హైదరాబాద్‌ శివారులో భారీగా కోడి పందేలు.. టీడీపీ నేత అరెస్ట్‌! | SOT Police Arrested TDP Leader Shiva Kumar Varma In Hyderabad ‪ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ శివారులో భారీగా కోడి పందేలు.. టీడీపీ నేత అరెస్ట్‌!

Published Wed, Feb 12 2025 7:47 AM | Last Updated on Wed, Feb 12 2025 7:50 AM

SOT Police Arrested TDP Leader Shiva Kumar Varma In Hyderabad ‪

ఏపీ మంత్రి నారా లోకేష్‌తో కోడి పందేల నిర్వాహకుడు శివకుమార్‌(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందేల శిబిరంపై దాడులు నిర్వహించారు. కోళ్ల పందెం నిర్వహించింది టీడీపీకి చెందిన శివకుమార్‌ వర్మగా గుర్తించారు. ఈ క్రమంలో కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో పది మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగతా వారంతా ఏపీకి చెందినవారే ఉన్నారు.

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని తోలుకట్టాలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్‌ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కోళ్ల పందేల శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌, చేవెళ్ల ఏసీపీ కిషన్‌, మొయినాబాద్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందేల శిబిరానికి చేరుకున్నారు.

అనంతరం, పోలీసులు వ్యవసాయ క్షేత్రంలోనికి వెళ్లేసరికి పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడంతో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో కోడి పందేల నిర్వాహకుడు టీడీపీకి చెందిన భూపతిరాజు శివకుమార్‌వర్మ, పందెంరాయుళ్లు ఎటూ పోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు. లోకేష్‌తో పాటు పలు సందర్బాల్లో ఫొటోలు దిగిన భూపతిరాజు. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ 64 మంది పందెం రాయుళ్లు, 80 కోళ్లతో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేళ్లను ఆడించడానికి బెట్టింగ్‌ రూ.30 లక్షలు పెట్టినట్టు సమాచారం. కోడి పందేలు ఆడుతున్న వారి నుంచి రూ.30 లక్షలు, 80 కోళ్లు, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement