సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను తొలిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని మంత్రి దాడిశెట్టి రాజా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనర్హుల ఓట్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను మంత్రులు చెల్లబోయిన వేణు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌లు కలిశారు.
చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆ ఓట్లను తనిఖీ చేసి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. అనర్హులైన ఓటర్లందరిని తొలగించాలని కోరామని వెల్లడించారు.
చంద్రబాబు హయాంలో భారీగా అక్రమ ఓట్లను నమోదు చేశారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇప్పటికే బీఎల్ఓలు ఆ అనర్హులని గుర్తించారని పేర్కొన్నారు. కానీ వాటిని ఇంకా తొలగించలేదని తెలిపారు. చనిపోయిన ఓటర్లను కూడా తోలగించాలని కోరామని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లోనూ, ఇక్కడ రెండు చోట్లా ఓట్లు ఉండటం సమంజసం కాదని అన్నారు. అందుకే ఆ ఓట్లను వడకట్టి ఎదో ఒక చోట ఉంచాలని కోరినట్లు తెలిపారు.
'పక్క రాష్ట్రల్లో ఉన్నవారికి ఇక్కడ ఓట్లు నమోదు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉండటం, రెండు, మూడు ఓట్లు ఉండటం సమంజసం కాదు. టీడీపీ హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశాం. వాటన్నింటిని తోపగించాలని కోరాం' అని మంత్రి చెల్లబోయిన వేణు తెలిపారు.
ఇదీ చదవండి: చంద్రబాబు, రామోజీ అసలు బండారం బట్టబయలు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment