
ఘట్‌కేసర్: జైల్లోనే తనను హత్య చేయించాలని పెద్దకుట్ర జరిగిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రెముల జేకే కన్వెన్షన్‌లో తీన్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లతో భవిష్యత్ కార్యాచరణసభను ఆదివారం నిర్వహించారు. అధికార పార్టీ అకారణంగా తనను అరెస్టు చేసి 74 రోజులపాటు జైలుకు పంపి ఇబ్బందులకు గురిచేసిందని మల్లన్న పేర్కొన్నారు.
గత అక్టోబర్ 2న పాత నేరస్తులతో జైల్లోనే అతి క్రూరంగా చంపాలని చూశారని, అయితే తాను చాక చక్యంగా తప్పించుకున్నానని చెప్పారు. తర్వాతిరోజు చీకటిగదిలో బంధించి మానసిక దివ్యాంగులకు ఇచ్చే మత్తుమందు, మాత్రలతో పిచ్చివాడిని చేయాలని యత్నించారని ఆరోపించారు. జైలు నుంచి బయటకు తీసుకురావడానికి శక్తిమంతమైన కొందరు నాయకులతో ప్రయత్నించడం నిజమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment