'బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి' | mp malla reddy foundation to development works in malkajgiri | Sakshi
Sakshi News home page

'బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి'

Published Sun, Nov 20 2016 8:43 PM | Last Updated on Fri, Aug 10 2018 4:35 PM

'బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి' - Sakshi

'బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి'

హైదరాబాద్‌ : బంగారు తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, భరత్‌నగర్, బర్షిపేట ప్రాంతాలలో 29.80 లక్షల నిధులతో ఆట స్ధలం, భూగర్భ డ్రైనేజి పనులకు స్ధానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్తో కలసి ఆయన శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కెజి టు పిజి, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎంపీ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement