేని ఓట్లను సర్వే పేరుతో తొలగిస్తున్నారని బృంద సభ్యులను నిలదీయగా వారి వద్ద నుంచి సమాధానం లేదు. దీంతో అంబాజీపేట పోలీస్ స్టేషన్‌కు బృంద సభ్యులను అప్పగించి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు పోలీస్ స్టేషన్‌కు వచ్చి బృంద సభ్యుల నుంచి సర్వేపై ఆరా తీయగా తాటిపాకలోని సాయితేజ లాడ్జిలో సూపర్ వైజర్లు ఉన్నారని సమాధానమిచ్చారు. లాడ్జిని తనిఖీ చేయగా 11 మంది ‘స్పా’ సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లు బయటపడ్డాయి. అంబాజీపేట మండలం వాకలగరువులో సర్వే పేరుతో తిరుగుతున్న మరో ఆరుగురిని పార్టీ నాయకులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా, పట్టుకున్నవారిని విడిచిపెట్టాలంటూ అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. -
లక్ష ఓట్లు ఔట్?
సాక్షి, సిటీబ్యూరో: ఒకే వ్యక్తికి రెండు చోట్లా ఓటు ఉంటుందా..? అంటే ఉంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లోనే కాదు..ఒకే పోలింగ్ కేంద్రంలోనూ రెండు పర్యాయాలు ఓటు ఉంది. ఇలా ఒకే రకమైన పేరు, ఒకే రకమైన ఫొటోలు కలిగి ఉన్న వారు 1,01,470 మంది ఉన్నారు. ఫొటోలు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, ఇలా ఐదు అంశాలు ఒకేరకంగా ఉంటే వాటిని (డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్)డీఎస్ఈగా పేర్కొంటూ పరిశీలించి తొలగిస్తారు. అలా హైదరాబాద్ జిల్లాలో 1,01,470 డీఎస్ఈలో 72,707 మంది ఫొటోలు కూడా మ్యాచ్ అయ్యాయి. అంటే దాదాపుగా వారంతా ఒక్కరేనన్నమాట. అలాంటి ఓట్లను నిబంధనల మేరకు నోటీసులిచ్చి తొలగించనున్నారు. మిగతా వారిలోనూ ఎంతమందివి ఇతర అంశాలతో పోలనున్నాయో తేల్చాల్సి ఉంది. వీరిలో తెలిసీ రెండు, మూడు పర్యాయాలు ఓటర్లుగా నమోదు చేయించుకున్న వారితోపాటు మారిన చిరునామాతో కొత్త ఓటరుగా నమోదు చేసుకొని, పాతది తొలగించుకోని వారు కొందరు. ఉన్న జాబితాలో ఓటు తొలగిస్తే.. ఆందోళనతో తిరిగి నమోదు చేయించుకున్నాక, పాతది మళ్లీ జాబితాలో చేర్చడంతో రెండు పర్యాయాలు జాబితాలో పేరున్న వారు కొందరు ఉన్నారు. ఇలా రకరకాల కారణాలతో డూప్లికేట్లుగా ఉన్న ఓటర్లు ముసాయిదా జాబితాలో లక్షకుపైగా ఉన్నారు. ఆధునిక సాఫ్ట్వేర్ సాయంతో ఇలాంటివారిని గుర్తించే చర్యలకు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలనలతో ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉంటే తొలగించనున్నారు. తూతూమంత్రగా సర్వేలు.. ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, జియో ట్యాగింగ్‌చేసి మరీ కచ్చితంగా ఇళ్లకు వెళ్లేట్లు చేశామని అధికారులు చెప్పినా..అదంతా ఒట్టిదేనని తేలింది. ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండానే తూతూ మంత్రంగా సర్వే కార్యక్రమాన్ని ముగించిన బూత్‌లెవెల్ అధికారుల వల్లా డూప్లికేట్ల సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక చిరునామాలో ఒకే వ్యక్తి పేరు రెండు పర్యాయాలున్నా కనీసం ఇదేమిటని పరిశీలించిన పాపాన పోకపోవడంతో ఇలా కుప్పలుతెప్పలుగా ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటర్లున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఓట్ల ప్రయోజనాల కోసం ఎక్కువ చోట్ల నమోదు చేయించుకున్న ఓటర్లు.. నమోదు చేయించిన రాజకీయపార్టీలూ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల తీరుపై బీజేపీ నాయకుడు పి.వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్ని పర్యాయాలు ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం దీన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇలా ఒకే వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లున్న నియోజకవర్గాల్లో యాకుత్‌పురాలో అత్యధికంగా 11,322 మంది, ఆ తర్వాతి స్థానాల్లో బహదూర్‌పురాలో 10,957 మంది, చాంద్రాయణగుట్టలో 10,822 మంది , కార్వాన్లో 10,127 మంది ఉన్నారు.మొత్తం 1,01,470 మందికి గాను 72,707 మంది ఫొటోలు కూడా ఒకేలా ఉన్నాయంటే.. వీరి పేర్లు జాబితాల్లోంచి తొలగించనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విధమైన పోలికలున్నవారు.. ఫొటోలు మ్యాచ్ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
‘బోగస్’ ఏరివేత..!
ఆదిలాబాద్‌అర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగేళ్ల కాలంలో 2,05,174 మంది బోగస్ ఓటర్లను తొలగించినట్లు ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద లెక్కలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధికంగా 92,337 ఓట్లు ఏరివేతకు గురయ్యాయి. దీంతో 2014లో ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్యకు.. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పొంతన లేకుండా పోయింది. 2015లో స్పెషల్ సమ్మరి రివిజన్, 2017లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్(ఐఆర్‌ఈఆర్) కార్యక్రమాల ద్వారా బోగస్ ఓటర్లను ఏరి వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో మరో రెండు సార్లు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాలు చేపట్టి అర్హులైన వారిని నమోదు చేశారు. కానీ యువత నుంచి స్పందన రాక లక్ష్యానికి అనుగుణంగా ఓటర్లు నమోదు కాలేదు. అంటే ఓటర్ల తొలగింపుపై కనబర్చిన శ్రద్ధ.. ఎన్నికల అధికారులు నమోదులో చూపలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలగిపోయిన ఓటర్లలో చనిపోయిన వారు, రెండేసి గుర్తింపు కార్డులు ఉన్న వారు.. వలస వచ్చి ఇక్కడే ఉంటున్న వారు ఉన్నారు. వీరితోపాటు కొందరు అర్హులైన ఓటర్లు కూడా తొలగిపోయారని దృష్టికి రావడంతో అప్పట్లో ఆదిలాబాద్‌లో దుమారం రేగింది. అర్హులుగా ఉంటే ఈ నెల 25 వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న నమోదు కార్యక్రమాల ద్వారా ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గిపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 2,05,174 ఓట్ల తొలగింపు.. 2014 ఏప్రిల్ 16న విడుదల చేసిన ఓటర్ల ఫైనల్ డాటాబేస్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏడు నియోజకవర్గాల్లో 2,05,174 బోగస్ ఓటర్లను వివిధ కారణాలతో తొలగించారు. మిగతా 17,54,486 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు. ఈ నాలుగేళ్ల కాలంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాల ద్వారా నాలుగు జిల్లాల్లో కేవలం 12,679 మంది యువతే కొత్తగా జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో అర్హత గల ఓటర్ల సంఖ్య 17,67,165కు చేరింది. ఈ జాబితానే 2018 సె ప్టెంబర్ 1న ముసాయిదా జాబితాగా నాలుగు జి ల్లాలో విడుదల చేశారు. ఈ తొలగింపులు, కొత్త ఓటరు నమోదులు, సవరణ ప్రక్రియలు ఆయా జిల్లాలో పరిధిలోనే జరిగాయి. ఓటర్లు తొలగిపోయిన ఏడునియోజకవర్గాలను ఓసారి పరిశీలిస్తే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. సిర్పూర్ : ఈ నియోజకవర్గంలో 2014లో 1,90,722 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,79,292 మంది ఓటర్లు ఉండగా, మిగతా 11,430 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన ఓట్లలో 5,349 మంది పురుషులు ఉండగా, 6,084 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెల్లంపల్లి : ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 2014లో 1,60,960 మంది ఓటర్లుగా ఉండగా, ప్రస్తుతం 1,55,153 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 5,807 ఓట్లను అధికారులు తొలగించారు. తొలగిపోయిన వారిలో 2,779 మంది పురుషులు ఉండగా, 3028 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల: ఈ నియోజకవర్గంలో 2014లో 2,38,423 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,46,086 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 92,337 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన వారిలో 48,425 మంది పురుషులు ఉండగా, 43,896 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్ : ఈ నియోజకవర్గంలో 2014లో 1,86,435 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,78,715 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 7,720 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన వారిలో 2699 మంది పురుషులు ఉండగా, 5,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,23,175 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,73,951 మంది ఓటర్లు ఉన్నారు. ఏకంగా 49,224 ఓట్లు తొలగించబడ్డాయి. ఇందులో 26,630 మంది పురుషులు ఉండగా, 22,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిర్మల్ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,10,094 మంది ఓటర్లు ఉండగా, 1,86,512 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాక 23,582 మంది ఓటర్లు తొలగిపోయాయి. తొలగిపోయిన వారిలో పురుషులు 11,222 మంది ఉండగా, 12,363 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముథోల్ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,08,805 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,93,731 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగేళ్లలో 15,074 మంది ఓట్లను తొలగించారు. తొలగిపోయిన వారిలో 6,984 మంది పురుషులు ఉండగా, 8,088 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇవే కాకుండా 22 ఇతర ఓటర్లు (థర్డ్ జెండర్) ఉన్నారు. తొలగించబడిన వారిలో చని పోయిన వారు సుమారు 35,670 మంది ఉండగా, మిగతా వారందరు వలస వచ్చి ఇక్కడ ఉం టున్న వారు, రెండేసి ఓట్లున్న వారు, బోగస్‌గా గుర్తించిన ఓట్లని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో పెరుగుదల ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ నాలుగేళ్ల కాలంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. చెన్నూర్ నియోజకవర్గంలో నాలుగేళ్లలో 1,897 మంది ఓటర్లు పెరగగా, అసిఫాబాద్‌లో 10,271 మంది పెరిగారు. ఇక బోథ్ నియోజకవర్గంలో తక్కువగా 511 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్లలో 12,679 మందే నమోదు.. ఎన్నికల సంఘం ప్రతీ ఏడాది అన్ని జిల్లాల్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఓటరు సవరణ కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా అధికారులు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించడంతోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పులకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నాలుగేళ్లు జరిగిన సవరణ కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12,679 మందే నమోదైనట్లు కన్పిస్తోంది. 2014లో ఉమ్మడి జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉంటే ఇందులోంచి 2,05,174 మంది తొలగించబడ్డాయి. మిగతా 17,54,486 మంది అర్హులుగా తేలారు. 2018 సెప్టెంబర్న విడుదల చేసిన జాబితా ప్రకారం 17,67,165 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ నాలుగేళ్ల కాలంలో 12,679 మంది మాత్రమే ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పవచ్చు. జనాభా ప్రతిపాదికన ప్రతియేడాది లక్ష్యం మేరకు ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నికల సంఘం ప్రతి యేడాది నమోదు చేపడుతోంది. ప్రతీ యేడాది ఓటర్ల సంఖ్య పెరుగుతూ రావాలి. కానీ ఉన్న ఓటర్లు తగ్గిపోవడం శోచనీయం. ఫలితాలివ్వని నమోదు కార్యక్రమాలు.. ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన లేకపోవడమో.. అధికారుల ప్రచారలోపమో మొత్తానికి ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఫలితాలివ్వడం లేదు. గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాలు చేపట్టిన యువత ముందుకు గమనార్హం. పద్దెనిమిదేళ్లు నిండిన యువత నమోదు చేసుకోవడం లేదా.. లేక వారికి తెలియడం లేదా అనేది అధికారులకు కూడా అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న స్పందన రావడం లేదు. ఎన్నికల సమయంలో నమోదుపై హడావుడి చేయడం తప్పా మిగతా సమయాల్లో పట్టించుకున్న పాపన పోవడం లేదు. దీంతో ఒకేసారి యువత స్పందించి నమోదు చేసుకోవాల్సి రావడంతో వలన వచ్చిన వారు, ఒక్కొక్కరు రెండేసి చోట్ల నమోదు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో మళ్లీ వారిని బోగస్‌గా గుర్తించాల్సి వస్తోందని సమాచారం. -
భారీగా ఓటర్ల తొలగింపు
కడప సెవెన్‌రోడ్స్ : కడప నియోజకవర్గంలో భారీగా ఓటర్లను తొలగించడంపై వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 2.7లక్షల ఓట్లు ఉంటే నేడు 1.64 లక్షలకు ఎలా తగ్గిపోయాయో అధికారులు సమాధానం ఇవ్వాలన్నారు. కడప, చిత్తూరు జిల్లాల రోల్స్ అబ్జర్వర్ బి.శ్రీధర్ సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప అసెంబ్లీ పరిధిలో 261 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులోని 90 పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్లు 500 కంటే తక్కువగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో కాకుండా దూరంగా ఉండే పోలింగ్కేంద్రాల్లోకి వారి ఓట్లను మార్చారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే ఓటర్ల జాబితా ఉంటే కడపలో 30 శాతం కూడా ఓట్లు పోల్ కావన్నారు. బూత్ లెవెల్ అధికారులు సక్రమంగా పనిచేయలేదని ఆరోపించారు. ఇంటింటి సర్వే ఎక్కడా జరగలేదన్నారు. ఒక అపార్టుమెంటులో 20ఇళ్లు ఉంటే ఒక డోర్ నెంబరు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. చిన్నచౌకు, చెమ్ముమియాపేటల్లో మాత్రమే డబుల్ ఎంట్రీలు ఉన్నాయని చెప్పారు. తాము బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తామని అధికారులు మళ్లీ ఇంటింటి సర్వే చేపడితే ఓటర్ల జాబితా సక్రమంగా తయారవుతుందని సూచించారు. బోగస్ ఓట్లు తొలగించాలి:ఎమ్మెల్యే రవి కమలాపురం నియోజకవర్గం దేవరాజుపల్లె పోలింగ్ కేంద్రం 46, మాచిరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రం 93 పరిధిలో చాలామేరకు ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఆధార్ లింక్ చేసినపుడు బోగస్ ఓట్లు పోయాయని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ లింక్ తొలగించడం వల్ల మళ్లీ ఓట్లు అక్కడ పెరిగాయన్నారు. తాము ఆ పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను నియమించుకునే పరిస్థితి లేదని, కనుక విచారణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించాలన్నారు. అలాగే 2, 3, 4 పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించాలన్నారు. ఇక 138 పోలింగ్ కేంద్రానికి అనిమెల అని కాకుండా గంగిరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రంగా మార్చాలన్నారు. జంగంపల్లె ఓటర్లకు 26వ పోలింగ్‌కేంద్రం చాలా దూరంలో ఉందన్నారు. కనుక జంగంపల్లెలోని కొత్తగా పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే రామచంద్రాపురంలో ఉన్న 23 పోలింగ్ కేంద్రంలో కలుపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకుడు కానుగ దానం, సీపీఎం నాయకుడు టి.సునీల్ మట్లాడారు. -
ఓట్లు తొలిగింపు అవాస్తవం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అర్హులైన వారి ఓట్లు తొలగించినట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేయవచ్చని మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని, ఆధార్ అనుసంధానం ద్వారా 89,085 నకిలీ ఓటర్లను గుర్తించామని చెప్పారు. నకిలీ ఓటర్లను మాత్రమే తాము తొలగించామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టంచేశారు.