Stand
-
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్‌లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్‌కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్‌లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్‌బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్‌లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
‘సీక్రెట్ కోడ్’
ఫోన్ పే వచ్చాక వింతలూ విశేషాలూ బాగానే వైరల్ అవుతున్నాయి. చిన్నా చితక వ్యాపారులు స్కాన్ కోడ్‌ను రకరకాలుగా వేళ్లాడగడుతుంటారు. కాని ఈమె ఏకంగా తూకం గిన్నెకే అంటించింది. మహరాష్ట్రలో కూరగాయలామె చేసిన పనికి కోటి ఇరవై లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ‘భేషైన ఐడియా’ అంటున్నారు. మామూలుగా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవారు క్యూఆర్ కోడ్ స్టాండ్‌ను పెట్టుకుంటారు. అయితే ఆ ఖర్చు కూడా ఎందుకనుకుందో ఈ కూరగాయలామె కోడ్ కాగితాన్ని తూకం గిన్నె కింద అంటించేసింది. ఈ వీడియోలో వేరుశనక్కాయలను తూకం వేసిన ఆమె కొన్న వ్యక్తి సంచిలో వాటిని పోసి, అతను ఫోన్ పే ఉందా అనగానే టక్కున గిన్నె ఉల్టా చేసి చూపింది. ఆ స్టయిల్‌కు, ఆలోచనకు అందరికీ నవ్వు, ముచ్చటా కలుగుతున్నాయి. విపరీతంగా ఈ వీడియోను చూస్తున్నారు. -
జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..?
ఆయన తెలంగాణ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కొడుకులను ఎన్నికల్లో దించాలని చాలాకాలంగా ఆలోచిస్తున్నారు. ఆయన కుమారులు కూడా తండ్రికి జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాని ఆ సీనియర్ నేత తాను కూడా బరిలోకి దిగాలానుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మొన్నటివరకు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న ఆ సీనియర్ మళ్ళీ బరిలోకి దిగాలని ఎందుకు అనుకుంటున్నారు? కుందూరు జానారెడ్డి గురించి తెలంగాణ రాజకీయాలు తెలిసినవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈయన ఇద్దరు కుమారులు ఇప్పటివరకు తెరముందుకు రాకపోయినప్పటికీ చాలాకాలం నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఎప్పటి నుంచో తన కుమారుల్ని ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి ఇదే సరైన సమయం అనుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నా కూడా జానారెడ్డి మాటను కాదనగల పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలా అయినా ఇద్దరిలో ఒకరిని.. కుదిరితే ఇద్దరినీ బరిలో దించేందుకు జానారెడ్డి పావులు కదుపుతున్నారట. వ్యూహంలో భాగంగానే.. జానారెడ్డి వ్యూహంలో భాగంగానే చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. నియోజకవర్గంలోని 90 తండాలను దాదాపు రెండు వారాల పాటు చుట్టి వచ్చేలా ప్రణాళికను వేసుకున్నారట. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తన యాత్రలో ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు మోసం చేస్తోందన్న విషయాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకుపోతున్నారట. గిరిజనుల నుంచి పాదయాత్రకు మంచి మద్దతే లభిస్తోందని కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారని టాక్. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారట జైవీర్ రెడ్డి. సీఎం కుర్చి కోసం.. ఈ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికల్లో సాగర్ నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ నేతలకు స్పష్టత ఇస్తున్నారట జైవీర్. అయితే కొందరు అనుచురులు మాత్రం చివరి నిమిషంలో జానారెడ్డి బరిలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తుందని భావిస్తున్న జానారెడ్డి ఈసారికి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే వాదన ఉంది. అయితే ఈ విషయంలో జానారెడ్డి ఇంత వరకు నోరు మెదపనప్పటికీ.. ఒకవేళ తండ్రి పోటీ చేస్తానంటే మాత్రం జైవీర్ తర్వాతి ఎన్నికల వరకు ఆగుతారని అంటున్నారు. ఇదే సమయంలో జానారెడ్డిని అసెంబ్లీకీ కాకుండా నల్లగొండ లోక్‌సభ నుంచి బరిలో నిలిపేతే ఎలా ఉంటుందా అని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఎలాగూ ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో లోక్‌సభకు జానారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ భావిస్తోందట. మొత్తంగా జైవీర్ పాదయాత్రతో సాగర్ కాంగ్రెస్‌లో ఓ కొత్త ఊపు వచ్చిందని చెబుతున్నారు. నిరంతర ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి ఎలా అయినా గెలవాలన్న కసితో ఉన్నా.. ఇన్నాళ్లు నాయకత్వం స్తబ్ధుగా ఉండటంతో నిరాశలో ఉండిపోయారు. తాజాగా పాదయాత్ర పేరుతో జైవీర్ లైన్లోకి రావడంతో శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయట. ఇదీ చదవండి: JP Nadda Tour: జేపీ నడ్డా తెలంగాణ పర్యటన లైవ్ అప్డేట్స్.. -
'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ!
ఎన్సీపీకి చెందిన కొందరు నేతలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ దీని గురించి విలేకరులతో మాట్లాడారు. ఎన్సీపీ సీనియర్ నేత జయంత్ పాటిల్‌ని ఎన్‌ఫోర్ట్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీని గురించి పవార్‌ని మీడియా ప్రశ్నించగా..కొందరూ నాయకులు పాలక వ్యవస్థ అంచనాలను అందుకోవడానికి నిరాకరించడంతో ఈ చర్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐతే వారు కష్టపడతారేమో కాని వారు ఎంచుకున్న మార్గం నుంచి మాత్రం ఎప్పటికీ తప్పుకోరని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్సీపీకి చెందిన సుమారు తొమ్మిది నుంచి పదిమంది నాయకుల విషయంలో కొంత అంచనాలను కలిగి ఉన్నారనే దాన్ని కొట్టిపారేయలేం అన్నారు. తాము ఆ అంచనాలను అందుకోవడానికి సిద్ధంగా లేమని, మా స్టాండ్ కోసం మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధమేనని కరాఖండీగా చెప్పారు. అలాగే తాము ఎంచుకున్న మార్గాన్ని ఎన్నటికీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. ఎన్సీపీ స్టాండ్‌ని చూసి కొందరూ(బీజేపీని ఉద్దేశించి) జీర్ణించుకోలేకపోవడంతోనే తాము బాధపడాల్సి వస్తుందని, ఐనా దాని గురించి తాము చింతించటం లేదని అన్నారు. తన వద్ధ విచారణ ఎదుర్కొన్న కీలకమైన 10 మంది నాయకుల జాబితా కూడా ఉందన్నారు. వారిలో కొందరు ఏజెన్సీ చర్యలను కూడా ఎదుర్కొన్నారు. అందుకు ఉదహరణగా మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురించి చెప్పుకొచ్చారు పవార్. ఒక విద్యాసంస్థ కోసం దేశ్‌ముఖ్ దాదాపు రూ.100 కోట్లు స్వీకరించారని ఆరోపణలు ఎదర్కొన్నారు. అందుకోసం సుమారు 13 నుంచి 14 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది కూడా. ఆ తర్వాత వచ్చిన మొత్తం రూ.100 కోట్లు కాదని రూ. 1.50 కోట్లని తేలింది. అప్పటికే దేశ్‌ముఖ్ పరువు పోయింది" ఆరోపణల స్థాయి ఇలా ఉంటుందంటూ అధికార దుర్వినయోగం గురించి పవార్ చెప్పుకొచ్చారు. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్) -
‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిట్ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమేనని, గతంలో సిట్ విచారించిన కేసులు ఎటు పోయా యని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వెళ్లిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, నయీం భూముల కేసులు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కేసు, హౌసింగ్‌బోర్డు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఎటు పోయిందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సిట్ తాళాలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వాదనలు వినిపించిందని, టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తాము కోర్టును కోరామని చెప్పారు. పేపర్ లీకేజీ అంశంలో ప్రవీణ్, రాజశేఖర్‌లతో పరిమితం కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, కస్టోడియన్ శంకరలక్షి్మని కూడా బాధ్యులుగా చేర్చాలని కోరారు. ఈ విషయాన్ని సమగ్రంగా దర్యాప్తు జరపాలని అడిగితే తనకు సిట్ నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కొలువుల కలవరం -
భక్తుల వాహనాలకు భద్రత
పార్కింగ్ స్టాండ్ల ఏర్పాటు రూ.61 వేలకు వేలం ఖరారు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఎట్టకేలకు వాహన పార్కింగ్ స్టాండ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సత్యదేవుని సన్నిధికి వచ్చిన భక్తుల వాహనాలు ‘బండి’పోటు ముఠా బారిన పడకుండా భద్రత కల్పిస్తుంది. భక్తులు తమ వాహనాలను భద్ర పర్చుకునేందుకు గాను దేవస్థానం టీటీడీ సత్రం స్థలంలో కార్ల స్టాండ్, సీఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బైక్ స్టాండ్లను ఏర్పాటు చేయడానికి దేవస్థానం నిర్ణయించింది. స్టాండ్ల ఏర్పాటుకు వేలంపాట కూడా నిర్వహించింది. బైక్ పార్కింగ్‌కు రూ.ఐదు, కారు పార్కింగ్‌కు రూ. పది రుసుం వసూలు చేయడానికి వేలం నిర్వహించగా నెలకు రూ.61 వేలకు హెచ్చు పాట ఖరారైందని దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తెలిపారు. -
జీవీకే పవర్ నష్టం రూ. 51 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 3 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 6.62 కోట్ల నుంచి రూ. 6.81 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలిపింది. అటు ఈ ఏడాది జూన్ 30 నాటికి జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) తీసుకున్న రూ. 7,843 కోట్ల మేర రుణాలకు పూచీకత్తు ఇచ్చినట్లు, వివిధ పెట్టుబడులపై రూ. 295 కోట్ల మేర నిధులు రావాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. బొగ్గు ధరల పతనం కారణంగా ఆస్తులకు మించి రుణభారంతో సతమతమవుతున్న జీవీకే కోల్ త్వరలో కోలుకోగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. -
క్రమంగా తొలుగుతున్న కిరణ్ టీం ముసుగు