in annavaram
-
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అన్నవరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం హైస్కూల్ ఎదుట ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కళాకారులు ఆలపించిన పంచరత్న కీర్తనలు, త్యాగరాజ కృతులు సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని మణి, కర్ణాటక సంగీత కళాకారిణి చాగంటి రమ్య కిరణ్మయి ఆలపించిన కీర్తనలు ఆహూతుల మన్ననలందుకున్నాయి. దేవస్థానం వ్రత పురోహిత సూపర్వైజర్ నాగాభట్ల కామేశ్వరశర్మ ఇంటి వద్ద నుంచి ఉదయం 7 గంటలకు నగర సంకీర్తన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చామర్తి పట్టాభి త్యాగరాజ స్వామి వేషధారణలో అందరినీ అలరించారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లికి చెందిన కె.కళ్యాణి భాగవతారిణి త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలు, సాయంత్రం ఐదు గంటలకు దేవస్థానం సంగీత విధ్వాంసుడు పెండ్యాల శ్రీనివాస్ నాదస్వర కచేరీ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ చాగంటి రమ్య కిరణ్మయి త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. అనంతరం హార్మోనియం విధ్వాంసుడు కాకరపర్తి అప్పారావును ఘనంగా సన్మానించారు. తొమ్మిదేళ్లుగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న ఇంద్రగంటి త్యాగరాజును పలువురు అభినందించారు. కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, యనమండ్ర సూర్యనారాయణ, విశ్రాంత ప్రధానార్చకులు నాగాభట్ల సత్యనారాయణ, వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు గాడేపల్లి నాని, కందర్ప శ్రీరామచంద్రమూర్తి, ఇంద్రగంటి నరసింహమూర్తి, బుర్రకథ కళాకారుడు మడిపల్లి వెంకట్రావు, పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు. -
రూ.18 లక్షలతో సత్యదేవుడి కొండకు రక్షణ గోడ
అన్నవరం : రత్నగిరి దిగువన తొలిపావంచా పక్కనే ఉన్న గార్డె¯ŒS వద్ద నుంచి దేవస్థానం క్వార్టర్స్ వరకూ మెయి¯ŒSరోడ్‌ను ఆనుకుని ఉన్న కొండకు రక్షణ గోడ నిర్మించే పనులను దేవస్థానం చైర్మ¯ŒS రాజా, ఐవీ రోహిత్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. రూ.18 లక్షల వ్యయంతో ఈ గోడ నిర్మిస్తున్నారు. గతంలో ఈ కొండను పలువురు ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. అలాగే వ్యాపారులు కూడా ఈ స్థలంలో పలు వ్యాపారాలు నిర్వహించేవారు. 2013లో అన్నవరం మెయి¯ŒSరోడ్ విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆక్రమణలు తొలగించారు. ఆ తరువాత దేవస్థానం స్ధలం ముందు స్తంభాలు పాతి కంచె నిర్మించారు. అయితే కంచె దాటి లోపల వ్యాపారులు హోర్డింగ్స్ వంటివి ఏర్పాటు చేయడం, ఆ కంచె కూడా బలహీనంగా ఉండడంతో కంచె తొలగించి రక్షణ గోడ నిర్మాణానికి ఈఓ కె.నాగేశ్వరరావు నిర్ణయించారని దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు తెలిపారు. ఆ రక్షణ గోడ కూడా ఇటుకలు సిమెంట్‌తో కాకుండా కొత్త పద్ధతిలో నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. ఇందులో వాడే సిమ్మెంట్ స్తంభాలకు ఇరువైపులా లోతుగా ఉంటుంది. ‡ ముందుగా గోతులు తవ్వి ఆ గోతులలో సిమ్మెంట్ స్తంభాలను పాతి కాంక్రీట్ వేస్తారు. అనంతరం స్తంభాల మధ్యలో సిమ్మెంట్ కాంక్రీట్ దిమ్మలు గోడ మాదిరిగా అతికించి దానిపై ప్లాస్టింగ్ చేసేస్తారు. భవిష్యత్‌లో ఈ రక్షణగోడ తొలగించాలనుకున్నా సిమ్మెంట్ స్తంభాలు, వాటి మధ్యలోని కాంక్రీట్ దిమ్మలను సులువుగా తొలగించి మరోచోట వాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దేవస్థానానికి పెట్రోల్ బంక్ వద్ద గల గార్డె¯ŒSకు కూడా ఇదే విదంగా రక్షణ గోడ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ గోడ నిర్మాణానికి రూ.21.5 లక్షల అంచనా వ్యయంతో టెండర్ పిలవగా రూ.18 లక్షలకు తక్కువ టెండర్ ఖరారైందన్నారు. దేవస్థానం డీఈ వి.రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో ‘కిషోర్’ షూటింగ్
అన్నవరం : అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై హీరో నిఖిల్, నూతన హీరోయి¯ŒS రీతూ వర్మ జంటగా నటిస్తున్న ‘కిషోర్ ’ సినిమా షూటింగ్ సోమవారం అన్నవరంలో సత్యదేవుని సన్నిధిన జరిగింది. సత్యదేవుని వ్రతమండపం వద్ద హీరో, హీరోయి¯ŒSలు ప్రసాదం తింటున్న దృశ్యాలను దర్శకుడు సుధీర్‌వర్మ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో చివరి షెడ్యూల్‌ను రెండ్రోజులు షూటింగ్ చేస్తామన్నారు. ప్రతీకారం ప్రధానాం శంగా సాగే సినిమాలో ఇక్కడ చిత్రీకరించే దృశ్యాలు కీలకమన్నారు. గతంలో ‘స్వామిరారా, దోచేవు’ సినిమాలకు దర్శకత్వం వహించానని, ఇది మూడో సినిమా అని చెప్పారు. హీరో నిఖిల్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, ఆ తరువాత ‘ఆలస్యం..అమృతం, స్వామి రారా, కార్తికేయ’ వంటి సినిమాలతో మంచి పేరు తె చ్చుకున్నాడని తెలిపారు. ‘కిషోర్’లో లో రావు రమేష్, ఈషా కోపీకర్, అజయ్ తదితరులు నటిస్తున్నారని తెలిపారు. సినిమాకు నిర్మాత అభిషేక్ , కెమేరామ¯ŒS దివాకర్ అని, సంగీత దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. పాటలకు మాత్రం ముగ్గురు యువ సంగీత దర్శకులు బాణీలు సమకూర్చారని, ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేస్తామని చెప్పారు. -
సత్యదేవుని సన్నిధిలో బదరికాశ్రమ పీఠాధిపతి
అన్నవరం : బెంగళూరుకు చెందిన ద్వారకా బదరికాశ్రమం పీఠాధిపతి విద్యానారాయణ తీర్థ స్వామీజీ శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద స్వామీజీకి పండితులు ఘనంగా స్వాగతం పలికారు. సత్యదేవుని దర్శనం తర్వాత వేదపండితులు ఆశీస్సులందచేసి స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు స్వామీజీ ఆశీస్సులు పొందారు. వారి వెంట వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, చిట్టి శివ ఉన్నారు. -
భక్తుల వాహనాలకు భద్రత
పార్కింగ్ స్టాండ్ల ఏర్పాటు రూ.61 వేలకు వేలం ఖరారు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఎట్టకేలకు వాహన పార్కింగ్ స్టాండ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సత్యదేవుని సన్నిధికి వచ్చిన భక్తుల వాహనాలు ‘బండి’పోటు ముఠా బారిన పడకుండా భద్రత కల్పిస్తుంది. భక్తులు తమ వాహనాలను భద్ర పర్చుకునేందుకు గాను దేవస్థానం టీటీడీ సత్రం స్థలంలో కార్ల స్టాండ్, సీఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బైక్ స్టాండ్లను ఏర్పాటు చేయడానికి దేవస్థానం నిర్ణయించింది. స్టాండ్ల ఏర్పాటుకు వేలంపాట కూడా నిర్వహించింది. బైక్ పార్కింగ్‌కు రూ.ఐదు, కారు పార్కింగ్‌కు రూ. పది రుసుం వసూలు చేయడానికి వేలం నిర్వహించగా నెలకు రూ.61 వేలకు హెచ్చు పాట ఖరారైందని దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తెలిపారు. -
అన్నవరంలో అరగంట ఉచిత ‘వైఫై’
అన్నవరం దేవస్థానంతో బెంగళూరుకు చెందిన కంపెనీ ఒప్పందం సెల్ సిగ్నల్స్ స్పష్టంగా అందించేందుకు ఏంటెన్నాల ఏర్పాటు ట్రాన్స్‌పోర్టు, సహజ కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాల పెంపు ఘాట్‌రోడ్ ముఖద్వారంలో హైమాక్స్ దీపాలు దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీర్మానాలు అన్నవరం : అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తులు ఇకపై అరగంట పాటు ఉచితంగా ‘వైఫై’ సదుపాయం పొందవచ్చు. ఇందుకు బెంగళూరుకు చెందిన ‘బాల్గో ఇన్ఫ్రా’ సంస్థ దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. శనివారం దేవస్థా నం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు, అధికారులతో జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ ఐదు ప్రముఖ సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ సిగ్నల్స్ అందించేందుకు దేవస్థానంలో ఐదు ఏంటెన్నాలను ఏర్పాటు చేస్తుందని, ఏంటెన్నాకు నెల కు రూ.ఐదు వేలు అద్దె చెల్లిస్తుంది. తద్వారా భక్తులకు పూర్తి స్థాయిలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో పాటు మొదటి అరగంట ‘వైఫై’ సిగ్నల్స్ ఉచితంగా వాడుకోవచ్చు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి కూడా లభించింది. మున్ముందు మరో రెండు సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల సేవలు కూడా ఆ కంపెనీ అందుబాటులోకి తెస్తుంది. సమావేశంలో పలు అంశాలను తీర్మానించారు. ముఖ్యమైన తీర్మానాలు –రత్నగిరి ఘాట్‌రోడ్‌లోని ఆర్చి గేటు ముందు రూ.6.60 లక్షలతో హైమాక్స్ విద్యుద్దీపాలు ఏర్పాటు l దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కండక్టర్లు, కాంట్రాక్ట్ కండక్టర్ల వేతనం రూ.8,500కు, అలాగే కాంట్రాక్ట్ డ్రైవర్లకు వేతనం రూ.10,500కు పెంచేలా కమిషనర్‌కు నివేదిక. –సహజ ప్రకృతి చికిత్సాలయ సిబ్బందిలో మసాజర్స్, ఇతర స్కిల్డ్ ఉద్యోగుల వేతనాన్ని రూ.7,500కి, సెంట్రీ, నైట్ వాచ్‌మన్ వంటి అన్‌స్కిల్డ్ ఉద్యోగుల వేతనాన్ని రూ.6,500కు పెంచేందుకు నిర్ణయం. –దేవస్థానంలో విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా పాత మోటార్ల స్థానంలో 5స్టార్ రేటింగ్ కలిగిన 11 సబ్మెర్సిబుల్ మోటార్లను రూ.ఏడు లక్షలతో కొనుగోలు చేసేందుకు టెండర్ పిలించేందుకు నిర్ణయం. –సీతారామ సత్రం ఉత్తరం వైపు బ్లాక్‌లో రూ.9.90 లక్షలతో బాత్రూమ్స్లో కొత్తగా టైల్స్ ఏర్పాటు, కొత్త పైపులు వేయడం వంటి పనులకు టెండర్ల ఆహ్వానం. అనంతరం దక్షణం వైపు బ్లాక్ మరమ్మతులకు కూడా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. -
మధ్యాహ్న భోజనానికి మంగళం
సత్యదేవ డిగ్రీ కళాశాలలో దూరప్రాంత విద్యార్థుల అవస్థలు గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించిన అన్నవరం దేవస్థానం అన్నదానం నిధులను దీనికి వెచ్చించరాదన్న ఉన్నతాధికారులు ఎలాగైనా కొనసాగించాలని కోరుతున్న విద్యార్థులు అన్నవరం : దూరప్రాంత విద్యార్థుల కోసం సత్యదేవ డిగ్రీ కళాశాలలో గత ఏడాది ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని అన్నవరం దేవస్థానం నిలిపివేసింది. దీంతో దూరప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి క్యారియర్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తరగతులకు ఆలస్యమవుతోందని వాపోతున్నారు. 400 మంది విద్యార్థులకు ప్రయోజనం అన్నవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యదేవ డిగ్రీ కళాశాలలో 630 మంది చదువుతున్నారు. వీరిలో 400 మంది శంఖవరం, రౌతులపూడి, తొండంగి, తుని మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు. వారి తల్లితండ్రులు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలుగా ఉంటూ తమ పిల్లలను కళాశాలలో చదివిస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి.. ఉదయాన్నే తమ పిల్లలకు భోజనం తయారు చేసి ఇవ్వడం ఇబ్బందికరమే. ఇంట్లో వంట పూర్తయిన తరువాత క్యారియర్ సర్దుకుని, సుమారు పది పదిహేను కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ విద్యార్థులు రావాల్సిన పరిస్థితి. దీంతో వారు కళాశాలకు ఆలస్యంగా వస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ 400 మంది విద్యార్థులకు అన్నదానం పథకం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ ఏడో తేదీన అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్‌తో కలిసి ఈఓ కె.నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించారు. గత మార్చి వరకూ దీనిని అమలు చేశారు. అన్నదాన పథకం ని««దlులను విద్యార్థుల భోజనానికి వెచ్చించడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అనుమతి నిరాకరించారు. ఫలితంగా ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తే మేలు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసి ఉంటే ఈ ఇబ్బంది తలెత్తి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 400 మంది విద్యార్థులకు భోజనం అంటే రోజుకు కనీసం రూ.10 వేల ఖర్చవుతుంది. ఏడాదికి ఎనిమిది నెలలు కళాశాల పని చేస్తుందనుకుంటే మధ్యాహ్న భోజనానికి సుమారు రూ.25 లక్షలు అవసరం. దేవస్థానం 50 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్ ద్వారా ఈ పథకాన్ని కొనసాగిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. సాంకేతిక కారణాలతోనే.. డిగ్రీ కళాశాలలో మ«ధ్యాహ్న భోజనం పథకాన్ని సాంకేతిక కారణాలతో నిలిపివేయాల్సి వచ్చింది. అన్నదాన పథకం నిధులతో ఈ పథకాన్ని నిర్వహించాలని అనుకున్నా సాధ్యపడలేదు. అన్నదాన పథకంలో బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెట్టడంతో రోజూ ఎంతమంది భోజనం చేస్తున్నారో స్పష్టంగా లెక్క తెలుస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం.– కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
మూడు నెలల్లో
రత్నగిరిపై యోగ, ఆయుర్వేద వైద్య సేవలు ‘సాక్షి’ వార్తలతో దిగివచ్చిన ‘బెంగళూర్ యోగ, ఆయుర్వేద యూనివర్సిటీ సహజ ఆసుపత్రిని సందర్శించిన యూనివర్సిటీ ప్రతినిధులు అన్నవరం : అన్నవరం దేవస్థానంలో అధునాతన పరికరాలతో యోగ, ఆయుర్వేద వైద్యం అందిస్తామని చెప్పి బెంగళూరులోని వివేకానంద యోగ, ఆయుర్వేద యూనివర్సిటీ రూ.30 లక్షలు తీసుకుని నాలుగునెలలైనా పనులు ప్రారంభించకపోవడంపై ‘సాక్షి’ ఈనెల 21న ‘ఆ యోగం కలిగేనా?’ శీర్షికన ప్రచురించిన కథనానికి దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించండంతో బెంగళూరు యూనివర్సిటీ అధికారులు దిగివచ్చారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి ఆ యూనివర్సిటీ హైదరాబాద్ విభాగ సభ్యుడు కేఎస్ఆర్ మూర్తి, ప్రతినిధి సుందరరామయ్య, ఇంజినీర్ బుచ్చిరాజు తదితరులు వచ్చారు. అక్టోబర్ నాటికల్లా పనులన్నీ పూర్తి చే యించి, యోగా, ఆయుర్వేద వైద్యం ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాదు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో కలసి సహజ ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించి, యోగ, ఆయుర్వేద వైద్యం కోసం అందులో చేయాల్సిన మార్పులపై చర్చించారు. సహజ ఆసుపత్రిని కిందకు మారుస్తాం ప్రస్తుతం దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి చికిత్సాలయంలో 26 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. వివేకానంద యోగ యూనివర్సిటీ ప్రారంభించనున్న యోగ, ఆయుర్వేద వైద్యం కోసం సహజ భవనంలో మార్పులు చేయడానికి వీలుగా తాత్కాలికంగా సహజ ఆసుపత్రిని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి మారుస్తాం. వారు భవనంలో ఏ మార్పు చేయడానికైనా సహకరిస్తాం. సాధ్యమైనంత త్వరగా యోగ, ఆయుర్వేద వైద్యం అందించాలన్నదే మా ధ్యేయం. – కే నాగేశ్వరరావు, ఈఓ మార్పులు శాశ్వతంగా ఉండేలా చేయాలి వివేకానంద యూనివర్సిటీకి 11 సంవత్సరాలు మాత్రమే యోగ, ఆయుర్వేద వైద్యం అందించడానికి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత ఈ భవనంలో దేవస్థానం సొంతంగా ఈ వైద్యం అందించడానికి వీలుగా భవనంలో మార్పులు ఉండాలి. మరలా మేము కొత్తగా మార్పులు చేసుకునేలా ఉండకూడదు. అందుకే ఏ మార్పులు చేయాలని అనుకుంటున్నారో! వాటిని ప్లాన్ రూపంలో అందజేయాలని కోరాం.– ఐవీ రోహిత్, దేవస్థానం చైర్మన్ మూడు నెలల్లో మార్పులు చేసి వైద్య సేవలందిస్తాం యూనివర్సిటీ నిపుణులు అందించే యోగ, నేచురోపతి, ఆయుర్వేదం వైద్యం కోసం సహజ ప్రకృతి చికిత్సాలయ భవనంలో మార్పులు చేయాల్సి ఉంది. వాస్తు రీత్యా ప్రస్తుతం ఉన్న మార్గాన్ని మూసి, ఉత్తరం వైపునుంచి మార్గం ఏర్పాటు చేస్తాం. అక్కడి ఘాట్ రోడ్లో నుంచి ర్యాంప్ ఏర్పాటు చేస్తాం. గదులన్నీ ఆధ్యాత్మికత, ప్రశాంత వాతావరణం ఉట్టిపడేలా తయారు చేస్తాం. స్పీనల్ స్ప్రే, హిప్ బాత్, ఫుట్ అండ్ హార్మ్ బాత్, అండర్ వాటర్ మసాజ్, లోకల్ స్టీమ్ బాత్ తదితర 20 యోగ, ఆయుర్వేద చికిత్సలు ఇక్కడ నిర్వహించేంలా మార్పులు చేస్తాం. శిరోధార, మడ్ బాత్, వంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం సహజలో దేవస్థానం ఒక రోజు చికిత్సకు రూ.250 వసూలు చేస్తోంది. అయితే మేము చేసే చికిత్సలో మూడు రకాల ఫీజులు ఉంటాయి. రూ.500 నుంచి రూ.వేయి వరకూ వసూలు చేస్తాం. దానికి తగ్గట్టుగానే వైద్యం లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను అక్టోబర్‌లో ఈ వైద్యం ప్రారంభమయ్యేలా చేస్తాం. – కేఎస్ఆర్ మూర్తి