రూ.18 లక్షలతో సత్యదేవుడి కొండకు రక్షణ గోడ | protection wall construction in annavaram | Sakshi
Sakshi News home page

రూ.18 లక్షలతో సత్యదేవుడి కొండకు రక్షణ గోడ

Published Tue, Jan 3 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

protection wall construction in annavaram

అన్నవరం : 
రత్నగిరి దిగువన తొలిపావంచా పక్కనే ఉన్న గార్డె¯ŒS వద్ద నుంచి దేవస్థానం క్వార్టర్స్‌ వరకూ మెయి¯ŒSరోడ్‌ను ఆనుకుని ఉన్న  కొండకు  రక్షణ గోడ నిర్మించే పనులను దేవస్థానం చైర్మ¯ŒS రాజా, ఐవీ రోహిత్‌ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. రూ.18 లక్షల వ్యయంతో ఈ గోడ నిర్మిస్తున్నారు.
గతంలో ఈ కొండను పలువురు ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. అలాగే వ్యాపారులు కూడా ఈ స్థలంలో పలు వ్యాపారాలు నిర్వహించేవారు. 2013లో అన్నవరం మెయి¯ŒSరోడ్‌ విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆక్రమణలు తొలగించారు. ఆ తరువాత దేవస్థానం స్ధలం  ముందు స్తంభాలు పాతి కంచె నిర్మించారు. అయితే కంచె దాటి లోపల వ్యాపారులు  హోర్డింగ్స్‌ వంటివి ఏర్పాటు చేయడం, ఆ కంచె కూడా బలహీనంగా ఉండడంతో కంచె తొలగించి రక్షణ గోడ నిర్మాణానికి ఈఓ కె.నాగేశ్వరరావు నిర్ణయించారని దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు తెలిపారు.  
ఆ రక్షణ గోడ కూడా ఇటుకలు సిమెంట్‌తో కాకుండా కొత్త పద్ధతిలో నిర్మిస్తున్నామని ఆయన వివరించారు.  ఇందులో వాడే సిమ్మెంట్‌ స్తంభాలకు ఇరువైపులా లోతుగా ఉంటుంది. ‡ ముందుగా గోతులు తవ్వి ఆ గోతులలో  సిమ్మెంట్‌ స్తంభాలను   పాతి కాంక్రీట్‌ వేస్తారు. అనంతరం   స్తంభాల మధ్యలో సిమ్మెంట్‌ కాంక్రీట్‌ దిమ్మలు గోడ మాదిరిగా అతికించి దానిపై  ప్లాస్టింగ్‌ చేసేస్తారు.  భవిష్యత్‌లో ఈ రక్షణగోడ తొలగించాలనుకున్నా సిమ్మెంట్‌ స్తంభాలు, వాటి మధ్యలోని కాంక్రీట్‌ దిమ్మలను సులువుగా తొలగించి మరోచోట వాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దేవస్థానానికి పెట్రోల్‌ బంక్‌ వద్ద గల గార్డె¯ŒSకు కూడా ఇదే విదంగా రక్షణ గోడ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ గోడ నిర్మాణానికి రూ.21.5 లక్షల అంచనా వ్యయంతో టెండర్‌ పిలవగా రూ.18 లక్షలకు తక్కువ టెండర్‌ ఖరారైందన్నారు. దేవస్థానం డీఈ వి.రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement