attack on church
-
చర్చిపై బాంబు దాడి : ముగ్గురి అరెస్ట్
కోల్‌కతా : తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని భగవాన్‌పూర్‌లోని చర్చిపై ఆరెస్సెస్, బీజేపీకి చెందినవారుగా భావిస్తున్న కొందరు బాంబులతో దాడి చేసి అక్కడున్న కారును ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. చర్చి ఫాస్టర్ ఫిర్యాదుపై ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్ధానిక బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఎనిమిది మంది ఈ దాడిలో పాల్గొన్నారని పాస్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఒడిషా, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లో గతంలో చర్చిలపై దాడులు జరిగినా బెంగాల్లో ఈ తరహా దాడి ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలుత చర్చి ప్రాంగణంలో రెండు బాంబులు విసిరిన దుండగులు ప్రార్ధనలు చేస్తున్నవారు భయంతో పరుగులు తీయగానే లోపలికి చొచ్చుకువచ్చి అక్కడున్న చైర్లు, టేబుళ్లు, కిటికీ అద్దాలు, మైక్రోఫోన్లను ధ్వంసం చేశారు. పదిహేను నిమిషాల పాటు విధ్వంసానికి పాల్పడిన అనంతరం వారు అక్కడి నుంచి వెనుదిరిగారని పాస్టర్ తెలిపారు. కాగా చర్చిపై దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. -
మేడ్చల్ జిల్లాలో చర్చిపై దాడి..
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం గోదుమకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చిపై గ్రామస్థులు దాడి చేశారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా దూసుకొచ్చిన దుండగులు.. చర్చిలోని ఫర్నీచర్‌తో పాటు మేరిమాత, యేసుక్రీస్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. చర్చి పెద్దల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
ఛత్తీస్‌గఢ్‌లో చర్చిపై దాడి
♦ బైబిల్, ఇతర వస్తువులకు నిప్పు ♦ పాస్టర్, ఆయన గర్భిణి భార్యపైనా దాడి రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బస్తర్ జిల్లాలోని ఓ చర్చిలోకి చొరబడిన ఇద్దరు సాయుధులు విధ్వంసం సృష్టించారు. బైబిల్‌తోపాటు ఇతర వస్తువుల్ని తగులపెట్టడమేగాక పాస్టర్‌పైన, ఆయన గర్భిణి భార్యపైనా దాడికి పాల్పడ్డారు. వారిద్దరినీ చితకబాదారు. ఈ ఘటన పర్పా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కరంజి మటగుడి పారా గ్రామంలో ఆదివారం చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు.. వేరొక క్రైస్తవ సంఘానికి చెందినవారమని చెప్పుకుంటూ చర్చిలో ప్రార్థన చేయాలన్న కోరికను వ్యక్తీకరించారు. లోనికి వచ్చిన వెంటనే పాస్టర్‌పై దాడికి దిగారు. తమ వెంట తెచ్చిన పెట్రోల్‌ను బైబిల్‌పైన, ఫర్నిచర్‌పైన, ఇతర మతసంబంధిత వస్తువులపైన పోసి తగులపెట్టారు పాస్టర్‌ను, ఆయన గర్భిణి భార్యనూ చితకబాదారు. పాస్టర్ దీనబంధు సమేలి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు పెట్టి దుండగుల కోసం గాలిస్తున్నారు. బజరంగ్దళ్ పనే.. ఈ దాడి బజరంగ్దళ్ కార్యకర్తల పనేనని ఛత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరం చీఫ్ అరుణ్ పన్నాలాల్ ఆరోపించారు. పోలీసులు దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలోని క్రైస్తవ మందిరాలపై ఇటీవలి కాలంలో జరిగిన మూడో దాడి ఇదన్నారు. దుండగులు పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారన్నారు. -
చర్చిలపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు
బెంగళూరు నగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 2008, 2009 సంవత్సరాల్లో పలు దాడులు చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన సజ్జన్ కుమార్ (33) నగరంలోని పలు చర్చిలపై గతంలో దాడి చేశాడని, అతడికి ఓ సనాతనవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాడ్కర్ తెలిపారు. యెడవనహళ్లి, హుస్కుర్గేట్ ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర్చిలపై సజ్జన్ కుమార్ దాడులు చేసినట్లు ఆరోపణలున్నాయి. క్రిస్టియన్లు ప్రార్థన చేసుకుంటున్న ప్రాంతంలో పార్కింగ్ చేసిన స్కూటర్‌కు నిప్పు పెట్టినట్లు కూడా అతడిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మతిగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.