Malla Reddy Ch
-
కవితకు ఈడీ నోటీసులు.. మంత్రి మల్లారెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలల తర్వాత తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో కేంద్రంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మట్లాడుతూ..‘కేంద్రంలోని బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. వాళ్ల జిమ్మిక్కులు, మానసికంగా, రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారు. నా మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. కానీ, ఏమైంది. రాజకీయాల్లో అదొక పార్ట్ మాత్రమే. వాళ్ల చేతిలో ఐటీ, ఈడీలు మాత్రమే ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. ఇదే సయమంలో తెలంగాణలో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అయ్యింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగింది. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐటీలో కూడా మనం బెంగళూరును మించిపోయాం. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఈడీ హీట్.. సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత -
‘మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఇవాళ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే కుట్ర జరుగుతోందని.. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది శ్రీనివాస్‌రెడ్డి తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న భూమిని మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్‌రెడ్డి అనే ఇద్దరు.. సుంకరి అనే కుటుంబం నుంచి భూమిని కొనుగోలు చేశారు. మొత్తం ఎనిమిది ఎకరాల్లో.. 4.5 ఎకరాలు కొన్నారు వీళ్లు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద 2 ఎకరాలు కొన్నారు. అయితే మొత్తం భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వీళ్లు. భూమి వద్దకు వెళ్లిన మాపై మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారు. మంత్రి బామర్ది శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా గన్‌తో షూట్ చేస్తానంటూ బెదిరించాడు. భూమిని వదిలి వేళ్లాలని మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు పిర్యాదు చేసినా.. రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదు. భూ రికార్డుల నుండి మా పేరు తొలగించి.. అక్రమంగా మంత్రి వారి పేరు పై మార్చుకున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నాం అని బాధితులు మీడియా ముందు వాపోయారు. మంత్రి మల్లారెడ్డి చాలా మంది రైతులను మోసం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాం అని బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డిలు మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డిగానీ, శ్రీనివాసరెడ్డిగానీ స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: మేం తిరగబడితే.. మీరెక్కడా తిరగలేరు! -
ఎన్నికల స్టంటే అనుకో!: మంత్రి మల్లారెడ్డి టంగ్‌స్లిప్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి కామెంట్లతో వార్తల్లోకెక్కారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్యానించారాయన. టీఎస్సార్సీటీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంపై ఉద్యోగుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం పీర్జాదిగూడ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా.. TSRTC కార్మికులకు డబుల్కా మీటాలాగా.. ఊహించని విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా?అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సవరించుకుని.. ‘‘ఎన్నికల కోసమే అయినా కార్మికులకు మంచి జరిగింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే దమ్ము, ఫండ్స్ ఉండాలి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారాయన. ఇదీ చదవండి: మెట్రో విస్తరణ వాళ్ల లబ్ధి కోసమే! -
డీజే టిల్లు సాంగ్‌కు మల్లారెడ్డి డ్యాన్స్
-
డీజే టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు, డీజే టిల్లు మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సిద్ధుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పలేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో మల్లారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి) -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్‌నగర్, శామీర్‌పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. సొంత పార్టీ నేతల వార్నింగ్!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. నామినేటెడ్ పదవుల పంపకంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు తాను చెబితేనే పనులు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంత్రి పెత్తనాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్ శాసనసభ్యులు.. ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. మైనంపల్లితో పాటు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రి వ్యవహారశైలిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో మేడ్చల్‌కే ప్రాధాన్యతనిస్తూ.. మిగతా సెగ్మెంట్లకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం.. ‘మా నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికార పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? మంత్రి మల్లారెడ్డి ఒకదారి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు మరొకదారి.. ఈ ఇద్దరి వల్ల విసిగిపోయాం.. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన వారే అయోమయానికి గురిచేస్తూ జిల్లాలో పార్టీని భ్రషు్టపట్టిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీకి తీవ్ర కళంకాన్ని తెస్తున్నారు..’ అంటూ సమావేశంలో నేతలు చర్చించుకున్నారు. వారిని వెంటనే తప్పించి కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విషయం కూడా చర్చించారు. పార్టీ పరువు తీస్తున్నారు! కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలను సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉండగా..మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురి చేస్తూ పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆరే ప్రకటించినప్పటికీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు నేతలు పలు నియోజకవర్గాల్లో టికెట్ తమకే వస్తుందంటూ కార్యకర్తలను డైలమాలో పడేస్తున్నారని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నాం: ఎమ్మెల్యేలు జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగతా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సోమవారం ప్రత్యేక భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి తీరును నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే మీడియా ముందుకు రావాల్సివచి్చందని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, చేష్టలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా.. రాత్రికి రాత్రే జీవో జారీ చేసి భాస్కర్ యాదవ్‌ను నియమించి, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారని విమర్శించారు. మంత్రి గతంలో పదవులను పొందిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కేడరే బలమని, అలాంటి కేడర్‌ను విస్మరిస్తే పార్టీ దెబ్బతినే అవకాశముందన్నారు. పార్టీ కేడర్‌ను రక్షించుకునేందుకే మీడియా ముఖంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయాన్ని తెలుపుతున్నామని, వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..
మేడ్చల్ రూరల్: దేశంలో అతిపెద్ద ఐటీ దాడి తనపైనే జరిగిందని, అది కూడా రికార్డేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్స్ ఆడిటోరియంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇటీవల జరిగిన ఐటీ దాడి మూడోసారి కావడంతో.. హ్యాట్రిక్‌గా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పాల వ్యాపారం నుండి మంత్రి స్థాయికి ఎదిగానని.. అందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్నారు. తన విద్యాసంస్థల్లో పదివేల మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని.. అందుకు డిగ్రీలు అవసరం లేదని.. లక్ష్యం ఉంటే చాలని మంత్రి మల్లారెడ్డి ఉద్బోధించారు. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో భాగంగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాలేజీల్లో పనిచేసే వారిని కూడా విచారిస్తున్నారు. అయితే, తాజాగా మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కాగా, మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ పంపించారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ.. ఈడీకి తెలిపింది. కాగా, ఈ కేసులో ఈడీ దర్యాప్తు అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక, మెడికల్ సీట్లు, డొనేషన్లలో అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ అధికారులు ఈడీని కోరారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లలో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు 18 కోట్ల రూపాయలు, లాకర్లను పగులగొట్టి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, దర్యాప్తులో భాగంగా విదేశాల్లో పెట్టుబడులు, విదేశాలకు డబ్బు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో, ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. ఈడీ విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ భావిస్తున్నది. కాగా, ఈ లేఖపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. -
మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ముగిసిన విచారణ
-
మల్లారెడ్డి కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ.. కొడుకు, అల్లుడు ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరిగిన ఈడీ, ఐటీ దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కాగా, పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో మల్లారెడ్డి సహా మరో 16 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఇక, ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ఐటీ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. ఐటీ అధికారులు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించారు. కాగా, విచారణ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము. ఈరోజు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారు మాత్రమే విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం కాలేజీల ప్రిన్స్‌పాల్స్, అకౌంటెంట్స్ అందరూ విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి తెలిసిన వివరాలను అధికారులకు సవివరంగా చెప్పారు. ఐటీ అధికారులు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా విచారణకు ప్రతీ ఒక్కరూ వస్తారు. అధికారులు చెప్పిన ఫార్మాట్ ప్రకారం కాలేజీ డేటాను వారికి అందించాము. ఇక, మొదటి రోజు 12 మంది విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది. -
ఐటీ దాడుల వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి.. కేసీఆర్ రెస్పాన్స్?
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పొలిటికల్ లీడర్లే లక్ష్యంగా ఈ దాడులు జరగడం రాజకీయంగా పెను దుమారం రేగింది. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడుల సందర్భంగా కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్ద డ్రామానే జరిగింది. అయితే, రాష్ట్రంలో ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసే వార్తల్లో నిలిచారు. కాగా, మల్లారెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు చేయించేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను మినహాయింపు ఇస్తాము. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా పన్నులు చెల్లించేలా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకువస్తారు. అప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తాము. కేసీఆర్ నా వెంట ఉన్నంత వరకు నేను ఏ రైడ్లకు భయపడను’ అని కామెంట్స్ చేశారు. -
మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ దాడుల వ్యవహారం హాట్ టాపిక్ మారింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ అనూహ్య దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. కాగా, దాడుల సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐటీ అధికారులపై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో, భద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఫిర్యాదుపై నాలుగు వారాల పాటు కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
2024లో కేసీఆరే ప్రధాని
నల్గొండ రూరల్ : 2024లో జరిగే ఎన్నికల్లో కేసీఆరే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఆరెగూడెం ఇన్ చార్జ్ గా నియమితులైన ఆయన శుక్రవారం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని, కానీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆ రాష్ట్రాల సీఎంలకు దమ్ము సరిపోవడంలేదన్నారు. సీఎం కేసీఆర్ దమ్మున్న లీడరని, బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.22కోట్లకు మునుగోడు నియోజకవర్గాన్ని గుత్తకు ఇచ్చిందన్నారు. ప్రచారంలో ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరెగూడెంలో వృద్ధులతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు రావు మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తాను ఇన్ చార్జ్ గా నియమితులైన మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి, రెడ్డిబావి, సైదాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆరెగూడెంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధులతో, రైతులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలను గూర్చి వివరించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నరేళ్లలో ఏనాడూ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి రూ.100కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పంతంగి–గుండ్లబావి రోడ్డు వేయించాలని మంత్రి జగదీశ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మునగాల ప్రభాకర్‌రెడ్డి, బచ్చ రామకృష్ణ, నాయకులు జక్క వెంకట్‌రెడ్డి, మంద సంజీవరెడ్డి, జాల మల్లేశ్‌యాదవ్, నందగిరి శ్యామ్, మునగాల దామోదర్‌రెడ్డి, బచ్చ మల్లేశం, పల్లె లింగస్వామి, దుర్గం రాజు, కొలను ఆగిరెడ్డి పాలొన్నారు. -
మల్లారెడ్డా మజాకా.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఎవరి నోట విన్నా మునుగోడు పాలిటిక్స్ గురించే చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలుపే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. ఇక, శనివారం మునుగోడులో ప్రజాదీవెన బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. మరోవైపు.. మునుగోడు సభకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రులు సైతం హుషారుగా సభకు విచ్చేస్తున్నారు. కాగా, మునుగోడుకు వస్తున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ ఈరోజు హైలైట్ ఆఫ్ ది డేగా చెప్పుకోవచ్చు. తన కాన్వాయ్‌లో వస్తున్న మల్లారెడ్డి ఓపెన్ టాప్ కారులో నిల్చుని ఊరా మాస్ డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ఇక, కారు దిగిన అనంతరం కూడా మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు. ఆయన డ్యాన్స్ చేయడంతో అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ పెరిగి మంత్రితో వారు కూడా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: మునుగోడు సభకు.. సీఎం కేసీఆర్ కారెక్కనున్న చాడ వెంకట్‌రెడ్డి! -
నాపై దాడి వెనుక రేవంత్ హస్తం: మల్లారెడ్డి
రసూల్‌పురా(హైదరాబాద్)/ఘట్కేసర్: తనపై దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హస్తముందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నందునే తన అనుచరులతో రెడ్డిసింహగర్జన సభలో తనపై దాడి చేయించారని అన్నారు. సోమవారం మంత్రి బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్‌పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా రేవంత్‌రెడ్డి తనను బ్లాక్మెయిల్ చేస్తు న్నారని, ఇదే విషయాన్ని గతంలో కూడా తాను చెప్పానని మల్లారెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని, అయినా తాను భయపడనని చెప్పారు. సింహగర్జన సభలో రెడ్డి సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తుండగా తనకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారని.. చివరకు తనపై, తన కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసిరి దాడికి దిగారని తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో కరోనా కారణంగా జాప్యం జరిగిందని, ఇదే అంశాన్ని తాను సభా వేదికపై చెబుతున్న సమయంలోనే తన ప్రసంగానికి అడ్డుపడ్డారని మంత్రి తెలిపారు. తనమీద దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎంపీ రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, మేడ్చల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు మంత్రిపై దాడి చేసిన వారిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి జరిగిన రెడ్ల సింహగర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి సభావేదికపై మాట్లాడుతుండగా రేవంత్‌రెడ్డి అనుచరులైన మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి.. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ దుర్భాషలాడుతూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా మరికొందరు రేవంత్ అనుచరులు మంత్రి కాన్వాయ్‌పై నీళ్ల్లబాటిళ్లు, కుర్చీలతో దాడి చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఫిర్యాదు మేరకు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కేసులో ఏ1గా సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, ఏ2గా సోమశేఖర్‌రెడ్డి పేర్లను పేర్కొన్నారు. -
డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికార మదంతో అక్రమాలతో దుష్ట పాలన సాగిస్తోందని.. కళ్లు నెత్తికెక్కి మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూల్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారని ఉత్తమ్ చెప్పారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు భూమి, ఇసుక, మద్యం డీల్ చేయగా ఇప్పుడు డ్రగ్స్ దందాలో కూడా వేలు పెట్టారని తెలిపారు. కర్ణాటకలో బీజేపీతో మాట్లాడుకొని కేసును మాఫీ చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన ఉందని, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తిని పోటీలో పెట్టిందని వివరించారు. సాగర్‌కు నీళ్లు రావు.. ఎడారిగా మారుతోందనే విషయం ఓటర్లు గమనించాలని సూచించారు. టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సాగర్ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని సందేహం వ్యక్తం చేశారు. డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ కర్ణాటకలో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారు అని నిలదీశారు. చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు చదవండి: ‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య -
మంత్రి మల్లారెడ్డికి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రతినిధులపై నమోదైన పలు కేసులు నేడు కోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. వేర్వేరు కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కోర్టుకు హాజరయ్యారు. అయితే వీరిలో బండి సంజయ్‌కు ఊరట లభించగా, మంత్రి మల్లారెడ్డి, దానం నాగేందర్‌లు మరో వాయిదాకు హాజరుకాక తప్పదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్‌పై కరీంనగర్లో నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టి వేయగా, తన కేసును కూడా కొట్టివేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో మంత్రి మల్లారెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 11న మంత్రి మల్లారెడ్డి కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
‘మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండటం మన ఖర్మ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉండటం మన కర్మ అని, ప్రజలు చేసుకున్న పాపం అని ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ఉండాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరించి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలివేస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో కార్మికులు సమ్మెచేసే పరిస్థితి లేదని వాపోయారు. జగన్ నిర్ణయం సరైనదే..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొనగాడు అని నాయిని కితాబు ఇచ్చారు. జగన్ ప్రైవేట్ రంగంలో లోకల్ వారికి 75 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ కూడా అది అమలు చేయాలని కోరారు. 3 రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ బినామిలే అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
-
పెండింగ్ పనులు పూర్తి చేయండి: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సీహెచ్.మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. కార్మిక, పరిశ్రమ, ఉపాధి కల్పన శాఖ అధికా రులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శాఖాపరంగా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పూర్తి చేసిన పెండింగ్ పనులను వెబ్సైట్లో పొందుపర్చాలని ఆదేశించారు. -
గత పాలకులు దోచుకున్నారు
చేవెళ్ల: గత పాలకులు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్నారని.. ప్రజల కోసం చేసింది ఏమీ లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఆయన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి గట్టు రాంచందర్‌రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్ ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఐదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభ్యున్నతిని చూసి ప్రజలు మరోసారి భారీ మోజార్టీతో గెలిపించి ఆశీర్వదించారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లుగా ఏమి చేయని ఆయా పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిఇంట్లో ఒకరు ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందిన వారే ఉన్నారన్నారు. అందుకే జనం గులాబీ పార్టీ పక్షం నిలబడ్డారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను అత్యధిక మోజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా అంటేనే ప్రత్యేకంగా ఉండాలని, దీనికి కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈనెల 9న జరిగే కేటీఆర్ బహిరంగ సభను చేవెళ్లలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందికి తక్కువ కాకుండా బహిరంగసభకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చేవెళ్లలో కేటీఆర్ పాల్గొనే సభా స్థలాన్ని మంత్రి తదితరులు పరిశీలించారు. సభ అదిరిపోవాలి: గట్టు రాంచందర్‌రావు రాబోయే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికులుగా పనిచేయాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి గట్టు రాంచందర్‌రావు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9న చేవెళ్లలో ఎంపీ ఎన్నికల సన్నాహక బహిరంగ సభ జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి దశదిశ నిర్దేశించేందుకు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎంపీ సీటును సాధిస్తామనే ధీమా ఈ సభ ద్వారా కలిగించాలని చెప్పారు. భారీగా జన సమీకరణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, డాక్టర్ ఆనంద్, మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వీరు మాట్లాడుతూ.. బహిరంగ సభ కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అత్యధిక ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సభద్వారా టీఆర్ఎస్ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు తెలుస్తుందన్నారు. చేవెళ్ల ఎంపీ సీటు గెలుపు ఖాయమనే ధీమాను ఈ సభ ద్వారా కేటీఆర్ఎకు ఇస్తామని చెప్పారు. సమావేశంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు నాగేందర్‌గౌడ్, పర్యాద కృష్ణమూర్తి, కొండల్‌రెడ్డి, స్వప్న, నారాయణ, రాంనర్సింహ్మారెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి, సుజాత, చేవెళ్ల ఎంపీపీ బాల్‌రాజ్, పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పలువురు సర్పంచులు ఉన్నారు. -
‘మన కూరగాయలు’ చాలా కాస్ట్ గురూ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టిన ‘మనకూరగాయలు’ రిటైల్ విక్రయ కేంద్రాల్లో ధరలు హాట్ హాట్‌గా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూపార్కులో ‘మన కూరగాయల’ రిటైల్ విక్రయ కేంద్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. తాజా కూరగాయలు తక్కువ ధరలో విక్రయించాలనే సంకల్పంతో ‘మన కూరగాయల’ రిటైల్ కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. జన సంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేల్స్మెన్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రాన్ని ప్రత్యేక క్యాబిన్లో ఏర్పాటు చేశారు. కూరగాయలు తాజాగా ఉండేందుకు ఏసీని సైతం ఏర్పాటు చేశారు. అన్నిరకాల కూరగాయలతో పాటు పండ్లను ఈ కేంద్రంలో అమ్మకానికి పెట్టారు. అయితే మన కూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు చూసి వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బయట మార్కెట్ ధరల కంటే సుమారు కిలోకు రూ.5 నుంచి 10 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. సూపర్ మార్కెట్ల కంటే అదనంగా రేట్లు ఉండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. బయటి మార్కెట్ కం టే సూపర్మార్కెట్లో కొంతమేర అధిక ధరలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మనకూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు ఉండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో వ్యవసాయ మార్కె టింగ్ శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం మూలంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలనకు మన కూరగాయలు తాజా కూరగాయలను అందించడంతో పాటు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయాలను అందించే లక్ష్యంగా ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చునని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కూరగాయలు లభిస్తాయన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరికొన్ని మనకూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మోండా మార్కెట్ కార్పొరేటర్ రూప, నగేశ్ ఉన్నారు. -
దలైలామాను కలిసిన ఎంపీ మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ధర్మశాలకు వెళ్లిన ఆయన...బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేపడుతున్న చర్యల గురించి దలైలామాతో ప్రత్యేకంగా చర్చించినట్లు ఎంపీ ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ మల్లారెడ్డి వెంట సామాజిక న్యాయం, సాధికారత శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ రమేశ్ బేయాస్, ఇతర కమిటీ సభ్యులున్నారు.