కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం గోదుమకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చిపై గ్రామస్థులు దాడి చేశారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా దూసుకొచ్చిన దుండగులు.. చర్చిలోని ఫర్నీచర్‌తో పాటు మేరిమాత, యేసుక్రీస్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. చర్చి పెద్దల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.