గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అర్హులైన వారి ఓట్లు తొలగించినట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేయవచ్చని మంగళవారం పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని, ఆధార్ అనుసంధానం ద్వారా 89,085 నకిలీ ఓటర్లను గుర్తించామని చెప్పారు. నకిలీ ఓటర్లను మాత్రమే తాము తొలగించామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టంచేశారు.