Vegitables merchent
-
‘సీక్రెట్ కోడ్’
ఫోన్ పే వచ్చాక వింతలూ విశేషాలూ బాగానే వైరల్ అవుతున్నాయి. చిన్నా చితక వ్యాపారులు స్కాన్ కోడ్‌ను రకరకాలుగా వేళ్లాడగడుతుంటారు. కాని ఈమె ఏకంగా తూకం గిన్నెకే అంటించింది. మహరాష్ట్రలో కూరగాయలామె చేసిన పనికి కోటి ఇరవై లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ‘భేషైన ఐడియా’ అంటున్నారు. మామూలుగా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవారు క్యూఆర్ కోడ్ స్టాండ్‌ను పెట్టుకుంటారు. అయితే ఆ ఖర్చు కూడా ఎందుకనుకుందో ఈ కూరగాయలామె కోడ్ కాగితాన్ని తూకం గిన్నె కింద అంటించేసింది. ఈ వీడియోలో వేరుశనక్కాయలను తూకం వేసిన ఆమె కొన్న వ్యక్తి సంచిలో వాటిని పోసి, అతను ఫోన్ పే ఉందా అనగానే టక్కున గిన్నె ఉల్టా చేసి చూపింది. ఆ స్టయిల్‌కు, ఆలోచనకు అందరికీ నవ్వు, ముచ్చటా కలుగుతున్నాయి. విపరీతంగా ఈ వీడియోను చూస్తున్నారు. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
-
పాసింజరా... గూడ్సా?
జయపురం: విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్ రైలు ప్రయాణికుల కోసమా లేక సరుకులు రవాణా కోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించటంలో, రక్షణ ఏర్పరచటంలో రైల్వే విభాగం విఫలమవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొరాపుట్ జిల్లాకు చెందిన ఒక ప్రయాణికుడు విశాఖపట్నం–కిరండూల్ రైలులో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో గురువారం వ్యక్తపరిచాడు. ఆయన విశాఖపట్నం నుంచి విశాఖ–కిరండూల్ రైలులో వస్తుండగా రైలు భోగీలలో సీట్లపై ప్రయాణికులకు బదులు కాయకూరల మూటలు దర్శనమిచ్చాయి. వాటిని తీయమనగా వినేనాథుడులేడు. ఈ విషయం టీటీకి తెలుపగా ఆయన అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సీట్లపైనే కాదు సీట్ల కింద, నడిచే మార్గంలో కాయకూరల మూటలు వేసి ఉండటంతో ప్రయాణికులు కూర్చొనేందుకు ఇక్కట్లు పడ్డారు. వాటిని తొలగించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు రైల్వే సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని కొంతమంది ఆరోపించారు. అసలు విశాఖపట్నం–కిరండూల్ పాసింజర్ రైలులో ప్రతి దినం ఇదే పరిస్థితి అని కొంతమంది వాపోయారు. అయినా రైల్వే అధికారులు గాని టీటీలు గాని పట్టించుకోరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ రైలులో కేవలం కాయకూరల మూటలే కాదని అన్ని వస్తువులను భోగీలలో అడ్డంగా పడవేసి ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తున్నారని పులువురు వెల్లడించారు. కట్టెలను బోగీల తులుపుల వద్ద ఉంచటం పరిపాటి అని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనవుతున్నారని కొంతమంది తెలిçపారు. రైల్వే అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా భోగీలలో కాయకూరల బస్తాలు, కట్టెల మోపులకు అనుమతించకుండా చూడాలని కోరుతున్నారు. -
రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం..
లుథియానా(పంజాబ్): 14 ఏళ్ల బాలుడు రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై చిన్నారి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో రైల్వే కాలనీలో సోమవారం వెలుగుచూసింది. అదే కాలనీలో కూరగాయలు అమ్మే బాలుడు చిన్నారిని ఆడుకుందామని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక ఎక్కడ చెబుతుందోనని భయపడిన అతడు ఇంట్లో పదునైన కత్తితో బాలిక గొంతు కోశాడు. అనంతరం బాలుడు ఇంటి బయట వైపు తాళం వేసి పరారయ్యాడు. కాగా, ఆడుకుందామని పిలిచి తన కూతురుపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాలికకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వైద్యుడు సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. బాలిక అత్యాచారానికి గురైనట్టు నిర్దారించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు.