![NCP Chief Sharad Pawar Said Ready To Pay The Price For Our Stand - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/23/pawar.jpg.webp?itok=PrZLa3V6)
ఎన్సీపీకి చెందిన కొందరు నేతలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ దీని గురించి విలేకరులతో మాట్లాడారు. ఎన్సీపీ సీనియర్ నేత జయంత్ పాటిల్‌ని ఎన్‌ఫోర్ట్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీని గురించి పవార్‌ని మీడియా ప్రశ్నించగా..కొందరూ నాయకులు పాలక వ్యవస్థ అంచనాలను అందుకోవడానికి నిరాకరించడంతో ఈ చర్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఐతే వారు కష్టపడతారేమో కాని వారు ఎంచుకున్న మార్గం నుంచి మాత్రం ఎప్పటికీ తప్పుకోరని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్సీపీకి చెందిన సుమారు తొమ్మిది నుంచి పదిమంది నాయకుల విషయంలో కొంత అంచనాలను కలిగి ఉన్నారనే దాన్ని కొట్టిపారేయలేం అన్నారు. తాము ఆ అంచనాలను అందుకోవడానికి సిద్ధంగా లేమని, మా స్టాండ్ కోసం మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధమేనని కరాఖండీగా చెప్పారు. అలాగే తాము ఎంచుకున్న మార్గాన్ని ఎన్నటికీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.
ఎన్సీపీ స్టాండ్‌ని చూసి కొందరూ(బీజేపీని ఉద్దేశించి) జీర్ణించుకోలేకపోవడంతోనే తాము బాధపడాల్సి వస్తుందని, ఐనా దాని గురించి తాము చింతించటం లేదని అన్నారు. తన వద్ధ విచారణ ఎదుర్కొన్న కీలకమైన 10 మంది నాయకుల జాబితా కూడా ఉందన్నారు. వారిలో కొందరు ఏజెన్సీ చర్యలను కూడా ఎదుర్కొన్నారు. అందుకు ఉదహరణగా మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురించి చెప్పుకొచ్చారు పవార్.
ఒక విద్యాసంస్థ కోసం దేశ్‌ముఖ్ దాదాపు రూ.100 కోట్లు స్వీకరించారని ఆరోపణలు ఎదర్కొన్నారు. అందుకోసం సుమారు 13 నుంచి 14 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది కూడా. ఆ తర్వాత వచ్చిన మొత్తం రూ.100 కోట్లు కాదని రూ. 1.50 కోట్లని తేలింది. అప్పటికే దేశ్‌ముఖ్ పరువు పోయింది" ఆరోపణల స్థాయి ఇలా ఉంటుందంటూ అధికార దుర్వినయోగం గురించి పవార్ చెప్పుకొచ్చారు.
(చదవండి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్)
Comments
Please login to add a commentAdd a comment