సత్యదేవుని సన్నిధిలో ‘కిషోర్’ షూటింగ్
సత్యదేవుని సన్నిధిలో ‘కిషోర్’ షూటింగ్
Published Mon, Jan 2 2017 10:22 PM | Last Updated on Tue, Oct 2 2018 3:08 PM
అన్నవరం :
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై హీరో నిఖిల్, నూతన హీరోయి¯ŒS రీతూ వర్మ జంటగా నటిస్తున్న ‘కిషోర్ ’ సినిమా షూటింగ్ సోమవారం అన్నవరంలో సత్యదేవుని సన్నిధిన జరిగింది. సత్యదేవుని వ్రతమండపం వద్ద హీరో, హీరోయి¯ŒSలు ప్రసాదం తింటున్న దృశ్యాలను దర్శకుడు సుధీర్‌వర్మ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో చివరి షెడ్యూల్‌ను రెండ్రోజులు షూటింగ్ చేస్తామన్నారు. ప్రతీకారం ప్రధానాం శంగా సాగే సినిమాలో ఇక్కడ చిత్రీకరించే దృశ్యాలు కీలకమన్నారు. గతంలో ‘స్వామిరారా, దోచేవు’ సినిమాలకు దర్శకత్వం వహించానని, ఇది మూడో సినిమా అని చెప్పారు. హీరో నిఖిల్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, ఆ తరువాత ‘ఆలస్యం..అమృతం, స్వామి రారా, కార్తికేయ’ వంటి సినిమాలతో మంచి పేరు తె చ్చుకున్నాడని తెలిపారు. ‘కిషోర్’లో లో రావు రమేష్, ఈషా కోపీకర్, అజయ్ తదితరులు నటిస్తున్నారని తెలిపారు. సినిమాకు నిర్మాత అభిషేక్ , కెమేరామ¯ŒS దివాకర్ అని, సంగీత దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. పాటలకు మాత్రం ముగ్గురు యువ సంగీత దర్శకులు బాణీలు సమకూర్చారని, ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement