భక్తుల వాహనాలకు భద్రత | vehicle parking stand in annavaram | Sakshi
Sakshi News home page

భక్తుల వాహనాలకు భద్రత

Published Wed, Sep 28 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

vehicle parking stand in annavaram

పార్కింగ్‌ స్టాండ్ల ఏర్పాటు
రూ.61 వేలకు వేలం ఖరారు
అన్నవరం : అన్నవరం దేవస్థానం ఎట్టకేలకు వాహన పార్కింగ్‌ స్టాండ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సత్యదేవుని సన్నిధికి వచ్చిన భక్తుల వాహనాలు ‘బండి’పోటు ముఠా బారిన పడకుండా భద్రత కల్పిస్తుంది. భక్తులు తమ వాహనాలను భద్ర పర్చుకునేందుకు గాను దేవస్థానం టీటీడీ సత్రం స్థలంలో కార్ల స్టాండ్, సీఆర్‌ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బైక్‌ స్టాండ్లను ఏర్పాటు చేయడానికి దేవస్థానం నిర్ణయించింది. స్టాండ్ల ఏర్పాటుకు వేలంపాట కూడా నిర్వహించింది. బైక్‌ పార్కింగ్‌కు రూ.ఐదు, కారు పార్కింగ్‌కు రూ. పది రుసుం వసూలు చేయడానికి వేలం నిర్వహించగా నెలకు రూ.61 వేలకు హెచ్చు పాట ఖరారైందని దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement