‘సీక్రెట్‌ కోడ్‌’ | Vegetable-Selling Lady Jugaad For Digital Payment Gets Over 12 Million Views | Sakshi
Sakshi News home page

‘సీక్రెట్‌ కోడ్‌’

Published Sun, Sep 3 2023 4:21 AM | Last Updated on Sun, Sep 3 2023 4:21 AM

Vegetable-Selling Lady Jugaad For Digital Payment Gets Over 12 Million Views - Sakshi

ఫోన్‌ పే వచ్చాక వింతలూ విశేషాలూ బాగానే వైరల్‌ అవుతున్నాయి. చిన్నా చితక వ్యాపారులు స్కాన్‌ కోడ్‌ను రకరకాలుగా వేళ్లాడగడుతుంటారు. కాని ఈమె ఏకంగా తూకం గిన్నెకే అంటించింది. మహరాష్ట్రలో కూరగాయలామె చేసిన పనికి కోటి ఇరవై లక్షల వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు ‘భేషైన ఐడియా’ అంటున్నారు. మామూలుగా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవారు క్యూఆర్‌ కోడ్‌ స్టాండ్‌ను పెట్టుకుంటారు.

అయితే ఆ ఖర్చు కూడా ఎందుకనుకుందో ఈ కూరగాయలామె కోడ్‌ కాగితాన్ని తూకం గిన్నె కింద అంటించేసింది. ఈ వీడియోలో వేరుశనక్కాయలను తూకం వేసిన ఆమె కొన్న వ్యక్తి సంచిలో వాటిని పోసి, అతను ఫోన్‌ పే ఉందా అనగానే టక్కున గిన్నె ఉల్టా చేసి చూపింది. ఆ స్టయిల్‌కు, ఆలోచనకు అందరికీ నవ్వు, ముచ్చటా కలుగుతున్నాయి. విపరీతంగా ఈ వీడియోను చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement