mukhesh kumar meena
-
అనర్హుల ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను తొలిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని మంత్రి దాడిశెట్టి రాజా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనర్హుల ఓట్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను మంత్రులు చెల్లబోయిన వేణు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌లు కలిశారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆ ఓట్లను తనిఖీ చేసి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. అనర్హులైన ఓటర్లందరిని తొలగించాలని కోరామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో భారీగా అక్రమ ఓట్లను నమోదు చేశారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇప్పటికే బీఎల్ఓలు ఆ అనర్హులని గుర్తించారని పేర్కొన్నారు. కానీ వాటిని ఇంకా తొలగించలేదని తెలిపారు. చనిపోయిన ఓటర్లను కూడా తోలగించాలని కోరామని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లోనూ, ఇక్కడ రెండు చోట్లా ఓట్లు ఉండటం సమంజసం కాదని అన్నారు. అందుకే ఆ ఓట్లను వడకట్టి ఎదో ఒక చోట ఉంచాలని కోరినట్లు తెలిపారు. 'పక్క రాష్ట్రల్లో ఉన్నవారికి ఇక్కడ ఓట్లు నమోదు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉండటం, రెండు, మూడు ఓట్లు ఉండటం సమంజసం కాదు. టీడీపీ హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశాం. వాటన్నింటిని తోపగించాలని కోరాం' అని మంత్రి చెల్లబోయిన వేణు తెలిపారు. ఇదీ చదవండి: చంద్రబాబు, రామోజీ అసలు బండారం బట్టబయలు: సజ్జల -
సాగర తీరంలో స్వాతంత్య్రదిన వేడుకలపై సమీక్ష
విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తున్న స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి (పొలిటికల్) ముకేష్‌కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బుధవారం విశాఖ నగరంలో పర్యటించారు. తొలుత వేడుకలు నిర్వహించనున్న బీచ్‌రోడ్డు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో కలసి ఏర్పాట్లను సమీక్షించారు. విశాఖలో తొలిసారిగా జరుగుతున్న రాష్ర్ట స్థాయి స్వాతంత్య్ర వేడుకలను చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు సహా సుమారు వెయ్యి మందికి పైగా వీఐపీలు, వీవీఐపీలు పాల్గోనున్న ఈ మహా వేడుకలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదన్నారు. ప్రజలందరూ ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. ఈ సమీక్షలో జేసీ జే.నివాస్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకుడు డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్వీఎం నిధుల వాడకంపై రేగిన దుమారం
సాక్షి, సిటీబ్యూరో: రాజీవ్ విద్యామిషన్ నిధులను సొంత అవసరాలకు వాడుకున్న హైదరాబాద్ జిల్లా తాజా, మాజీ కలెక్టర్ల తీరును కొందరు ఉన్నతాధికారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ‘ఆర్వీఎం నిధులతో కలెక్టర్ల సోకులు’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్‌లోనూ ఇదే చర్చ కొనసాగింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరినట్లు తెలిసింది. ప్రభుత్వ సొమ్ముకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన జిల్లా పాలనాధికారులు(కలెక్టర్లు) ఇంటి పనులకంటూ.. దర్జాగా దుబారా చేయడం పట్ల ఆయన సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఆర్వీఎం ఎస్పీడీ నివేదిక కారణంగా తమ బండారం బయటపడడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తాజా, మాజీ కలెక్టర్లు ఉన్నారు. కలెక్టర్ల సొంత ఖర్చులంటూ.. వ్యక్తిగత సిబ్బంది వివిధ ప్రభుత్వ విభాగాలకు పంపుతున్న బిల్లులు ఎంతవరకు సరైనవనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10వేలకు నీళ్లు తాగారా! హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా సయ్యద్ ఆలీ ముర్తుజా రిజ్వీ గతేడాది జూలై 1వరకు పనిచేశారు. తాను తాగే కప్పు కాఫీకి కూడా ఆయన తన జేబు నుంచే డబ్బులు చెల్లించడం ఆయన నైజం. అలాంటిది.. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో (గతేడాది మే, జూన్ నెలల్లో) క్యాంపు కార్యాలయానికి నెల మంచినీళ్లకు రూ.10వేల చొప్పున ఖర్చు చేశారంటే నమ్మశక్యం కావడం లేదని రెవెన్యూ ఉద్యోగులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కలెక్టర్ ఖర్చులంటూ.. వ్యక్తిగత సహాయకులే ఆయా బిల్లులను వివిధ ప్రభుత్వ విభాగాలకు పంపుతుంటారు. బిల్లులన్నీ కలెక్టర్ సంతకం లేకుండానే వచ్చిన్పప్పటికీ, ఆయా విభాగాల అధికారులు చెల్లింపులు చేస్తున్నారు. రిజ్వీ హయాంలో.. గతేడాది జూలై 1వరకు కలెక్టర్‌గా పనిచేసిన రిజ్వీ హయాంలోనే నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల క్యాంపు కార్యాలయాల్లో సిబ్బందికి వేతనాల కింద రూ.72,420, ఆయన వాడిన కారు రిపేర్లకు రూ.22,780లు ఆర్వీఎం నుంచే చెల్లించారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల నిమిత్తం రూ.15,466, ఇతర పనులకంటూ రూ.9,850 ఖర్చు చేశారు. మంచినీళ్ల కోసం మే నెలలో రూ.10వేలు, జూన్‌లో రూ.9,240లు ఆర్వీఎం నిధులను చెల్లించారు. ముఖేష్ హయాంలో... హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా గతేడాది జూలై 2న బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలోనూ.. నిబంధనలకు విరుద్ధంగా.. గత అక్టోబరులో ఆయన ఉంటున్న ఇంటికి కొత్త కిటికీలు, వుడెన్ ఫ్రేమ్‌లు, ఫిట్టింగ్ చార్జీల కింద రూ.57,606లు ఆర్వీఎం నిధులనే వినియోగించారు. అంతకు ముందు రకరకాల పనులంటూ జూలైలో రూ.39,638, వాహనాల ఖర్చు కింద ఆగస్టులో రూ.5,100లు, అక్టోబరులో రూ. 37,870లు ఆర్వీఎం నిధులనే వినియోగించారు.