సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘ఉదయగిరి మండలం గండిపాళెంలోని 31, 32 పోలింగ్ కేంద్రాల పరి«ధిలో 42 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు రాపల్లె శ్రీనివాసులు అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.’ – ఇది ఈనాడు పత్రికలో వచ్చిన వార్త.
వాస్తవం ఏంటంటే...
గండిపాళెంలో 42 మంది ఓట్ల తొలగింపు కోసం ఫారం–7 ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం నిజమే. కానీ రాపల్లె శ్రీనివాసులు పేరుతో నమోదు చేసింది మాత్రం జిల్లా ఐ టీడీపీ వింగ్‌లో ఉన్న కీలక వ్యక్తి. గండిపాళేనికి చెందిన ఐ టీడీపీ లీడరే రాపల్లె శ్రీనివాసులు పేరుతో ఫారం–7 నమోదు చేయించి ఆ నేరం వైఎస్సార్‌సీపీపై నెట్టేశారు. ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
పచ్చపత్రికలో దీనిపై వార్త కూడా ప్రచురించేశారు. ఆ 42 మంది అసలు స్థానికులు కారు. వ్యాపారాల పేరుతో గత 20 ఏళ్లుగా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో స్థిరపడిన వారే. వారి ఆధార్ కార్డులు పరిశీలించినా స్థానికేతరులని తెలుస్తుంది. కానీ తహసీల్దార్ వాస్తవాలు తెలుసుకోకుండా పచ్చపత్రిక ప్రభావం, స్థానిక టీడీపీ నేతల ఒత్తిడితో రాపల్లె శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.
స్వచ్ఛమైన జాబితాలపైనా టీడీపీ కుయుక్తులు
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ రకరకాల కుయుక్తులు పన్నుతోంది. తాజాగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ అభూత కల్పన కోసం ఐ టీడీపీ వింగ్‌ను టీడీపీ రంగంలోకి దింపింది. ఆ టీం సభ్యులు టీడీపీ సానుభూతిపరులు అధి కంగా ఉన్న గ్రామాలను ఎంచుకుంటున్నారు.
ఆ గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాలలో వ్యాపార నిమిత్తం స్థిరపడి ఉండి టీడీపీ సానుభూతిపరులైన వారిని ఎంపిక చేసుకుని వారి ఓట్లు తొలగించమని, ఈ మెయిల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారం–7ను నమోదు చేయిస్తున్నారు. వెంటనే స్థానిక టీడీపీ నేతల చేత ఫిర్యాదులు
చేయిస్తున్నారు.
ఇరకాటంలో అధికారులు
టీడీపీ చేస్తున్న ఈ పన్నాగంతో అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ముందుగా ఐ టీడీపీ సభ్యులు ఫారం–7 దరఖాస్తులు పంపి ఎల్లో మీడియాలో అవి వైఎస్సార్‌సీపీ నాయకులు పంపినట్లుగా కథనాలు రాయిస్తున్నారు. రోజూ అధికారులపై వ్యతిరేక వార్తలు రాయించి వారిపై ఒత్తిడి పెంచుతున్నారు.
నెల రోజులుగా జిల్లాల్లో ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ ఎల్లో మీడియాలో నిత్యం వార్తలు వసూ్తనే ఉన్నాయి. వాటిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వాటిని జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ పంపి విచారణలు చేయించడం జరుగుతోంది. ఇలా అధికారులపై కొత్తరకం దాడి చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment