జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది.